India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆహారం, పాలు, నీళ్ల కోసం విజయవాడ ప్రజలు అలమటిస్తున్నారు. ప్రభుత్వం, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. ఆహారం, పాలు, నీటిని ఇస్తుండగా.. వీటిని పోటీపడి మరి కొందరే చేజిక్కించుకుంటున్నారు. తర్వాత వాటిని మరికొందరికి విక్రయిస్తున్నారని సమాచారం. విపత్కర స్థితిలో ఇలాంటి చెత్త పని ఏంటని పలువురు అంటున్నారు. అందరికీ ఆహారం అందేలా మనమందరం ప్రయత్నిద్దాం. ఇంతకీ మీ ఏరియాలోనూ ఇలా జరిగిందా? కామెంట్ చేయండి.
విజయవాడ డివిజన్ మీదుగా సాగే 450 రైళ్లలో 436 రైళ్లు వరద ప్రభావానికి రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఖాజీపేట, విజయవాడ సెక్షన్‌లో వరద కారణంగా 275 రైళ్లను రద్దు చేశారు. 149 రైళ్లను దారి మళ్లించారు. మరో 12 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ఖాజీపేట, విజయవాడ సెక్షన్‌లో గండ్లు పడి అటువైపు రైల్వే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు ఈ మేరకు సహకరించాలని కోరారు.
విజయవాడలో సోమవారం రాత్రి సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో మంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రుల ఎస్కార్ట్ వాహనాలు విత్ డ్రా చేసుకోవాలని మంత్రి లోకేశ్ ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనను మంత్రులు అంగీకరించారు. వరద నేపథ్యంలో ఆ వాహనాలను సహాయక చర్యలకు వినియోగించాలని నిర్ణయించారు. దీంతో నిత్యావసర వస్తువులు, భోజనం, తాగునీరు అందించే వాహనాలకు ఎస్కార్ట్‌గా మంత్రుల వాహనాలు వెళ్లనున్నాయి
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ, భవానీపురం, సింగ్ నగర్ ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు విజయవాడ కలక్టరేట్‌కి వచ్చారు. అనంతరం మరోసారి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాత్రి లోపు పొరుగు జిల్లాల అధికారులతో మాట్లాడి మరో 3 లక్షల ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు తెప్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
కృష్ణాజిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు. కృష్ణానదికి వరద ఉద్ధృతి తగ్గకపోవటంతో కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తానా ఓ ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రులెవరూ పిల్లలను స్కూల్స్‌కు పంపవద్దని డీఈఓ కోరారు.
★ అర్ధరాత్రి 1AM: విజయవాడ సింగ్ నగర్ వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల పరిశీలన
★ 1.50 AM: కృష్ణలంకలో ముంపు ప్రాంతాలలో పర్యటన
★ 2.00 AM: ఇబ్రహీంపట్నం వద్ద వరద ఉద్ధృతి పరిశీలన
★ తర్వాత తిరిగి విజయవాడ కలెక్టరేట్‌కు.. అధికారులతో సమీక్ష
★ 2.30 AM: ఫెర్రీ, ఇబ్రహీంపట్నం, జూపూడి ప్రాంతాల్లో పర్యటన.. బాధితులకు ధైర్యం చెప్పిన సీఎం
★ 3:20 AM: ఇబ్రహీంపట్నంలో పరిస్థితిపై ఆరా
సీఎం చంద్రబాబు అర్ధరాత్రి విజయవాడలో పర్యటించారు. మరోసారి సింగ్ నగర్ వెళ్లిన ఆయన చీకటిగా ఉండటంతో సెల్‍ఫోన్, కెమెరా, బ్యాటరీ లైట్ల వెలుతురులో పర్యటన సాగించారు. ఈ సందర్భంగా వరదనీటిలో మునిగిన బాధితులకు భోజన పొట్లాలు పంపిణీ చేశారు. అనంతరం వారితో మాట్లాడుతూ.. ఎవరూ అధైర్యపడొద్దని, అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాని భరోసా కల్పించారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కృష్ణా జిల్లాలో పోలీస్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు ఎవరైనా పోలీసు వారి సహాయం పొందాలనుకుంటే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్లకు 9491063910కు లేదా 08672 252090 ఫోన్ చేసి తక్షణ సహాయం పొందవలసిందిగా కోరారు. ఎన్టీఆర్ జిల్లా ప్రజలు 8181960909 నంబర్‌ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.
జిల్లాతో పాటు విజయవాడలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికార యంత్రాంగం వెంటనే స్పందిస్తూ సహాయక చర్యలు చేపడుతోంది. మరికొన్ని ప్రాంతాల ప్రజలు ఇళ్లలోనే చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేకపోవడం, చీకటి పడుతుండటంతో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి.
భారీ వర్షాల కారణంగా ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వర్షాల ప్రభావంతో మచిలీపట్నం, నరసాపురం, విశాఖపట్నం, కాకినాడ పోర్ట్ తదితర ప్రాంతాల నుంచి విజయవాడ మీదుగా ప్రయాణించే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేశామని పేర్కొంటూ దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
Sorry, no posts matched your criteria.