India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ పోలీసు చర్యలను సీఎం చంద్రబాబు అభినందించారు. Suraksha For Safer Neighbourhoods చొరవ అభినందనీయమని కొనియాడారు. వెయ్యికంటే ఎక్కువ సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ప్రాముఖ్యత చాటుతోందని చెప్పారు. ఈ తరహా పోలీసింగ్ పరిపాలన ప్రజలకు మెరుగైన సేవ చేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. హైటెక్ ఈగల్ వెహికల్స్ ప్రారంభించడం కూడా ఆయన అభినందించారు.
అత్యాచారం చేసిన వ్యక్తికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ HYDలోని ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. పీపీ వివరాల మేరకు మియాపూర్‌కు చెందిన బాలిక(16)కు రమేష్ పరిచయమయ్యాడు. దీంతో ఆమెను విజయవాడ తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం గదిలో బంధించి అత్యాచారం చేసి ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి.. చార్జీషీటు వేయగా కోర్టు తీర్పునిచ్చింది.
సీఎం చంద్రబాబుపై రాళ్ల దాడి చేసిన వాళ్లు జనసేనలోకి చేరుతున్నారు అనే దానిపై ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వారు జనసేన, బీజేపీ పార్టీలో చేరితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారు ఇంకా పార్టీల్లో చేరలేదని అలాంటి వాళ్లను తీసుకోవద్దని చెబుతున్నామని ఆమె పేర్కొన్నారు.
విజయవాడలోని మహానాడు జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జక్కుల వినయ్, జీవన్, గోపి అనే యువకులు ఓ రెస్టాంరెంట్‌లో చెఫ్‌లుగా పని చేస్తున్నారు. మంగళవారం రాత్రి విధులు ముగించుకొని స్కూటీపై ముగ్గురు వస్తుండగా మహానాడు జంక్షన్ వద్ద ఐచర్ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో గోపి స్పాట్‌లోనే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
CRDAలో డిప్యూటేషన్ విధానంలో 8 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నామని, ఈ పోస్టులకు రాష్ట్ర, కేంద్ర, PSUలలో పని చేస్తున్న వారు అర్హులని CRDA అధికారులు తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు NOC పత్రాలను https://crda.ap.gov.in/ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. FEB 1లోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు అధికారిక వెబ్‌సైట్ చూడాలని విజయవాడలోని CRDA కార్యాలయం నుంచి తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో నవంబర్ 2024లో నిర్వహించిన యూజీ 5వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఫిబ్రవరి 3వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.800 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు.
సాగులో పెట్టుబడి వ్యయం తగ్గించి, ఆదాయం పెంచే లక్ష్యంతో పొలం పిలుస్తోంది పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమంతో రైతులను చేయిపట్టి నడిపిస్తోందని కలెక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. బుధవారం ఇబ్రహీంపట్నం మండలం, దాములూరులో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రస్తుతం వ్యవసాయం ఎలా ఉంది.? సాగుచేస్తున్న పంటలు గురించి అడిగి తెలుసుకున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దుర్గగుడిలో చాలా సంవత్సరాల నుంచి సేవలందిస్తున్న ప్రధానార్చకులు లింగంభొట్ల బద్రీనాథ్ బాబు మరణించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్య రీత్యా మరణించినట్లు సమాచారం.
ఇద్దరు పిల్లలున్న ప్రేయసి కాదన్నదని జి.కొండూరులోని చెర్వుమాధవరానికి చెందిన ఇద్దరు పిల్లలకు తండ్రైన ఆటోడ్రైవర్ బాలాజీ (26) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. మృతుడు మహిళతో ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలో ప్రేయసిని అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ మహిళ ఇకపై కలవడం కుదరదని వెళ్లిపోయింది. మనస్తాపంతో ఆటో స్టార్ట్ చేసే తాడుతో ఉరివేసుకున్నాడు. మృతుని భార్య ఫిర్యాదుతో మైలవరం సీఐ దర్యాప్తు చేపట్టామన్నారు.
విజయవాడలో మంగళవారం అర్ధ రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహానాడు రోడ్ జంక్షన్ వద్ద లారీ బీభత్సం సృష్టించగా ఓ వ్యక్తి మృతి చెందగా.. ఇరువురికి గాయాలయ్యాయి. మృతుడు గుంటూరు జిల్లాకు చెందిన జక్కుల గోపిగా పోలీసులు నిర్ధారించారు. గాయాలపాలైన వ్యక్తిని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.