India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మచిలీపట్నం సర్వజనాసుపత్రిలో 12 మంది స్టాఫ్ నర్సులను అధికారులు విధుల నుంచి తొలగించారు. కొవిడ్ సమయంలో తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు దర్యాప్తులో తేలడంతో తొలగించినట్లు తాజాగా సమాచారం వెలువడింది. కాగా నర్సుల నియామకంపై ఆరోపణలు రావడంతో రాజమండ్రి హెల్త్ రీజినల్ డైరెక్టర్ దర్యాప్తుకు ఆదేశించారు. అక్రమ మార్గంలో ఉద్యోగాలు పొందిన 12 మందిని విధుల నుంచి తొలగించారు.
కంకిపాడు మండలం ఈడుపుగల్లులో మైనర్ బాలికను లైంగికంగా వేధించిన కీచక టీచర్ శ్రీనివాస్‌ను డీఈవో తాహెరా సుల్తానా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాశాఖాధికారులు స్కూల్ వద్దకు వెళ్లి విచారణ చేసి, నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. శ్రీనివాస్‌ను సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై సందీప్ తెలిపారు.
ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా హైదరాబాద్(HYB), కటక్(CTC) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం. 07165 HYB- CTC ట్రైన్‌ను మంగళవారం నుంచి సెప్టెంబర్ 17 వరకు, నం. 07166 CTC- HYB ట్రైన్‌ను బుధవారం నుంచి సెప్టెంబర్ 18 వరకు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం తదితర స్టేషన్‌లలో ఆగుతాయన్నారు.
తనపై దాడికి ప్రయత్నించిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని అనుచరుడు తురక కిషోర్‌పై ఇవాళ నర్సాపురం ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. గత ప్రభుత్వంలో జగన్, సజ్జల ఒత్తిడితోనే పోలీసులు వారిపై కేసు నమోదు చేయలేదని ఆరోపించారు.
ఎన్నో ఆశలతో స్వదేశానికి వస్తున్న మహిళ అకస్మాత్తుగా మరణించిన ఘటన విజయవాడలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ మస్కట్ నుంచి విజయవాడ వచ్చింది. అక్కడి నుంచి బస్సులో తూర్పు గోదావరి జిల్లా కోరుమామిడికి బస్సులో వెళ్తుంది. ఈ క్రమంలో ఆమెకు అకస్మాతుగా గుండె నొప్పి రావడంతో అక్కడికక్కడే మరణించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
స్వరాజ్య మైదానంలోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మాజీ సీఎం జగన్ పేరు తొలగించిన ఘటనపై సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 8న రాత్రి 10 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉన్న జగన్ పేరు తొలగించారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేరుగ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూర్యారావుపేట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
నూజివీడులోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కోవెల వద్ద శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి ఉత్సవాలతో ఐక్యత సాధ్యమవుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలకు పెద్ద పాలేరులా పనిచేస్తానన్న మాటకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా నం.22837 హటియా- ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ సెప్టెంబర్ 2, 9, 16, 23వ తేదీలలో ఏలూరు మీదుగా కాకుండా నిడదవోలు- భీమవరం- గుడివాడ మీదుగా విజయవాడ చేరుకుంటుందన్నారు. ఆయా తేదీలలో ఈ ట్రైన్‌కు ఏలూరులో స్టాప్ లేదని పేర్కొన్నారు.
కృష్ణా వర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన B.Tech 4, 6వ సెమిస్టర్ పరీక్షలకు (2023-24) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు సెప్టెంబర్ 5లోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలంది.
విజయవాడలో బిరియాని ఒకరి ప్రాణం తీసింది. స్థానికుల వివరాల మేరకు.. గొల్లపూడి పంచాయతీ పరిధిలోని సాయిపురం కాలనీలో సోమవారం అన్న గాలి రామును తమ్ముడు లక్ష్మారెడ్డి బిరియాని అడిగాడు. రాము బిరియాని ఇప్పించలేదని తమ్ముడు కిటికీ చెక్కతో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో రాము అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.