Krishna

News January 18, 2025

ఆ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదు: SP 

image

కృష్ణా జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు హాజరవ్వాల్సిన పురుష అభ్యర్థులకు SP ఆర్. గంగాధర్ కీలక సూచన చేశారు. పురుష అభ్యర్థులకు మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో దేహదారుఢ్య పరీక్షలు ఈనెల 20 వరకు మాత్రమే నిర్వహిస్తామన్నారు. పురుషులకు సంబంధించి నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి పొడిగింపులకు అవకాశం లేదని, కానిస్టేబుల్ అభ్యర్థులు గమనించాలని SP ఆర్. గంగాధర్ తెలిపారు. 

News January 17, 2025

హెల్మెట్ వినియోగం తప్పనిసరి: కలెక్టర్

image

జాతీయ రహదారులపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై కమిటీ సమీక్షించింది. 

News January 17, 2025

VJA: అమిత్‌షా భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేయాలి

image

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన సందర్భంగా భద్రత ఏర్పాట్లపై విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు శుక్రవారం ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 18, 19న జిల్లాలో కేంద్రమంత్రి పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను పోలీస్ కమిషనర్ రాజశేఖర్ ఆదేశించారు. సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

News January 17, 2025

జగ్గయ్యపేటలో దారుణ హత్య

image

జగ్గయ్యపేటలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. జగ్గయ్యపేటకు చెందిన యర్రంశెట్టి ఆంజనేయులు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆంజనేయులు గతంలో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్‌గా పని చేశారు. గతంలో ఆయనపై పలు ఫిర్యాదులు రావడంతో సామినేని ఉదయభాను తొలగించారు. ఎన్నికలకు ముందు టీడీపీలో తిరుగుతూ ఉన్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.

News January 17, 2025

మచిలీపట్నం: మెయిన్స్‌కు 262 మంది క్వాలిఫై

image

మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో గురువారం కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు పురుష అభ్యర్థులు 390 మంది హాజరయ్యారని జిల్లా SP కార్యాలయం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. వీరిలో 128 మంది డిస్ క్వాలిఫై అయ్యారని పేర్కొంది. 262 మంది మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారని జిల్లా SP కార్యాలయం వివరాలు వెల్లడించింది.

News January 16, 2025

మానవత్వం చాటుకున్న మంత్రి కొలుసు పార్థసారధి

image

మంత్రి కొలుసు పార్థసారధి మానవత్వం చాటుకున్నారు. గురువారం ఏలూరు నుంచి విజయవాడకు వెళుతుండగా జాతీయ రహదారిపై కలపరు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కోడూరుపాడుకు చెందిన శిరీష, ఆమె తల్లి తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళుతున్న మంత్రి ప్రమాదాన్ని చూసి తన కాన్వాయిని ఆపి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని అధికారులు ఆదేశించారు.

News January 16, 2025

కృష్ణా: పరీక్షా ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన బీపీఈడీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.

News January 16, 2025

విజయవాడ: మెడికల్ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

విజయవాడ ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో GNM సీట్లు పెంచుతూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న జీఎన్ఎం 30 సీట్లు ఉండగా వాటిని 60కి పెంచుతూ ఈ ఉత్తర్వులో పేర్కొంది. 30 నుంచి 60 మేరకు GNM సీట్లు పెంచుతూ వైద్యారోగ్య శాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

News January 16, 2025

17న కృష్ణా జిల్లాకు కేంద్రమంత్రి అమిత్ షా

image

కేంద్ర మంత్రి అమిత్‌షా ఈనెల 17,18 కృష్ణాజిల్లాలో పర్యటించనున్నారు. ఈనెల 17 రాత్రికి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లి వెళ్లి సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. 18వ తేదీ గన్నవరం మండలంలోని కొండపావులూరులో నూతనంగా నిర్మించిన NIDM, NDRF, 10వ బెటాలియన్ ప్రాంగణాలను ఆయన ప్రారంభించనున్నారు. 

News January 16, 2025

రూ.1.25కోట్ల పందెం గెలిచిన గుడివాడ కోడి

image

గుడివాడ మండలానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి నిన్న ప.గో జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన కోడి పందెంలో రూ.1.25కోట్లను గెలుచుకున్నారు. దీంతో నిన్నటి వరకు ఒక ఎత్తు నిన్నటి నుంచి మరో ఎత్తు అన్న చందాన గుడివాడ ప్రభాకర్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. కాగా ఆయన ప్రతినిత్యం కోళ్లతో మమేకమవుతూ కోడిపందేల్లో ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా పేరొందారు.