India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని కండ్రిక, జర్నలిస్ట్ కాలనీ, రాజీవ్ నగర్ పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వరద నీటి పంపింగ్ పనులను గురువారం రాత్రి మంత్రి నారాయణ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. వరద నీటిని బయటకి పంపించేందుకు భారీ మోటర్ల సహాయంతో చర్యలు చేపట్టామన్నారు. కొన్నిచోట్ల రోడ్లకు గండ్లు కొట్టి మరి నీటిని బయటికి పంపించామన్నారు.
కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన గొల్లు కృష్ణ గురువారం విజయవాడలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. కృష్ణ మాట్లాడుతూ.. తనపై ఎంతో నమ్మకంతో ఉంచిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయుటకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.
విజయవాడలో మంత్రి నారాయణ, బొండా ఉమామహేశ్వరావుతో కలిసి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా వరద ముంపు ప్రాంతాల బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో మంత్రి నారాయణ కారు నీటి గోతిలో కూరుకుపోయింది. సిబ్బంది క్రేన్ సహాయంతో కారును గోతిలో నుంచి వెలికితీశారు. అనంతరం మంత్రి పర్యటన కొనసాగింది.
విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో ఎన్యుమరేషన్లో ఇబ్బంది ఎదురైతే ప్రజలు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం 0866- 2574454, VMC కార్యాలయం- 8181960909 నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ జి.సృజన సూచించారు. ఇంటి వద్ద ఎన్యుమరేషన్ జరగని పక్షంలో ఈ నెల 12, 13 తేదీల్లో తమ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయ కార్యదర్శిని సంప్రదించి చేయించుకోవాలని సూచించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో సంభవించిన వరద విపత్తు ప్రజలకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. వరద నీటితో పాటు కొట్టుకొస్తున్న పాములు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో 70 మంది పాముకాటుకు గురయ్యారని వైద్య శాఖ అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులకు పాము కాట్ల బాధితులు వస్తున్నారన్నాయి.
విజయవాడ నుంచి పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర పేరుతో ఈ నెల 14న IRCTC ప్రత్యేక రైలు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 11 రాత్రులు, 12 పగళ్లతో కొనసాగే యాత్ర ఈనెల 14న విజయవాడ నుంచి బయలుదేరి 25న తిరుగు ప్రయాణం అవుతుందన్నారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో తన ముందస్తు బెయిల్ పిటీషన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి జోగి రమేశ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వైసీపీ అధికారంలో ఉండగా జోగి రమేశ్ చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లారని పలువురు టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వ మార్పిడి తర్వాత రమేశ్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో పాలడుగు దుర్గాప్రసాద్‌ను మంగళగిరి పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. దుర్గాప్రసాద్ ఈ కేసులో ఏ4గా నిందితుడిగా ఉన్నాడు. దుర్గాప్రసాద్ కోసం కొంతకాలంగా గాలిస్తున్న పోలీసులు.. ఇవాళ గుంటుపల్లిలో ఆయన ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. కాగా దుర్గాప్రసాద్ సతీమణి ఎంపీపీ పాలడుగు జోష్న వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.
అవనిగడ్డ మండలం పులిగడ్డలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు జ్వరాలు ప్రబలిన నేపథ్యంలో డీఎంహెచ్‌వో గీతాబాయి పాఠశాలను సందర్శించారు. ప్రిన్సిపల్ కుమార్‌ను, వైద్యులు డా. ప్రభాకర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం రాత్రి వరకు జరిగిన పరీక్షల్లో మొత్తం 31 మంది జ్వర పీడితులు తేలారని, వారిలో ముగ్గురు తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఉండగా, మరో ఆరుగురు చికిత్స కోసం ఇళ్లకు వెళ్లిపోయినట్లు ఆమె తెలిపారు.
ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (NMMS)కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తాన ఓ ప్రకటనలో తెలిపారు. 8వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. దరఖాస్తులను ఈ నెల 17వ తేదీ లోపు అందజేయాలన్నారు. ఇతర వివరాలకు మచిలీపట్నంలోని డీఈఓ కార్యాలయం ద్వారా తెలుసుకోవచ్చన్నారు.
Sorry, no posts matched your criteria.