India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా జిల్లాలోని 25 మండలాల్లో శనివారం 66.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. అత్యధికంగా కోడూరులో 12.4 మీ.మీ, నాగాయలంకలో 10.6, కృత్తివెన్నులో 10.2 మిల్లీమీటర్ల వర్షపాతం.. అత్యల్పంగా గుడ్లవల్లేరులో 0.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. పమిడిముక్కల, తోట్లవల్లూరు మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. జిల్లాలో సగటున 2.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
కృష్ణా జిల్లా మోపిదేవిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో శనివారం మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి వ్యవసాయ పనుల నిమిత్తం మోపిదేవి లంక పొలం వద్దకు వెళ్లాడు. కొద్దిసేపటికే అతడు పొలం గట్టుపై కుప్పకూలడం చూసిన స్థానికులు అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రీనివాసరెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఈనెల 26వ తేదీ సోమవారం జరిగే మీకోసం పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డీ.కే.బాలాజీ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. సోమవారం కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా ప్రభుత్వ సెలవు కారణంగా కార్యక్రమం రద్దు చేసినట్లు తెలిపారు. జిల్లా ప్రజానీకం ఈ విషయం గమనించవలసిందిగా కలెక్టర్ కోరారు.
దంత వైద్య కళాశాలల్లో రెండో విడత కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన ఎండీఎస్ కన్వీనర్, యాజమాన్య సీట్ల ప్రవేశానికి ఆప్షన్లు ఎంచుకోవాలని Dr. NTR ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. అర్హులకు ఈ నెల 24 రాత్రి 9 గంటల వరకు అవకాశం ఉందన్నారు. కన్వీనర్ కోటా కింద 51, యాజమాన్య కోటాలో 72 సీట్లను సీట్ మ్యాట్రిక్స్‌లో పొందుపర్చారని, అభ్యర్థుల జాబితాను యూనివర్సిటీ వెబ్ సైట్‌లో ఉంచామన్నారు.
విజయవాడ రూరల్ మండలం నున్న పోలీస్ స్టేషన్లో యువతిపై కత్తితో బెదిరించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రకాశ్ నగర్‌కు చెందిన యువతి B.TECH చదువుతోంది. ఈ క్రమంలో ఆ యువతిని అనిల్ అనే యువకుడు ఈ నెల 21న కత్తితో బెదిరించి ఎవరితో మాట్లాడవద్దు అంటూ చెంపపై కొట్టి బెదిరించి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నున్న పోలీసులు తెలిపారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. బాధితుల్లో జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు కనిపిస్తున్నాయి. మూడు రోజుల తరువాత జ్వరం తగ్గినప్పటికీ ఒళ్లు నొప్పులు, తలనొప్పి వేధిస్తున్నాయి. కుటుంబంలో ఒకరికి వస్తే.. మిగిలిన వారికీ వ్యాప్తి చెందుతోందని బాధితులు తెలిపారు. మూడు రోజులకు మించి జ్వర లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.
తిరువూరు మండలం లక్ష్మీపురంలో శుక్రవారం నిర్వహించిన ఉపాధి హామీ పథకం గ్రామసభలో ఆర్డీవో మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. గ్రామ సభలో 82 రకాల పనులను గుర్తించారు. కార్యక్రమంలో సర్పంచ్ గొల్లమందల శ్రీనివాస్, ఎంపీడీవో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్‌కు బెయిల్ మంజూరైంది. అగ్రిగోల్డ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో నిందితుడిగా ఉన్న ఇతనికి విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. జోగి రాజీవ్ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
మహాత్మ గాంధి జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టబోయే పనులపై కృష్ణా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. బందరు మండలం భోగిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన గ్రామసభలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొనగా బంటుమిల్లిలో జరిగిన గ్రామసభలో కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు గ్రామసభల్లో పాల్గొన్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గ్రామ పంచాయతీలకు పెద్ద ఎత్తున నిధులు విడుదలయ్యాయి. 15వ ఆర్థిక సంఘం కింద 2 జిల్లాలకు రూ.42.13కోట్లు మంజూరయ్యాయి. ఇందులో కృష్ణా జిల్లాకు రూ.23.65కోట్లు, ఎన్టీఆర్ జిల్లాకు రూ.18.48 కోట్లు విడుదలైనట్టు అధికారులు తెలిపారు. ఈ నిధులతో గ్రామ పంచాయతీల నిర్వహణతో పాటు తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పనకు వినియోగించనున్నారు.
Sorry, no posts matched your criteria.