India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ మేయర్‌కు టీడీపీ నేత చన్నగిరి రామరామ్మోహన్ రావు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆయన తన వ్యక్తిగత కారణాలవల్ల రాజీనామా చేశానని, అయితే మరల రాజీనామా పత్రాన్ని వెనక్కి తీసుకున్నానని ఓ ప్రకటన విడుదల చేశారు. టీడీపీకి నిబద్ధత కలిగి ఉంటానని, ఎమ్మెల్యే బొండా ఉమా సహకారంతో డివిజన్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని చెప్పారు.
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో 2025 జనవరి 4న జరగనున్న పలు పరీక్షలు వాయిదాపడ్డాయి. 3,4వ తేదీలలో మచిలీపట్నంలో “యువకెరటాలు” కార్యక్రమం జరగనున్నందున జనవరి 4న జరగాల్సిన PG, MBA&MCA 1వ&3వ సెమిస్టర్ పరీక్షలను జనవరి 21న నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. అదే విధంగా జనవరి 3న జరగాల్సిన PG, MBA&MCA 1వ&3వ సెమిస్టర్ పరీక్షలు జనవరి 20న నిర్వహిస్తామని పేర్కొంది.
కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలు, మునిసిపల్ కార్యాలయాలు, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
కానిస్టేబుల్ అభ్యర్థులు హాజరవ్వాల్సిన ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టులు సోమవారం నుంచి జనవరి 20 వరకు జరగనున్నాయి. మచిలీపట్నంలోని జిల్లా పోలీసు పెరేడ్ మైదానంలో జరిగే ఈవెంట్లకు హాజరవ్వాల్సిన అభ్యర్థులకు ఆదివారం జిల్లా పోలీస్ అధికారులు కీలక సూచనలు చేశారు. ఈ మేరకు PMT/ PET ఈవెంట్లకు వచ్చే అభ్యర్థులు సమర్పించాల్సిన సర్టిఫికెట్ల వివరాలను విడుదల చేశారు.
మచిలీపట్నం: పేర్ని జయసుధ బఫర్ గిడ్డంగిలో జరిగిన స్కాంలో పేర్ని నాని స్నేహితుడు కొడాలి నాని నోరు మెదపడం లేదని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఈ స్కాంలో ఆయనకూ భాగస్వామ్యం ఉందా? అని Xలో ప్రశ్నించారు. గతంలో తరచూ ప్రెస్‌మీట్‌లు పెట్టే పౌరసరఫరాల శాఖ మాజీ మంత్రి కొడాలి నాని, ఇప్పుడు పేర్ని నానిని సమర్థించడం లేదే? అని అన్నారు. కొడాలి నాని పాత్ర ఉందా? లేదా? అనే విచారణలో తేలాల్సి ఉందని పేర్కొన్నారు.
విజయవాడ వజ్రా గ్రౌండ్స్‌లో ఈరోజు గేమ్ ఛేంజర్ చిత్ర యూనిట్ కటౌట్‌ను ఆవిష్కరించబోతుంది. వేడుకల్లో భాగంగా హెలికాప్టర్‌తో రామ్ చరణ్ కటౌట్‌కి పూలాభిషేకం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజుతో పాటు గేమ్ ఛేంజర్ చిత్ర బృందం హాజరుకానుంది. అలాగే రామ్ చరణ్ అభిమానులు భారీగా తరలి రానున్నారు. కాగా సుమారు 256 అడుగుల ఎత్తుతో గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ కటౌట్ ఏర్పాటు చేశారు.
కుంభమేళా సందర్భంగా విజయవాడ మీదుగా గుంటూరు, గయ(బీహార్) మధ్య 2 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07719 గుంటూరు- గయ రైలును జనవరి 25న, నం.07720 గయ- గుంటూరు రైలును జనవరి 27న నడుపుతున్నామని తెలిపింది. నం.07719 రైలు 25న మధ్యాహ్నం 3.30కి విజయవాడ చేరుకుంటుందని, నం.07720 రైలు గయలో 27న బయలుదేరి 29న ఉదయం 1.30కి విజయవాడ వస్తుందన్నారు.
గన్నవరం – ముస్తాబాద మధ్య ట్రాక్ పనులు జరుగుతున్నందున రైలు నం.13351 ధన్‌బాద్ – అలప్పుజ ఎక్స్‌ప్రెస్ రైలు మార్గాన్ని మార్చినట్లు రైల్వే అధికారులు శనివారం తెలిపారు. ఈ ట్రైన్ ఈ నెల 30, 31, జనవరి 2, 3, 4 తేదీలలో ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా గాక విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్ గుండా నిడదవోలు చేరుతుందన్నారు. ఆయా తేదీలలో ఈ ట్రైన్‌కు ఏలూరు, తాడేపల్లిగూడెంలో స్టాప్ లేదని, ప్రయాణికులు గమనించాలని సూచించారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో 2025 జనవరి 3న జరగనున్న 2 పరీక్షలు వాయిదాపడ్డాయి. వచ్చే నెల 3న మచిలీపట్నంలో యువ కెరటాలు కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో UG 1వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షలు జనవరి 6న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. PG, MBA & MCA 1వ & 3వ సెమిస్టర్ పరీక్షలను జనవరి 20న నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలోని కళాశాలల్లో ఎంటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షలను 2025 జనవరి 22 నుంచి నిర్వహిస్తామని ANU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 2025 జనవరి 1లోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, రివైజ్డ్ షెడ్యూల్ వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడాలని పరీక్షల విభాగం శనివారం పేర్కొంది.
Sorry, no posts matched your criteria.