India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడలో బుక్ ఫెయిర్ గురువారం ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు స్టాల్స్‌లో ఉన్న పుస్తకాలను పరిశీలించారు. మెగాస్టార్ చిరంజీవి సినీప్రస్థానం గురించి యూ.వినాయకరావు రచించిన “మెగాస్టార్ లెజెండ్ బుక్”ను ఆయన తీసుకున్నారు. సంబంధిత ఫొటోను మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
మచిలీపట్నంలో జరుగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల్లో ఎ.కొండూరుకు చెందిన దారావత్ <<15046039>>చంద్రశేఖర్ (25) మృతి చెందడం<<>>పై పోలీసులు వివరణ ఇచ్చారు. కార్డియాటిక్ అరెస్ట్‌తో మరణించినట్లు వైద్యులు వెల్లడించారన్నారు. ప్రాథమికంగా పరీక్షలు చేసిన రిపోర్టుల్లో అతనికి SEPSIS కారణంగా WBC కౌంట్ 30వేలకు చేరిందన్నారు. అతను గత 5 రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోందని వైద్యులు తెలిపారు.
వైసీపీ నేత, రాష్ట్ర ఫైబర్ నెట్ మాజీ ఛైర్మన్ గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ జరిగే వరకు గౌతమ్ రెడ్డిని అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది.
రేషన్ బియ్యం మాయం కేసుకు సంబంధించి పోలీసుల విచారణకు హాజరైన మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ గుట్టు విప్పలేదు. నిజం రాబట్టేందుకు పోలీసులు క్లిష్ట ప్రశ్నలు సంధించినా ఆమె నోరు విప్పలేదని తెలుస్తోంది. గోడౌన్ నిర్వహణ వ్యవహారాలన్నీ తమ మేనేజరే చూసుకునే వారని, తనకేమీ తెలియదని విచారణాధికారికి చెప్పినట్టు సమాచారం. జయసుధ నుంచి ఆశించిన సమాచారం రాకపోవడంతో ఆమెను మరోసారి విచారించే అవకాశం కనిపిస్తోంది.
కుంభమేళా సందర్భంగా విజయవాడ మీదుగా మంగుళూరు సెంట్రల్(MAQ)- వారణాసి(BSB) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. నం.06019 MAQ- BSB రైలు ఈ నెల 18న, ఫిబ్రవరి 15న, అదేవిధంగా నం.06020 BSB- MAQ రైలు ఈ నెల 21న, ఫిబ్రవరి 15న నడుస్తాయన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు గూడూరు, నెల్లూరు, చీరాల, తెనాలిలో ఆగుతాయని బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రస్థాయి ఖురాష్ క్రీడల్లో అండర్-17 బాలికల 63 కేజీల విభాగంలో గన్నవరానికి చెందిన చిన్మయ్ బంగారు పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎన్నికయింది. జనవరి 2వ తేదీ నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయపూర్‌లో జరిగే జాతీయ పోటీలకు కృష్ణా జిల్లా నుంచి ఎన్నికైన ఏకైక బాలిక మానికొండ సాయిసత్య చిన్మయి అని పీఈటీ నాగరాజు తెలిపారు. చదువుతోపాటు క్రీడల్లో కూడా తన ప్రతిభను ప్రదర్శిస్తున్న చిన్మయ్‌ని పలువురు అభినందించారు.
బీఫార్మసీ చదువుతున్న బాలిక మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సింగినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుందని సీఐ వెంకటేశ్వర్ల నాయక్ తెలిపారు. పోలీసుల కథనం.. సింగినగర్‌కి చెందిన విద్యార్థిని చదువులో ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
కృష్ణా జిల్లా ప్రజలందరికీ ఎస్పీ ఆర్.గంగాధర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సర వేళ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అందరికీ ఆనందాన్ని పంచే కొత్త సంవత్సర ఆగమన వేళ ప్రజలంతా ఆహ్లాదకర వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలన్నారు.
కృష్ణా జిల్లాలో 2024 లో 9,719 కేసులు నమోదయ్యాయని SP ఆర్.గంగాధర్ అన్నారు. మంగళవారం ఆయన మచిలీపట్నంలో 2024 సంవత్సర నేరగణాంకాల నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2023లో 9,813 కేసులు నమోదవ్వగా 2024లో ఆ సంఖ్య తగ్గిందన్నారు. పోలీసు శాఖ చేపట్టిన ముందస్తు చర్యలు, కమ్యూనిటి పోలీసింగ్ కారణంగా నేరాల సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు.
విజయవాడ-విశాఖపట్నం(నం. 12718) మధ్య ప్రయాణించే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రేపు జనవరి 1 నుంచి ఈ రైలు ఉదయం 6 గంటలకు విజయవాడలో బయలుదేరుతుందని చెప్పారు. గతంలో 6.15కి ఈ రైలు విజయవాడలో కదిలేదన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించే ప్రక్రియలో భాగంగా రైళ్ల షెడ్యూల్ మార్చామని.. ప్రయాణికులు గమనించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.