India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా జిల్లా పెనమలూరులో సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అభిమానులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పెనమలూరుకు చెందిన ఓ అభిమాని కోరిక మేరకు ఆయన గుండెపై ఆటోగ్రాఫ్ ఇచ్చారు. దీంతో ఆ అభిమానికి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సీఎం చంద్రబాబుతో నియోజకవర్గానికి చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నేతలు సెల్ఫీలు దిగారు.
అంతవరకు సరదా సరదాగా గడిపిన ఆ కుటుంబంలో ఒక్కసారిగా పెద్ద అలజడి.. తమతో పాటు ఉన్న చిన్నారి అకస్మాత్తుగా కనిపించకపోయే సరికి అంతులేని ఆవేదన. తప్పిపోయిన చిన్నారులను కనిపెట్టే సీఎంఎస్ యాప్ను NTR జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు శుక్రవారం తెలిపారు. విజయవాడలో డిసెంబర్ 21 నుంచి 25 వరకు జరిగే భవాని విరమణ దీక్షల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
అంతవరకు సరదా సరదాగా గడిపిన ఆ కుటుంబంలో ఒక్కసారిగా పెద్ద అలజడి.. తమతో పాటు ఉన్న చిన్నారి అకస్మాత్తుగా కనిపించకపోయే సరికి అంతులేని ఆవేదన. తప్పిపోయిన చిన్నారులను కనిపెట్టే సీఎంఎస్ యాప్ను NTR జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు శుక్రవారం తెలిపారు. విజయవాడలో డిసెంబర్ 21 నుంచి 25 వరకు జరిగే భవాని విరమణ దీక్షల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
ఏపీ సీఆర్డీఏలో కాంట్రాక్ట్ పద్ధతిన 5 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు రేపు శుక్రవారంలోపు https://crda.ap.gov.in/ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ లీడ్, ప్రాజెక్టు మేనేజర్ తదితర పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఉద్యోగ అర్హతలు తదితర వివరాలకు అభ్యర్థులు CRDA వెబ్సైట్లో CAREERS ట్యాబ్ చూడవచ్చని కమిషనర్ కె.భాస్కర్ తెలిపారు.
ప్రభుత్వం తరఫున ఈనెల 23న విజయవాడలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారని చెప్పారు. చర్చ్ ఫాదర్లు, మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కృషి చేద్దామన్నారు. అనంతరం గురువారం సెమీ క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం కంకిపాడు, పెనమలూరు మండలాల్లో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గురువారం ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు, స్థానిక ఎమ్మెల్యె బోడే ప్రసాద్ గంగూర్లో హెలిపాడ్, రైతు సేవా కేంద్రం, శ్రీ వెంకటాద్రి రైస్ మిల్, ఈడుపుగల్లు గ్రామంలోని ఏర్పాట్లను పరిశీలించారు.
ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్పోర్టు సైజు ఫొటోను 9703622022కు వాట్సాప్ చేయండి.
AP స్టేట్ ఫైబర్నెట్ ప్రస్తుతం దివాళా అంచున ఉందని ఛైర్మన్ GV రెడ్డి అన్నారు. గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ తీరుతో APSFL దివాళా తీసే స్థితికి వచ్చిందన్నారు. వైసీపీ హయాంలో సంస్థకు MDగా పనిచేసిన మధుసూదన్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతోందన్నారు. వారి అక్రమాలు బయటపడకుండా ఒక మహిళా ఉద్యోగి సాయంతో దస్త్రాలు మార్చారని, ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేశామన్నారు.
గన్నవరం మండలం మెట్లపల్లిలో చిరుతపులుల సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామానికి చెందిన రైతు పందుల నుంచి తన పంట పొలాన్ని రక్షించేందుకు ఉచ్చు పెట్టగా ఉచ్చులో చిరుత పులి చిక్కింది. రైతు ఉదయాన్నే పొలం వెళ్లి చూడగా ఉచ్చులో చిక్కి చిరుత పులి మృతి చెందింది. దీంతో గ్రామస్థులు, పరిసర ప్రాంత ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో సైబర్ మోసాల బారిన పడొద్దని స్థానిక పోలీసులు హెచ్చరించారు. యూట్యూబ్ వీడియోలకు లైక్ కొట్టి డబ్బు సంపాదించవచ్చని, టెలిగ్రామ్ గ్రూపులలో పెట్టుబడి పెట్టించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ తరహా మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసానికి గురైతే 1930కి కాల్ చేయాలని బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Sorry, no posts matched your criteria.