Krishna

News July 15, 2024

కృష్ణా: ఇంటింటి సర్వే ద్వారా కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు

image

కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఈ నెల 18 నుంచి ఆగస్ట్ 2వ తేదీ వరకు జిల్లాలో ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్టు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను సోమవారం ఆమె కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 1403 సర్వే బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ సర్వే బృందాలు ఇంటింటికీ వెళ్లి కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించడం జరుగుతుందన్నారు.

News July 15, 2024

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: డీ.కే బాలాజీ

image

వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ డీ.కే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఉద్యోగుల సమస్యలను జిల్లా కలెక్టర్ విని సంబంధిత అధికారులను పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News July 15, 2024

ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు: కలెక్టర్ సృజన

image

ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని బాధ్యతతో విధులు నిర్వర్తించి ఉన్నతాధికారులు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించినప్పుడే లక్ష్యాలు సాధించగలమని కలెక్టర్ సృజన అన్నారు. సోమవారం జిల్లా పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆమె ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. విధులు నిర్వర్తించడంలో బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

News July 15, 2024

ఎన్టీఆర్: జిల్లాలో విజయవంతంగా జలశక్తి అభియాన్‌

image

ఎన్టీఆర్ జిల్లాలో చేపడుతున్న జలశక్తి అభియాన్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ సృజన తెలిపారు. కలెక్టరేట్‌ క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం జలశక్తి అభియాన్‌ కార్యక్రమం ద్వారా జిల్లాలో చేపట్టి పూర్తయిన, చేపడుతున్న పనుల ప్రగతిని పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జలశక్తి అభియాన్‌ కార్యక్రమాన్ని రెండు దశలలో చేపట్టడం జరిగిందన్నారు.

News July 15, 2024

ప్రతిపాదనలు తయారు చేయాలి: కృష్ణా JC

image

కృష్ణా జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాలులో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. పలు అంశాలపై సమీక్షించిన ఆమె పలు శాఖల అధికారులను మూలధన, వ్యయం ప్రతిపాదనలు తయారు చేసి జిల్లా సీపీఓకు సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ చంద్రశేఖరరావు, ఆర్డీఓ ఎం వాణి తదితరులు పాల్గొన్నారు.

News July 15, 2024

కంచికచర్ల క్వారీలో ప్రమాదం.. ఒకరి మృతదేహం గుర్తింపు

image

కంచికచర్ల మండలం పరిటాల క్వారీలో కొండ రాళ్లు విడిగిపడి ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా పోలీసులు ఇప్పటికే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్వారీ పైనుంచి లూజు బోల్డర్స్, రాళ్లు కార్మికులపై పడటంతో ముగ్గురు మృతి చెందగా.. <<13632186>>వారిలో ఒకరి ఆచూకీ గుర్తించారు.<<>> మిగిలిన ఇద్దరికోసం సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మృతులది జి. కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామంగా తెలుస్తుంది.

News July 15, 2024

కంచికచర్ల వద్ద ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

image

కంచికచర్ల మండలం పరిటాల క్వారీలో విషాదం చోటు చేసుకుంది. క్వారీ పైనుంచి లూజు బోల్డర్స్, రాళ్లు పెద్ద మొత్తంలో జారి కింద డ్రిల్లింగ్ వేస్తున్న కార్మికులపై పడ్డాయి. దీంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు జి.కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామానికి చెందిన వారుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సిఉంది.

News July 15, 2024

సిమెంట్ ఫ్యాక్టరీ ఘటనలో 4కి చేరిన మృతుల సంఖ్య

image

జగ్గయ్యపేట మండలం బూదవాడ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలుడు <<13582186>>ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటివరకు నలుగురికి<<>> చేరింది. విజయవాడ మణిపాల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సిమెంట్ కర్మాగార ఉద్యోగి శ్రీమన్నారాయణ నేడు మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. మృతుని స్వస్థలం పల్నాడు జిల్లా మాచర్లగా అధికారులు వెల్లడించారు.

News July 15, 2024

కృష్ణా: యువతకు శుభవార్త చెప్పిన APSSDC

image

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నిరుద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణ జులై 16 నుంచి 22 వరకు రోజుకు 2 గంటల పాటు ఇస్తామని తెలిపింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పూర్తి వివరాలకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ http://engineering.apssdc.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.

News July 15, 2024

కృష్ణా: యువతకు శుభవార్త చెప్పిన APSSDC

image

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నిరుద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణ జులై 16 నుంచి 22 వరకు రోజుకు 2 గంటల పాటు ఇస్తామని తెలిపింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పూర్తి వివరాలకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ http://engineering.apssdc.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.