Krishna

News September 6, 2024

పంట నష్టం అంచనాలకు ప్రత్యేక బృందాలు: కృష్ణా కలెక్టర్

image

అధిక వర్షాలు, వరదల కారణంగా జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ బాలాజీ తెలిపారు. గ్రామ స్థాయిలో VRO, వ్యవసాయ సహాయకులు, మండల స్థాయిలో తహశీల్దార్, AO, డివిజన్ స్థాయిలో RDO, వ్యవసాయ సహాయకులతో బృందాలు వేశామన్నారు. 33% మేర నష్టపోయిన పంటను వీరు పరిగణనలోకి తీసుకుంటారని, ఈనెల 10లోపు నష్టం అంచనాలు పూర్తి చేసి 16లోపు బాధితుల జాబితాను ప్రదర్శిస్తారన్నారు.

News September 6, 2024

కృష్ణా: బీఈడీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని కళాశాలల్లో బీఈడీ, స్పెషల్ బీఈడీ 4వ సెమిస్టర్(2020, 21, 22 బ్యాచ్‌లు) విద్యార్థులు రాయాల్సిన థియరీ పరీక్షలను అక్టోబర్ 15 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సెప్టెంబర్ 17లోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News September 6, 2024

విజయవాడలో ఇప్పటికీ 1టీఎంసీ నీరు ఉంది: CM చంద్రబాబు

image

రానున్న రెండు మూడు రోజుల్లో విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టనున్న పనులను CM చంద్రబాబు వివరించారు. రేపటి నుంచి రేషన్ కిట్ల పంపిణీ, విద్యుత్, మంచినీటి సరఫరా చేస్తామని విజయవాడలో అన్నారు. అపార్ట్‌మెంట్లు, ఇళ్లలో ఉన్న నీటిని మోటార్లు పెట్టి తోడిస్తామని చెప్పారు. నగరంలో ఇంకా 1టీఎంసీ నీరు ఉన్నట్లు.. త్వరలోనే తోడుతామన్నారు. అనంతరం పారిశుద్ధ్య పనులు నిర్వహించి బ్లీచించ్ చేస్తామని చెప్పారు.

News September 5, 2024

విజయవాడకు బయలుదేరిన ఆర్మీ టాస్క్‌ఫోర్స్ బృందం

image

ఆర్మీ టాస్క్‌ఫోర్స్(ఇంజినీర్) బృందం విజయవాడలో వరద బాధితులకు సేవలు అందించేందుకు ప్రత్యేక విమానంలో నగరానికి బయలుదేరింది. ఈ మేరకు సంబంధిత వర్గాలు గురువారం ఒక ప్రకటన విడుదల చేశాయి. విపత్తు నిర్వహణలో సుశిక్షితులైన ఈ ఆర్మీ టాస్క్‌ఫోర్స్ బృందం వరద బాధితుల సేవలు తదితర అంశాలలో పాలుపంచుకుంటాయని తాజాగా సమాచారం వెలువడింది.

News September 5, 2024

విజయవాడలో మెరుగవుతున్న ప్రజా జీవనం

image

బుడమేరు వరదతో అల్లకల్లోలంగా మారిన విజయవాడ నగరం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. వరద ప్రవాహం తగ్గడంతో గురువారం సాయంత్రం అజిత్ సింగ్ నగర్ పైవంతెనపైకి వాహనాల రాకపోకలను ప్రభుత్వం యంత్రాంగం అనుమతించింది. నగరంలోని పలు వరద ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరా సైతం పునరుద్ధరణ జరగడంతో అక్కడి ప్రజలు సహాయ కేంద్రాల నుంచి తమ నివాసాలకు వెళుతున్నారు.

News September 5, 2024

కృష్ణాలో రేపు పాఠశాలలు యథాతథంగా పని చేస్తాయి: డీఈఓ

image

జిల్లాలో రేపు అన్ని యాజమాన్య పాఠశాలలు యథావిధిగా పని చేస్తాయని డీఈఓ తాహెరా సుల్తానా ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు పునరావాస కేంద్రాలు ఉన్న పాఠశాలలకు మాత్రమే సెలవు ప్రకటించినట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణ తేదీలు త్వరలో ప్రకటిస్తామన్నారు. అన్ని పాఠశాలల స్థితిగతులను పరిశీలించి, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులను తరగతిలో కూర్చోబెట్టాలన్నారు.

News September 5, 2024

గుడ్లవల్లేరు కాలేజీలో స్పై కెమెరాలు గుర్తించలేదు: ఐజీ అశోక్ కుమార్

image

గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కళాశాలలో స్పై కెమెరాలు గుర్తించలేదని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ అంశంపై దర్యాప్తు గురించి ఆయన గురువారం వివరించారు. సీఎం ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా విచారణ జరిగిందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల అనుమానాలు నివృత్తి చేశామన్నారు. తమ విచారణలో కెమెరాలు, గానీ, ఆరోపణల్లో వినిపిస్తున్న వీడియోలు గానీ ప్రత్యక్షంగా చూసినట్లు ఎవరూ చెప్పలేదన్నారు.

News September 5, 2024

మాజీ మంత్రి జోగి రమేశ్ కోసం పోలీసుల గాలింపు

image

మాజీ మంత్రి జోగి రమేశ్ కోసం ఏపీ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఇటీవల ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేశ్ నిందితుడిగా ఉన్నారు. దీంతో జోగి, ఆయన అనుచరుల కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది.

News September 4, 2024

విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త అరెస్టు

image

విజయవాడ డిప్యూటీ మేయర్ శ్రీశైలజ భర్త , వైసీపీ నేత అవుతు శ్రీనివాసరెడ్డిని మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి 9గంటల సమయంలో విజయవాడ అజిత్ సింగ్ నగర్‌లోని నివాసంలో అరెస్ట్ చేసినట్లు వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు వచ్చేవరకు ఆగకుండా తీసుకెళ్లారని మండిపడుతున్నారు. మంగళగిరి టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.

News September 4, 2024

రేపు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో వర్షాలు

image

రేపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో పాటు కృష్ణా జిల్లాలోనూ అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది.