India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సాయుధ దళాల పతాక నిధి సేకరణలో కృష్ణాజిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచిందని జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి సర్జన్ లెఫ్ట్‌నెంట్ కల్నల్ డాక్టర్ కె. కళ్యాణ వీణ శుక్రవారం తెలిపారు. ఇందుకు సంబంధించి డిసెంబర్లో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా మెమెంటో తీసుకోవాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం రద్దు కావడంతో ఆ మెమెంటోను శుక్రవారం కలెక్టర్ డీకే బాలాజీని కలిసి అందజేశారు.
హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పెనమలూరు పోలీసులు తెలిపారు. సీఐ వెంకట్ రమణ తెలిపిన సమాచారం మేరకు ఈ నెల 9వ తారీఖున పోరంకి ప్రభు నగర్‌కు చెందిన ఉమ్మడి రాణి అనే మహిళను తన అల్లుడైన నారబోయిన నరేశ్ హత్య చేశాడు. ఆప్పటినుంచి పరారీలో ఉన్న నరేశ్‌ను గురువారం రాత్రి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడిని న్యాయమూర్తిగా హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు శుక్రవారం తెలిపారు.
కలెక్టర్ డీకే. బాలాజీ కోడూరు మండల పర్యటనలో భాగంగా శుక్రవారం ఉల్లిపాలెం అంగన్వాడీ సెంటర్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పిల్లల అటెండెన్స్, వంటశాల, మంచి నీటి వసతి, గ్రోత్ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ స్వయంగా పిల్లల వెయిట్‌ను పరిశీలించారు. రిజిస్టర్లో చూపించిన రేగులర్ పేర్ల పిల్లలు లేకుండా అంగన్వాడీలో వేరే పిల్లలు ఉండటంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మచిలీపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లలో కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. 45,46 డివిజన్లలో పర్యటించిన ఆయన ఆయా వార్డుల్లో చెత్త సేకరణను పరిశీలించారు. 46వ డివిజన్లో పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట కమిషనర్ బాపిరాజు, తదితరులు ఉన్నారు.
రామవరపాడులో గుట్టు చప్పుడు కాకుండా నిలువచేస్తున్న విదేశీ సిగరెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్, గుంటూరు జీఎస్టీ అధికారుల వివరాల మేరకు.. రామవరపాడులో విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ సిగరెట్ బాక్స్‌పై ఎటువంటి నియమ నిబంధనలు లేవని చెప్పారు. వాటి విలువ సుమారు రూ.1.76కోట్లు ఉంటుందన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా 2 వారాలు రిమాండ్ విధించారు.
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో బీపీఈడీ&డీపీఈడీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఫిబ్రవరి 10, 11,12,13 తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ వెబ్సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
కృష్ణా జిల్లా పోలీసు కార్యాలయంలోని మోటార్ ట్రాన్స్పోర్ట్ సెక్షన్లో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు హోంగార్డులు ఇటీవల జరిగిన కానిస్టేబుల్ ఎంపికలో భాగంగా ఫిజికల్ టెస్టులు పాసయ్యారు. ఈ నేపథ్యంలో ఎస్పీ గంగాధర్ గురువారం వారిని మచిలీపట్నంలోని తన కార్యాలయంలో అభినందించారు. అనంతరం వారందరికీ మెయిన్స్ పరీక్షకు కావలసిన స్టడీ మెటీరియల్ పుస్తకాలను ఆయన అందజేశారు.
విజయవాడకు శుక్రవారం సీఎం చంద్రబాబు రానున్నారు. 4 రోజుల దావోస్ పర్యటన అనంతరం ఆయన గురువారం అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకుంటారు. శుక్రవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని రోడ్డు మార్గంలో ఉండవల్లి వెళతారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి 2024 సంవత్సరానికి బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డు లభించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత ఏడాది కృష్ణా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిగా 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనపరిచినందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డుకు డీకే బాలాజీని ఎంపిక చేసింది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను మచిలీపట్నం పోలీస్ కమిషనరేట్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గంగాధర్ రావు, పోలీస్ సిబ్బంది సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితంలో ఉన్న ప్రేరణాత్మక ఘట్టాలను వివరించారు. ఈ సందర్భంగా సిబ్బందికి మిఠాయి పంచిపెట్టారు.
Sorry, no posts matched your criteria.