India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మచిలీపట్నంలో ఓ వ్యక్తి మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. చిలకలపూడికి చెందిన రవి అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ రవిని హుటాహుటిన సర్వజన ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎస్సీ కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల స్వీకరణ గడువును జనవరి 12వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. జనవరి 7వ తేదీతో గడువు ముగియనుండటంతో మరొక 5 రోజులు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్ఓపీ విధివిధానాలు తెలుపుతూ ప్రభుత్వం 265 నంబర్ జీవో విడుదల చేసినట్లు తెలిపారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సాంఘిక సంక్షేమ వసతి గృహం విద్యార్థినుల సమక్షంలో తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. మచిలీపట్నం బచ్చుపేటలోని వసతి గృహాన్ని సందర్శించిన ఆయన విద్యార్థినులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఎగ్జామ్ ప్యాడ్, పెన్, స్కేల్, జామెంట్రీ బాక్స్, కొబ్బరి నూనె, ఫేస్ పౌడర్, హెయిర్ పిన్స్, టవల్, నాప్కిన్‌లతో కూడిన కిట్స్‌ను అందజేశారు.
ఎస్సీ కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల స్వీకరణ గడువును జనవరి 12వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. జనవరి 7వ తేదీతో గడువు ముగియనుండటంతో మరొక 5 రోజులు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్ఓపీ విధివిధానాలు తెలుపుతూ ప్రభుత్వం 265 నంబర్ జీవో విడుదల చేసినట్లు తెలిపారు.
బాపులపాడు మండలంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. నంద్యాల(D) పొన్నవరానికి చెందిన ఓ మహిళ తన కుమార్తె (11)ను తీసుకొని గతేడాది నవంబర్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య, కూతురు కనిపించడం లేదని ఆమె భర్త రవి నంద్యాల పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రియుడు మోజులో పడి బిడ్డను తల్లి వీరవల్లి రోడ్డుపై వదిలేసింది. సోమవారం బాలికను గుర్తించి నంద్యాల పోలీసులకు అప్పగించనున్నట్లు వీరవల్లి SI శ్రీనివాస్ తెలిపారు.
గంపలగూడెం మండలంలోని పెనుగొలనులో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై దాడి చేసి బంధం నాగమణి అనే నిర్వాహకురాలిని అరెస్ట్ చేసినట్లు తిరువూరు సీఐ కె.గిరిబాబు తెలిపారు. నిందితురాలిని తిరువూరు కోర్టులో హాజరు పరిచి రిమాండ్ నిమిత్తం నూజివీడు సబ్ జైలుకు తరలించినట్లు తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సీఐ హెచ్చరించారు.
పాస్‌పోర్టు విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పిటిషన్‌ను విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. పాస్‌పోర్టు దరఖాస్తుకు NOC ఇవ్వాలని జగన్ పిటిషన్ వేశారు. 2024లోనే పాస్‌పోర్టు ఎక్స్‌పైర్ అయినట్లు ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. కాగా పాస్‌పోర్టు ఆఫీస్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని జగన్‌కు ప్రజాప్రతినిధుల కోర్టు సూచించింది.
విజయవాడ మీదుగా సంక్రాంతి సందర్భంగా చర్లపల్లి(CHZ)-తిరుపతి(TPTY) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. నం.02764 CHZ-TPTY రైలు ఈనెల 8,11,15న, నం.02763 TPTY-CHZ రైలు ఈనెల 9,12,16న నడుపుతామన్నారు. నం.02764 రైలు చర్లపల్లిలో పై తేదీలలో సాయంత్రం 6.55కి బయలుదేరి తరవాతి రోజు అర్ధరాత్రి 12.10కి విజయవాడ, ఉదయం 7.15కి తిరుపతి చేరుకుంటాయన్నారు.
ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల జాబితా సవరణ-2025లో భాగంగా కృష్ణాజిల్లాలో 15,40,356 మంది తమ ఓటు హక్కు నమోదు చేయించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మొత్తం 15,40,356 మంది ఓటర్లలో 7,46,385 మంది పురుషులు, 7,93,916 మంది స్త్రీలు, 55 మంది థర్డ్ జెండర్ ఉన్నారన్నారు. అత్యధికంగా పెనమలూరు నియోజకవర్గంలో 2,95,051 మంది ఓటర్లు నమోదయ్యారన్నారు.
జిల్లాలో నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరం చేసి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు సంబంధిత అధికారులతో సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా నైపుణ్య అభివృద్ధి కమిటీ సమావేశం సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి విద్యార్థికి అపార్ ఐడీ జనరేట్ చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.