India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రకాశం బ్యారేజ్ నుంచి పెద్ద ఎత్తున వరద నీటిని దిగువకు విడుదల చేసిన నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంత అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. ఆదివారం ఉదయం ఆయన అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
భారీ వర్షాల కారణంగా ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేసినట్లు డివిజన్ రైల్వే మేనేజర్(DRM) కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు విజయవాడ నుంచి డోర్నకల్, గుంటూరు, భద్రాచలం రోడ్ వెళ్లే మెము రైళ్లను సెప్టెంబర్ 1,2వ తేదీలలో రద్దు చేశామని పేర్కొంది. ప్రయాణికులు గమనించి సహకరించాలని కోరారు.
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ఎక్కడా ప్రాణ నష్టం వాటిల్ల లేదని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శనివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. 25 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని.. వెంటనే పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నామన్నారు. విద్యుత్ ప్రమాదాలు నివారించేందుకు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపి వేసినట్లు తెలిపారు.
విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో వరద ముంపునకు గురైన ప్రజలను సింగ్ నగర్ ఎస్ఐ సేనాపతి శ్రీనివాసరావు పునరావాస కేంద్రాలకు తరలించారు. న్యూ రాజరాజేశ్వరి పేటలో వరద ముంపునకు గురైన ఓ వృద్ధురాలిని పడవలో తీసుకు వచ్చి పునరావాసం కల్పించారు. ఎస్సై శ్రీనివాసరావు ఆర్థిక సహాయం అందించి పునరావాసంలో వసతులు కల్పించారు. పలువురు ఉన్నత అధికారులు ఎస్సైను అభినందించారు.
భారీ వర్షాల కారణంగా విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ప్రయాణించే 20 రైళ్లను రద్దు చేసినట్లు డివిజన్ రైల్వే మేనేజర్(DRM) కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రైళ్లలో 15 రైళ్లను ఈ రోజు, రేపు రద్దు చేశామని DRM కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి జిల్లా మీదుగా ప్రయాణించే పలు రైళ్లను వర్షాల కారణంగా రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. శనివారం ఆయన ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వితో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. వర్షాల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ముంపుకు గురైన ప్రాంతాలలో విస్తృతంగా సహాయక చర్యలు చేపట్టాలన్నారు.
అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజపురంలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బండరాళ్లు విరిగి ఇళ్లపై పడిన ఘటనలో బోలెం లక్ష్మీ, మేఘన, లాలు, అన్నపూర్ణ అనే నలుగురు మృతిచెందడం తెలిసిందే. మృతి చెందిన ఒక్కొక్కరికి రూ.5 లక్షల నష్టపరిహారాన్ని సీఎం ప్రకటించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లా కలెక్టర్లతో మంత్రి కొల్లు రవీంద్ర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండు జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు తగ్గు ముఖం పట్టే వరకు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. సహాయక చర్యల్లో స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో భారీ వర్షాలపై హోం, విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి వంగలపూడి అనిత ఫోన్లో మాట్లాడి సమీక్షించారు. వరద ప్రాంతాల్లో సహాయం చర్యలు చేపట్టాలని ప్రత్యేక బలగాలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. విజయవాడలో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందడంపై హోం మంత్రి విచారం వ్యక్తం చేశారు.
జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన అన్ని సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా. జి.సృజన అధికారులను ఆదేశించారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అధికారులను అప్రమత్తం చేసేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి వివిధ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు.
Sorry, no posts matched your criteria.