India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బందరు మండలం తాళ్లపాలెం సచివాలయంలో మాజీ సీఎం జగన్ ఫోటోతో ఇన్‌కమ్ సర్టిఫికేట్ జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రభుత్వం మారినా రాష్ట్రంలో అక్కడక్కడ జగన్ ఫోటోలతో కూడిన సర్టిఫికేట్లు జారీ అవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల గుంటూరులో జగన్ ఫోటోతో సచివాలయ సిబ్బంది సర్టిఫికేట్ జారీ చేయడాన్ని మరువక ముందే నేడు బందరు మండలం తాళ్లపాలెం సచివాలయంలో జగన్ ఫోటోతో సర్టిఫికేట్ జారీ విమర్శలకు తావిస్తోంది.

మచిలీపట్నంలోని రంగనాయక స్వామి దేవస్థానంకు చెందిన భూములను తాను కారు చౌకగా కొట్టేశానని కూటమి నేతలు చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. నిజంగా స్వామి వారి భూములను తాను అక్రమ మార్గంలో తీసుకుంటే నాడు జరిగిన వేలంపాటపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ అవినీతిని తాను బట్టబయలు చేస్తుండటంతో తనపై కక్ష కట్టి అవినీతి ఆరోపణలు చేస్తున్నారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

☞ కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బదిలీ
☞ కృష్ణా జిల్లా కొత్త ఎస్పీ హెచ్చరికలు
☞ కృష్ణాలో13 మంది ఎంపీడీవోలకి పదోన్నతి
☞ కృష్ణాలో ఇంటి స్థలాల కోసం 19,382 దరఖాస్తులు
☞ వాట్సాప్‌లో కనకదుర్గమ్మ అర్జిత సేవ టికెట్లు
☞ కురుమద్దాలి ఫ్లై ఓవర్ వద్ద ప్రమాదం.. నలుగురికి గాయాలు

కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న గీతాంజలి శర్మను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ప్రత్యేక శ్రద్ధ చూపిన ఆమె పనితీరు ప్రశంసలు పొందింది. ఇకపై ఫైబర్ నెట్ విస్తరణలో కీలక పాత్ర పోషించనున్నారు. కొత్త జాయింట్ కలెక్టర్‌పై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16న పటమట ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో అండర్-14, 17 బాల, బాలికల ఫెన్సింగ్ జట్ల ఎంపికలు జరగనున్నాయి. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ స్టడీ సర్టిఫికేట్, జనన ధృవీకరణ పత్రం, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంతకం, సీల్‌తో ఉన్న ఎంట్రీ ఫారం తీసుకురావాలని ఎస్జీఎఫ్ కార్యదర్శులు దుర్గారావు, రాంబాబు తెలిపారు. ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి.

కృష్ణా జిల్లాలో నలుగురు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, 9 మంది డిప్యూటీ ఎంపీడీఓలకు ఎంపీడీఓలుగా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన వారికి జడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక పోస్టింగ్ ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ కన్నమ నాయుడు పాల్గొన్నారు.

కృష్ణా జిల్లా ఎస్పీగా నియమితులైన విద్యాసాగర్ నాయుడు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11:30 గంటలకు ఆయన జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుని పదవీ బాధ్యతలు చేపడతారు. ఇటీవల జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న విద్యాసాగర్ నాయుడును కృష్ణా జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేసి బదిలీపై వెళ్తున్న ఆర్. గంగాధరరావు ఐపీఎస్‌కు పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. మచిలీపట్నం గోల్డ్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఎస్పీతో తమ అనుభవాలను పంచుకున్నారు. తమకు సహకరించిన అధికారులకు, సిబ్బందికి గంగాధరరావు కృతజ్ఞతలు తెలిపారు.

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16న పటమట ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో అండర్-14, 17 బాల, బాలికల నెట్ బాల్ జట్ల ఎంపికలు జరగనున్నాయి. ఎంపికలకు హాజరయ్యే క్రీడా కారులు తమ స్టడీ సర్టిఫికెట్, జనన ధృవీకరణ పత్రం, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంతకం, సీల్‌తో ఉన్న ఎంట్రీ ఫారం తీసుకురావాలని ఎస్జీఎఫ్ కార్యదర్శులు దుర్గారావు, రాంబాబు తెలిపారు. ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి.

కృష్ణా జిల్లాలో గృహ సముదాయాల కోసం ఇప్పటివరకు 19,382 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా రెవెన్యూ అధికారుల సమాచారం ప్రకారం.. గుడివాడ డివిజన్‌లో 3,364 మంది, మచిలీపట్నం డివిజన్‌లో 6,083 మంది, ఉయ్యూరు డివిజన్‌లో 9,935 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించారు. అయితే, స్థలాల కేటాయింపు, పట్టాల పంపిణీపై స్పష్టత లేకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.
Sorry, no posts matched your criteria.