Krishna

News December 20, 2024

కృష్ణా: నేటితో ముగియనున్న గడువు

image

ఏపీ సీఆర్డీఏలో కాంట్రాక్ట్ పద్ధతిన 5 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు రేపు శుక్రవారంలోపు https://crda.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ లీడ్, ప్రాజెక్టు మేనేజర్ తదితర పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఉద్యోగ అర్హతలు తదితర వివరాలకు అభ్యర్థులు CRDA వెబ్‌‌సైట్‌లో CAREERS ట్యాబ్ చూడవచ్చని కమిషనర్ కె.భాస్కర్ తెలిపారు. 

News December 20, 2024

23న విజయవాడలో సెమీ క్రిస్మస్ వేడుకలు

image

ప్రభుత్వం తరఫున ఈనెల 23న విజయవాడలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారని చెప్పారు. చర్చ్ ఫాదర్లు, మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కృషి చేద్దామన్నారు. అనంతరం గురువారం సెమీ క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. 

News December 19, 2024

ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం కంకిపాడు, పెనమలూరు మండలాల్లో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గురువారం ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు, స్థానిక ఎమ్మెల్యె బోడే ప్రసాద్ గంగూర్‌లో హెలిపాడ్, రైతు సేవా కేంద్రం, శ్రీ వెంకటాద్రి రైస్ మిల్, ఈడుపుగల్లు గ్రామంలోని ఏర్పాట్లను పరిశీలించారు. 

News December 19, 2024

ముచ్చటైన ముగ్గులకు ఆహ్వానం.!

image

ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను 9703622022కు వాట్సాప్ చేయండి.

News December 19, 2024

APSFL దివాళా అంచున ఉంది: ఛైర్మన్ GV రెడ్డి

image

AP స్టేట్ ఫైబర్‌నెట్ ప్రస్తుతం దివాళా అంచున ఉందని ఛైర్మన్ GV రెడ్డి అన్నారు. గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ తీరుతో APSFL దివాళా తీసే స్థితికి వచ్చిందన్నారు. వైసీపీ హయాంలో సంస్థకు MDగా పనిచేసిన మధుసూదన్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతోందన్నారు. వారి అక్రమాలు బయటపడకుండా ఒక మహిళా ఉద్యోగి సాయంతో దస్త్రాలు మార్చారని, ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేశామన్నారు.

News December 19, 2024

గన్నవరం మండలంలో వలకు చిక్కిన చిరుత.. మృతి

image

గన్నవరం మండలం మెట్లపల్లిలో చిరుతపులుల సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామానికి చెందిన రైతు పందుల నుంచి తన పంట పొలాన్ని రక్షించేందుకు ఉచ్చు పెట్టగా ఉచ్చులో చిరుత పులి చిక్కింది. రైతు ఉదయాన్నే పొలం వెళ్లి చూడగా ఉచ్చులో చిక్కి చిరుత పులి మృతి చెందింది. దీంతో గ్రామస్థులు, పరిసర ప్రాంత ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 19, 2024

ఉద్యోగాల పేరుతో సైబర్ మోసాల బారిన పడొద్దు: పోలీసులు

image

పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో సైబర్ మోసాల బారిన పడొద్దని స్థానిక పోలీసులు హెచ్చరించారు. యూట్యూబ్ వీడియోలకు లైక్ కొట్టి డబ్బు సంపాదించవచ్చని, టెలిగ్రామ్ గ్రూపులలో పెట్టుబడి పెట్టించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ తరహా మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసానికి గురైతే 1930కి కాల్ చేయాలని బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

News December 19, 2024

కృష్ణా: డిప్లొమా విద్యార్థులకు ముఖ్య గమనిక 

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో వాటర్&వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ కోర్సులో పీజీ డిప్లొమా(Y19) చదివిన విద్యార్థుల కోసం ‘వన్ టైం ఆపర్చునిటీ’ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 2025 జనవరి 2 నుంచి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని, లేట్ ఫీ లేకుండా ఈనెల 26లోపు విద్యార్థులు ఫీజు చెల్లించాలని KRU పరీక్షల విభాగం సూచించింది. ఫీజు వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చని తెలిపింది. 

News December 19, 2024

కృష్ణాజిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

image

ముఖ్యమంత్రి చంద్రబాబు డిసెంబర్ 20వ తేదీన కృష్ణా జిల్లాలో  పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన గంగూరులో ధాన్యం కొనుగోలను పరిశీలించనున్నారు. అనంతరం ఈడుపుగల్లు రెవెన్యూ సదస్సులో పాల్గొంటారు. ఆ సదస్సులో ప్రజల నుంచి వినతలు స్వీకరించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నాయకులు ఏర్పాట్లు పరిశీలించారు.  

News December 19, 2024

రాష్ట్రంలో మూడో స్థానంలో కృష్ణా జిల్లా: డీజీపీ అభినందనలు

image

జాతీయ లోక్ అదాలత్ కేసులలో కృష్ణా జిల్లాలో 4,436 కేసులు పరిష్కరించిన పోలీస్ యంత్రాంగాన్ని డీజీపీ ద్వారకా తిరుమలరావు అభినందించారు. బుధవారం ఆయన కృష్ణా జిల్లా SP ఆర్.గంగాధర్‌ను ఈ సందర్భంగా అభినందించారు. ఈ మేరకు SP, ఇతర పోలీస్ సిబ్బందికి డీజీపీ ప్రశంసాపత్రాన్ని అందజేశారు. జాతీయ లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో ఉందని SP డీజీపీకి తెలిపారు.