Krishna

News January 10, 2026

కృష్ణా జిల్లాలో ఎస్ఐల బదిలీ

image

ఇటీవల జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విద్యాసాగర్ నాయుడు జిల్లా పోలీస్ శాఖను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త టీమ్‌ను తయారు చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా భారీగా ఎస్ఐలను బదిలీ చేశారు. మొత్తం 38 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంక్రాంతి పండుగ వేళ జరిగిన ఈ బదిలీలు జిల్లా పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారాయి.

News January 10, 2026

కృష్ణా: కోడలి ప్రాణం తీయబోయిన మామ.. న్యాయస్థానం సీరియస్

image

కోడలిపై హత్యాయత్నానికి పాల్పడిన మామను మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. రెండు రోజుల కిందట ఆకూరి నాగశ్వేతపై ఆమె మామ కత్తితో దాడి తీసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కలిదిండి సోమరాజును అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా, న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు చిలకలపూడి సీఐ నబీ తెలిపారు.

News January 10, 2026

బందరులో కోడలిపై హత్యాయత్నానికి పాల్పడిన మామకు రిమాండ్

News January 9, 2026

పకడ్బందీగా ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణ: కలెక్టర్

image

ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణ పకడ్బందీగా చేపట్టి పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణపై కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2002 ఓటర్ల జాబితాలోని ఓటర్లను 2025 ఓటర్ల జాబితాలోని ఓటర్లతో మ్యాపింగ్ చేయాలన్నారు. 2025 ఓటర్ల లిస్టులోని ఓటర్లను 2002లో ఉన్న ఓటర్లతో వెరిఫై చేయాలని సూచించారు.

News January 9, 2026

గంజాయి అమ్మకాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో గంజాయి అమ్మకాలను నియంత్రించేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన నార్కోటిక్స్ సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్‌లో జరిగింది. జిల్లాలో ఎక్కడా గంజాయి, మాదకద్రవ్యాల అమ్మకాలు జరగరాదన్నారు. కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంచి అమ్మకాలను నియంత్రించాలన్నారు.

News January 9, 2026

కృష్ణా: Way2Newsలో రిపోర్టర్‌గా చేరాలనుకుంటున్నారా.!

image

కృష్ణా జిల్లాలోని పామర్రు, గుడివాడ, పెనమలూరు నియోజకవర్గాల్లో Way2Newsలో పనిచేయాడానికి రిపోర్టర్2లు కావలెను. ఆర్హత.. ఏదైనా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసిన అనుభవం ఉన్న వాళ్లకు మాత్రమే. ఆసక్తి గలవారు ఈ <>లింక్‌లో<<>> తమ పేర్లు నమోదు చేసుకోగలరు.

News January 9, 2026

మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్‌పై హైకోర్టు సీరియస్

image

మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ జిల్లా కార్యాలయ భవన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సమర్పణ విషయంలో జరిగిన జాప్యంపై సీరియస్ అయింది. కోర్టు ఆదేశాలు పట్టవా..? అంటూ కమిషనర్‌ను నిలదీసింది. జాప్యానికి గల కారణాలపై వెంటనే అఫిడవిట్ వేయాలని ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు.

News January 8, 2026

జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌తో కలిసి పాల్గొన్నారు.