Krishna

News August 12, 2024

మాజీ MLA పిన్నెల్లి బెయిల్ పిటిషన్ వాయిదా

image

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. గతంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి వద్దకే ఈ పిటిషన్ వెళ్లాలని హైకోర్టుకు పోలీసుల తరఫు లాయర్ అశ్వినీకుమార్ సూచించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి నిశితంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి వెల్లడించారు. అనంతరం కేసు తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.

News August 12, 2024

YCP క్రీడలను విస్మరించింది: విజయవాడలో మంత్రి

image

వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా తయారు చేస్తామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సోమవారం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో శాప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హబ్‌గా చేసేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. క్రీడాకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు. గత ప్రభుత్వం క్రీడలను పూర్తిగా విస్మరించదని ఆరోపించారు.

News August 12, 2024

అవగాహనతోనే ఎయిడ్స్ నివారణ: కలెక్టర్ సృజన

image

ఎయిడ్స్‌ వ్యాధి పట్ల పూర్తి అవగాహన కల్పించి వ్యాధిని నివారించేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ సృజన తెలిపారు. మొగల్రాజపురం సిద్ధార్థ కళాశాలలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. క్రమశిక్షణా జీవితమే ఎయిడ్స్‌ వ్యాధి రక్షణకు ఏకైక మార్గమన్నారు. వ్యాధి బారిన పడిన వారి పట్ల వివక్షత చూపకుండా మనోధైర్యాన్ని నింపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

News August 12, 2024

ఆగస్టు 15న ఉయ్యూరు రానున్న సీఎం చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు ఆగస్టు 15న ఉయ్యూరులో పర్యటించనున్నారు. 15వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు సీఎం చంద్రబాబు ఉయ్యూరులో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించనున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్లను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

News August 12, 2024

NTR: కీలక పదవి రేసులో MLA సుజనా చౌదరి

image

ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి పదవిని భర్తీ చేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. కాగా ఈ పదవికి విజయవాడ పశ్చిమ MLA సుజనా చౌదరి పేరు సైతం వినిపిస్తోంది. గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేయడంతో సుజనా ఈ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ ర్యాంక్‌తో కూడిన కీలకమైన ఈ పదవిలో CM చంద్రబాబు ఎవరిని నియమిస్తారో త్వరలో తెలియనుంది.

News August 12, 2024

నేడు విజయవాడ రానున్న హీరో విక్రమ్

image

తంగలాన్ చిత్ర ప్రమోషన్లలో భాగంగా హీరో విక్రమ్ సోమవారం విజయవాడ రానున్నారు. ఉదయం 11 గంటలకు విక్రమ్‌తో పాటు చిత్రబృందం ప్రెస్‌మీట్ నిర్వహిస్తారని ఈ మేరకు తాజాగా సమాచారం వెలువడింది. అనంతరం 12 గంటలకు పరిటాలలో MVR కళాశాలకు, మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు VVIT కళాశాలకు తంగలాన్ బృందం వెళ్లనున్నారు.

News August 12, 2024

తమిళనాడులో ఘోర ప్రమాదం.. విజయవాడ విద్యార్థి మృతి

image

తమిళనాడులోని తిరువళ్లూర్‌ జిల్లా తిరుత్తణి సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో APలోని పలు జిల్లాలకు చెందిన ఐదుగురు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతి చెందినవారిలో విజయవాడకు చెందిన బన్ను నితిశ్(22) మృతిచెందాడు. మరో నలుగురు ప్రొద్దుటూరుకు చెందిన నితిశ్(21), తిరుపతికి చెందిన యుగేశ్(23), చేతన్(22), కర్నూలుకు చెందిన రామ్మోహన్(21)లకు గాయాలయ్యాయి.

News August 12, 2024

కృష్ణా: చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు జనరల్ కోచ్‌లు

image

విజయవాడ మీదుగా ప్రయాణించే హైదరాబాద్-చెన్నై చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లకు అదనంగా 2 జనరల్ కోచ్‌‌లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.12759/12760 రైళ్లు ప్రస్తుతం 2 జనరల్ కోచ్‌లతో నడుస్తుండగా 2 బోగీలు జతచేసి మొత్తంగా 4 జనరల్ కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 12760 ట్రైన్‌ను నవంబర్ 11 నుంచి, 12759 ట్రైన్‌ను నవంబర్ 12 నుంచి 2 అదనపు జనరల్ కోచ్‌లతో నడుపుతామన్నారు.

News August 11, 2024

కృష్ణా జిల్లా ప్రజలకు పోలీసుల హెచ్చరికలు

image

కొరియర్ పేరిట మోసగాళ్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌పై స్పందించవద్దని కృష్ణా జిల్లా ప్రజలకు పోలీసులు హెచ్చరించారు. మీ పేరుపై పార్సిల్ వచ్చిందని, పార్సిల్ పేరుతో సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్న ఘటనలు జరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని పోలీస్ యంత్రాంగం సూచించింది. ఈ విధమైన ఫోన్ కాల్స్ ప్రభావానికి గురి కావొద్దని, సైబర్ మోసానికి గురైతే వెంటనే హెల్ప్ లైన్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

News August 11, 2024

మచిలీపట్నం కలెక్టరేట్‌లో రేపు మీ కోసం కార్యక్రమం: డీకే బాలాజీ

image

ఈ నెల 12వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని కలెక్టర్ వెల్లడించారు.