India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కళాశాలలో లేడిస్ వాష్‌రూమ్‌లో హిడెన్ కెమెరాలు పెట్టారని విద్యార్థులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. కాగా, కళాశాలలో కొందరు విద్యార్థుల మధ్య జరిగిన ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరూ ప్రకాశం జిల్లాకు చెందిన వారు. వారు ఇద్దరి విషయం బయటకు రాకూడదనే కొందరు కావాలనే ఇలా చేయించినట్లు సమాచారం.
జిల్లాకు వరద, వర్షం ఒకే సారి చుట్టు ముట్టాయి. కృష్ణా నదిలో వరద తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. అదే సమయంలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని కలెక్టరేట్లో 24 గంటలూ పని చేసేలా 0866-2575833 నంబర్‌తో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని కలెక్టర్ జి. సృజన తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే వెంటనే కంట్రోల్ రూంకు తెలియజేయాలని సూచించారు.
విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కృష్ణా జిల్లాలో పాఠశాలకు జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ సెలవు ప్రకటించారు. శనివారం భారీ వర్షాల కారణంగా కృష్ణా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తానా మచిలీపట్నం నుంచి శనివారం ఉదయం ఒక ప్రకటనలో తెలిపారు.
విజయవాడలో శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి శనివారం ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలకు సెలవులు మంజూరు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు తెలిపారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ ప్రకటన విడుదల చేసినట్లు పేర్కొన్నారు. కావున ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలని చెప్పారు.
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ లేడీస్ హాస్టల్‌లో హిడెన్ కెమెరాల కలకలంపై ఆందోళన చేస్తున్న విద్యార్థినులు మంత్రి కొల్లు రవీంద్ర హామీతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే యాజమాన్యం నుంచి విద్యార్థుల భవిష్యత్తుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు తమ ఆందోళన విరమించారు.
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమేరాలు ఉన్నాయనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించిన నేపథ్యంలో కలెక్టర్ డీ.కే బాలాజీతో పాటు, ఎస్పీ గంగాధర్ రావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థినుల ఆందోళనపై వాస్తవ పరిస్థితులను విచారిస్తున్నారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను నుంచి ఘటనకు సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఫార్మ్-డీ 1వ ఏడాది కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు సెప్టెంబర్ 20 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు పరీక్ష ఫీజును అపరాధ రుసుము లేకుండా సెప్టెంబర్ 9లోపు చెల్లించాలని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. పరీక్ష ఫీజు వివరాలకై అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని సూచించింది.
గుడ్లవల్లేరు కాలేజీలో హిడెన్ కెమెరాలు ఉన్నాయనే అంశంపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. హాస్టల్‌లో రహస్య కెమెరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళనపై విచారణ జరపాలని సీఎం, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి.
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల లేడీస్ హాస్టల్‌లోని వాష్ రూమ్స్‌లో రహస్య కెమెరాలు అమర్చారన్న ఆరోపణలపై SP ఆర్. గంగాధరరావు స్పందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని చెప్పారు. బాలికల హాస్టల్‌లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని ఆన్నారు. ఈ విషయంలో విద్యార్థినులు ఎటువంటి ఆందోళనకు గురి కావల్సిన అవసరం లేదన్నారు. అన్ని కోణాల్లో కేసును విచారిస్తున్నామని వెల్లడించారు.
ఆచార్య నాగార్జున వర్సిటీ(ANUCDE)లో డిస్టెన్స్ విధానంలో UG, PG కోర్సులు చదివే విద్యార్థులు(A-21, A-22, A-23& C-21, C-22,C-23 బ్యాచ్‌లు) రాయాల్సిన 1వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడులైంది. ఈ పరీక్షలు సెప్టెంబర్ 27 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు పరీక్ష ఫీజును అపరాధ రుసుము లేకుండా సెప్టెంబర్ 2లోపు చెల్లించాలని వర్సిటీ సూచించింది. వివరాలకు http://anucde.info/అధికారిక వెబ్‌సైట్ చూడాలంది.
Sorry, no posts matched your criteria.