India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి సమీపంలోని శాంతినగర్ వద్ద బుడమేరుకు పడిన 90మీటర్ల మూడో గండిని పూడ్చేశారు. నాలుగు రోజులుగా గండి పనులను నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నానికి గండి పూడ్చే పనులు పూర్తయ్యాయి. గండిని పూడ్చడానికి ఆర్మీసైతం రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.
ముదినేపల్లి మండలం ఊటుకూరులో శనివారం పట్టపగలే దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన పోసిన బాల కోటయ్య (55)ను మారణాయుధాలతో దాడి చేసి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు తాజాగా సమాచారం వెలువడింది. పాతకక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ముదినేపల్లి పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
విజయవాడ కేంద్రంగా ముంబై నటి కాదంబరి జెత్వానీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పరువుకు భంగం కలిగించే కథనాలు ప్రసారం చేసిన మీడియా సంస్థలకు ఆమె లీగల్ నోటీసులిచ్చారు. ఈ మేరకు ఆమె తన తరపు లాయర్ నర్రా శ్రీనివాసరావు ద్వారా నోటీసులు పంపారు. పరువు నష్టం కింద రూ.50 కోట్లు, న్యాయఖర్చుల నిమిత్తం రూ.35 లక్షలు ఇవ్వాలని ఆమె సదరు సంస్థలను డిమాండ్ చేశారు.
విజయవాడను ముంచెత్తిన బుడమేరు గండి పూడ్చివేతకు ఆర్మీ సిబ్బంది శుక్రవారం రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. విపత్కర సమయంలో సైన్యం ఉపయోగించే గేబియాన్ బుట్టల ద్వారా గండ్లు పూడ్చేందుకు కావాల్సిన పరికరాలను యుద్ధప్రాతిపదికన సైన్యం సిద్ధం చేసుకుంది. ఇనుప చువ్వలతో బుట్టలా చేసి దానిని పెద్ద రాళ్లు, ఇసుక బస్తాలతో నింపడం ద్వారా గండి పూడ్చాలని నిర్ణయించినట్లు సమాచారం.
వరద బాధితులకు అందజేసే న్యూట్రిషన్ కిట్ల ప్యాకింగ్ విజయవాడలో ముమ్మరంగా సాగుతోంది. అమ్మ కళ్యాణ మండపం, సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీలో ఈ ప్యాకింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది. ఈ కిట్‌లో ముంపు ప్రాంతాల్లో ఇచ్చేందుకు ఆరు యాపిల్స్, ఆరు బిస్కట్ ప్యాకెట్లు, రెండు లీటర్ల పాల ప్యాకెట్లు, మూడు నూడిల్స్ ప్యాకెట్లు, రెండు లీటర్ల వాటర్ బాటిళ్ళు ఉంటాయని పేర్కొంది.
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఇటీవల ధ్వంసం అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఇరిగేషన్ శాఖ అధికారులు గేట్ల ధ్వంసంపై విచారణ చేయాలని విజయవాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. కాగా ఆ గేట్లు శుక్రవారం మరమ్మతులు చేశారు.
విజయవాడలో ఇంటింటికి జరుగుతున్న ఉచిత రేషన్ కిట్ల పంపిణీని శుక్రవారం సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ కిట్ ద్వారా బియ్యం, ఉల్లిపాయలతో సహా 6 రకాల సరుకులు అందజేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అక్కడి మహిళలతో మాట్లాడి ప్రభుత్వం అందిస్తోన్న వరద సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
విజయవాడ వరదలపై ఫేక్ కథనాలను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రకృతి ప్రకోపానికి విజయవాడలో లక్షల మంది ప్రజలు నష్టపోయారని చెప్పారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో దురుద్దేశంతో ఫేక్ కథనాలు సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
వరదల కారణంగా దెబ్బతిన్న గ్రామీణ రహదారుల పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు Dy. సీఎం పవన్ తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. గ్రామీణ రహదారులు, పారిశుద్ధ్య కార్యకలాపాల పర్యవేక్షణకై పనిచేసే ఈ బృందాలకు అధికారులుగా కృష్ణా, కాకినాడ, పశ్చిమగోదావరి జిల్లాల ఇన్‌ఛార్జిగా వీఆర్ కృష్ణతేజను, గుంటూరు, ఏలూరు జిల్లాలకు ఇన్‌ఛార్జిగా షణ్ముఖ్‌ను పవన్ నియమించారు.
ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఎన్నడూ లేనంత ఇన్‌ఫ్లో నమోదయిన విషయం తెలిసిందే. అయితే 120 ఏళ్లలో కృష్ణమ్మ వరద ఉద్ధృతి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 1903 అక్టోబర్ 7న 10.68లక్షల క్యూసెక్కులు, 1914 ఆగస్టు11న 9.49, 1917 నవంబర్ 2న 9.55, 1949 సెప్టెంబర్ 24న 9.25, 1964 అక్టోబర్ 2న 9.88, 1998 అక్టోబర్ 17న 9.32, 2009 అక్టోబర్ 5, 6న 10.94, 2024 సెప్టెంబరులో 11.38లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వరద వచ్చింది.
Sorry, no posts matched your criteria.