Krishna

News August 22, 2024

విజయవాడ: పార్ట్ టైం జాబ్ పేరిట భారీ మోసం

image

ఓ యువతి వద్ద రూ.5.53 లక్షలు దోచుకున్న నేరగాళ్లపై విజయవాడ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. రెడ్డిగూడేనికి చెందిన యువతికి గత నెల 9న పార్ట్ టైం జాబ్ ఉందంటూ మెసేజ్ వచ్చింది. అమృత్ అనే వ్యక్తి ఫోన్ చేసి లింక్ పంపించాడు. రిజిస్ట్రేషన్ చేసుకోగానే రూ.500 వచ్చాయి. ఆమె డబ్బులు చెల్లించిన ప్రతిసారీ అదనంగా వచ్చాయి. పలుమార్లు రూ.5.53 లక్షలు పంపింది. ఈ సారి డబ్బులు రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది.

News August 22, 2024

పెడన : ప్రభుత్వ కాలేజీలో ఉద్యోగాలు

image

పెడనలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులు కావాలని కళాశాల ప్రిన్సిపల్ కేసీఎన్ వీఎస్ రామారావు కోరారు. జనరల్ కామర్స్-1, వొకేషనల్ కామర్స్-1 పోస్టుకు అవకాశం ఉందన్నారు. అభ్యర్థులు ఎంకాంలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని, ఈ నెల 23 సాయంత్రం 4గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 24న మచిలీపట్నం లేడీయాంప్తిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డెమో, ఇంటర్వ్యూ ఉంటుందన్నారు.

News August 22, 2024

పెడన: అంత్యక్రియలను అడ్డుకున్న పోలీసులు

image

ఆత్మహత్య చేసుకున్న మహిళకు అంత్యక్రియలు చేస్తుండగా చివరినిమిషంలో పోలీసులు అడ్డుకున్న ఘటన పెడనలో జరిగింది. ఇన్‌ఛార్జ్ SI గణేశ్ కుమార్ కథనం..తిరుపతమ్మ(29), సురేశ్ దంపతులు. భార్య మంగళవారం రాత్రి ఉరివేసుకుంది. బుధవారం కుటుంబీకులు అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమయ్యారు.ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

News August 22, 2024

VJA: బాలికతో ఉపాధ్యాయుని అసభ్య ప్రవర్తన

image

విజయవాడలో ఓ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశామని టూటౌన్ సీఐ కొండలరావు తెలిపారు. విజయవాడ కొత్తపేటకు చెందిన బాలిక స్థానిక పాఠశాలలో చదువుతోంది. అదే స్కూల్లో పనిచేస్తున్న హేమంత్ అనే ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

News August 22, 2024

రాజధాని, అన్న క్యాంటీన్లకు రూ.2 కోట్ల విరాళం

image

అన్న క్యాంటీన్, అమరావతి రాజధాని నిర్మాణానికి పలువురు విరాళాలు అందించారు. సీఎం చంద్రబాబును బుధవారం సచివాలయంలో కలిసి విరాళాల చెక్కులు అందించారు. విజయవాడకు చెందిన పారిశ్రామిక వేత్త, డీఆర్ఎన్ ఠాగూర్ గ్రూప్ ఛైర్మన్ రవీంద్రనాథ్ ఠాగూర్ అమరావతి రాజధాని, అన్న క్యాంటీన్‌లకు కోటి చొప్పున రూ.2 కోట్లు, కడప జిల్లా, పాయసం పల్లెకు చెందిన ఎన్వీ నారాయణ రెడ్డి రాజధానికి రూ.10,00,116లు విరాళంగా ఇచ్చారు. 

News August 21, 2024

కృష్ణా: TODAY TOP NEWS

image

* విజయవాడలో హైటెక్ మోసానికి యత్నం
* జోగి రమేశ్ కేసుపై ఆయన లాయర్లు ఏమన్నారంటే?
* కృష్ణా: వరదలో కొట్టుకుపోయిన రైతు
* విజయవాడ: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ స్పాట్‌డెడ్
* కృష్ణా: జోగి రమేశ్‌కు మరోసారి నోటీసులు
* అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో పేలుడు.. YS జగన్‌ దిగ్భ్రాంతి
* CM చంద్రబాబుకు పేర్ని నాని సవాల్

News August 21, 2024

రష్యాలో ఎల్బ్రస్ పర్వతం అధిరోహించిన తెలుగు యువతి

image

రష్యాలోని ఎల్బ్రస్ పర్వతాన్ని తెలుగు యువతి అధిరోహించింది. ఈ పర్వతం రష్యా, ఐరోపాలో ఎత్తైన పర్వతం. ఇది సముద్ర మట్టానికి 5,642మీ(18,510 అడుగులు) ఎత్తులో ఉన్న ఒక నిద్రాణమైన అగ్నిపర్వతం. ఇది యురేషియా సూపర్ ఖండంలో ఎత్తైన స్ట్రాటోవోల్కానో, అలాగే ప్రపంచంలోని 10వ-అత్యంత ప్రముఖ శిఖరం. ఈ శిఖరాన్ని తాడేపల్లికి చెందిన యువతి అన్నపూర్ణ అలవోకగా అధిరోహించారు. ఆమె త్వరలో తాడేపల్లికి రానున్నారు.

News August 21, 2024

అచ్యుతాపురంలో రియాక్టర్‌ పేలుడు ఘటనపై జగన్‌ దిగ్భ్రాంతి

image

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో రియాక్టర్‌ పేలుడు ఘటనపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

News August 21, 2024

దేశంలోనే బెస్ట్ ఇండస్ట్రీ పాలసీ రూపొందిస్తాం: కొండపల్లి

image

వికసిత్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా దేశంలోనే బెస్ట్ ఇండస్ట్రీ పాలసీని రూపొందించనున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. నూతన ఇండస్ట్రీ పాలసీ రూపకల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఐఐసీ, సీఐఐల సంయుక్త ఆధ్వర్యంలో స్టేక్ హోల్డర్స్ సమావేశం విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో బుధవారం జరిగింది. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపడం శుభసూచకమన్నారు.

News August 21, 2024

విజయవాడ: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ స్పాట్‌డెడ్

image

విజయవాడలో కృష్ణానది వారధిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళగిరి 6వ బెటాలియన్ ఏపీఎస్పీ కానిస్టేబుల్ తారక రామారావుని లారీ ఢీకొట్టింది. దీంతో రామారావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ సీఐ బాలమురళీకృష్ణ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.