India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోలీసులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించగలమని ఎస్పీ గంగాధర్ రావు అన్నారు. శుక్రవారం మచిలీపట్నంలోని పోలీస్ కల్యాణ మండపంలో సిబ్బంది & వారి కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరగకుండా ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
విజయవాడకు చెందిన పొట్లూరి అలేఖ్యచౌదరి, మందడంకు చెందిన సాంబశివరావు 11 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో అలేఖ్య తల్లిదండ్రులు పెళ్లికి అభ్యంతరం తెలిపారు. దీంతో ఇంట్లో తెలియకుండా ఆగస్టు 15న పెళ్లి చేసుకుని శ్రీవారి దర్శనార్థం శుక్రవారం తిరుపతి వస్తుండగా తిరుచానూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన తల్లిదండ్రులతో ప్రాణహాని ఉందని, తమకి రక్షణ కల్పించాలని అలేఖ్య వీడియో మెసేజ్ చేసింది.
NTR జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో ఎస్ఐలను భారీగా బదిలీ చేస్తున్నట్లు పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. ఏలూరు రేంజ్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న 100 మంది సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంతకాలంగా వీఆర్‌లో ఉన్నా ఎస్ఐలకు స్థానచలనం కల్పించారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని సీపీ పేర్కొన్నారు.
విజయవాడ సింగ్ నగర్‌లోని రూప లక్ష్మీ సాయి బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం సేవించి అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు నాగేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి ఆయన ఢిల్లీ చేరుకుంటారు. రేపు కూడా ఆయన హస్తినలోనే ఉంటారు. ఈ పర్యటనలో చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై వారితో చర్చించనున్నారు. అనంతరం శనివారం రాత్రి ఆయన ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.
గుడివాడ మునిసిపల్ పార్క్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరితో ఎన్టీఆర్ స్టేడియానికి చేరుకున్నారు. అనంతరం చంద్రబాబు దంపతులు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. అనంతరం వారు ఆ అన్నక్యాంటీన్లో భోజనం చేశారు.
గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ భోజనం చేస్తున్న వారితో సీఎం చంద్రబాబు ముచ్చటించారు. అనంతరం వారికి మంచి భవిష్యత్తు చూపించాలని కలెక్టర్ డీకే బాలాజీని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి, రావి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
పామర్రు పట్టణ పరిధిలోని సనాహుల్లా అనే వ్యక్తి మాంసం వ్యాపారం చేసుకుంటాడు. ఈ క్రమంలో అతను పామర్రు పట్టణ పరిధిలోని ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు యువకుడిపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ, పోక్సో యాక్ట్ కింద బుధవారం కేసు నమోదు చేశామని ఎస్సై అవినాశ్ తెలిపారు. ఈ కేసును గుడివాడ డీఎస్పీ శ్రీకాంత్ దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.
వైసీపీని తమ పార్టీలో విలీనం చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల స్పందించారు. బుధవారం విజయవాడలో కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పిల్ల కాలువలు ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందేనని జోస్యం చెప్పారు. ఒకవేళ వారు కలుస్తామని అంటే స్వాగతిస్తామని పేర్కొన్నారు. వైసీపీ చీఫ్‌గా కాంగ్రెస్ చర్చలు జరిపిందనే ప్రచారం అబద్ధమన్నారు. జగన్ తిరిగి అధికారంలోకి రారని జోస్యం చెప్పారు.
తల్లి మరణాన్ని తట్టుకోలేక కుమార్తె ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన నూజివీడు పట్టణంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన ఏ.లక్ష్మి (38) ఇంటిలోని ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. ఇటీవల లక్ష్మీ తల్లి మృతి చెందడంతో తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.