Krishna

News January 4, 2026

సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగా చేయండి: కలెక్టర్

image

సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు స్థానిక చింతగుంటపాలెంలో నిర్వహిస్తున్న ఉచిత యోగా శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చన్నారు. అవయవాలు ఉన్నంత వరకు యోగాసనాలు వేయాలని, ప్రాణాలు ఉన్నంత వరకు ప్రాణాయామం చేయాలని సూచించారు.

News January 3, 2026

గుడివాడ ఫ్లైఓవర్‌కు రైల్వే అనుమతులు.. కానీ.!

image

గుడివాడలోని రైల్వేగేట్లపై రూ.330కోట్లతో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ల పనులకు అనుమతులు లభించాయి. ఇప్పటికే 70% పనులు పూర్తి కాగా, భూసేకరణ చెల్లింపులు తుది దశకు చేరుకున్నాయి. మిగిలిన పనులను రైల్వే అధికారులు నేరుగా పర్యవేక్షించాల్సి ఉంది. సాంకేతిక అనుమతుల ప్రక్రియ దృష్ట్యా ప్రాజెక్ట్ పూర్తి కావడానికి మరో 6నెలలు పట్టే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరికి ఫ్లైఓవర్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు స్పష్టం చేశారు.

News January 2, 2026

పెడన: యువకుడి సూసైడ్

image

పెడన మండలం చెన్నూరు గ్రామంలో యర్రంశెట్టి వెంకటేష్‌ (28) తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు.. పెడన ఎస్‌ఐ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. మృతుడి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 2, 2026

కృష్ణా జిల్లా కలెక్టర్‌ను ప్రశంసించిన చంద్రబాబు

image

కలెక్టర్ డీకే బాలాజీని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలను విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మలిచిన తీరు అభినందనీయమన్నారు. పలు జిల్లాల్లో కలెక్టర్లు వినూత్న ఆలోచనలతో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని సీఎం పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు.

News January 2, 2026

కృష్ణా: రైతులకు రాజముద్రతో కొత్త పాస్‌పుస్తకాలు

image

కృష్ణా జిల్లాలో రీ-సర్వే పూర్తయిన 176 గ్రామాల రైతులకు రాజముద్ర కలిగిన నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమైంది. జిల్లాలోని 21 మండలాల్లోని లబ్ధిదారులకు ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే గ్రామసభలలో వీటిని అందజేయనున్నారు. ఇప్పటికే E-KYC ప్రక్రియ ముగియగా, బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తయిన వారికి నేరుగా పట్టాలు అందనున్నాయి.

News January 2, 2026

కృష్ణా: జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి రెవెన్యూ గ్రామసభలు

image

జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి రెవెన్యూ గ్రామసభలు ప్రారంభం కానున్నాయి. ఈ గ్రామసభలలో రీ-సర్వే పూర్తయిన అనంతరం రాజముద్రతో ముద్రించిన కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలను రైతులకు అధికారులు అందజేయనున్నారు. భూముల వివరాలపై సందేహాలు ఉంటే అక్కడికక్కడే నివృత్తి చేసే అవకాశం కల్పించనున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 82,210 పట్టాదారు పాస్‌ పుస్తకాలను పంపిణీ చేయడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.

News January 1, 2026

కృష్ణా: కొంగొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం

image

నూతన సంవత్సర వేడుకలు జిల్లాలో అంబరాన్ని అంటాయి. గత సంవత్సరం స్మృతులను గుర్తు చేసుకుని కొంగొత్త ఆశలతో నూతన సంవత్సరం 2026కు యువత స్వాగతం పలికారు. ఉదయమే ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. నూతన సంవత్సరంలో అంతా మంచే జరగాలని కోరుకున్నారు. కొంతమంది మంచి సంకల్పంతో నూతన సంవత్సరం తొలి రోజును ప్రారంభించారు.

News January 1, 2026

కృష్ణా జిల్లాలో మహిళలపై నేరాలకు బ్రేక్

image

కృష్ణా జిల్లాలో మహిళల భద్రత దిశగా సానుకూల మార్పు కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాయి. పోక్సో కేసులు 133 నుంచి 77కి తగ్గి 42 శాతం తగ్గుదల నమోదు కాగా, మహిళలపై మొత్తం నేరాలు 914 నుంచి 669కి చేరి 27 శాతం తగ్గాయి. పోలీసుల కఠిన చర్యలు, అవగాహన కార్యక్రమాలు ఫలితాలు ఇస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.