Krishna

News December 18, 2024

విజయవాడ: భార‌త్ నెట్‌-2 ప్రాజెక్టు ప‌నులు పూర్తిచేస్తాం: ఫైబ‌ర్‌నెట్ ఎండీ

image

రాష్ట్రానికి వచ్చిన డిజిట‌ల్ భార‌త్ నిధి అధికారుల‌తో ఏపీ ఫైబ‌ర్‌నెట్ ఎండీ కె. దినేశ్ కుమార్‌ మంగళవారం సమావేశమయ్యారు. ఈ మేరకు మంగళవారం విజయవాడలో ఆయన అధికారుల బృందంతో సమావేశమయ్యారు. 2025 మార్చిలోపు ఏపీలోని అన్ని పంచాయ‌తీల‌కు బ్రాడ్ బ్యాండ్ స‌ర్వీసులు అందుబాటులోకి తెస్తామని, కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో భార‌త్ నెట్‌-2 ప్రాజెక్టు ప‌నులు పూర్తి చేస్తామని కె. దినేశ్ కుమార్‌ సమావేశంలో పేర్కొన్నారు.

News December 17, 2024

VJA: వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని YCP నేతలకు మంగళవారం భారీ ఊరట లభించింది. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఉన్న వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రి జోగి రమేష్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఫిబ్రవరి వరకు ఇరువురిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. జోగి రమేష్ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులోనూ ముద్దాయిగా ఉన్నారు.

News December 17, 2024

VJA: హైకోర్టులో డిప్యూటీ సీఎంపై పిటిషన్ దాఖలు

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కేసు పునర్విచారణకు హైకోర్టులో మహిళా వాలంటీర్ల తరఫున వ్యాజ్యం దాఖలయింది. ఈ పిటీషన్‌ను హైకోర్ట్ సీనియర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ మంగళవారం దాఖలు చేశారు. గతంలో వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదయింది. అయితే కూటమి ప్రభుత్వం కేసును ఉపసంహరించుకోవడంపై హైకోర్టులో క్రిమినల్ రివిజన్ ఇద్దరు మహిళా వాలంటర్లు పిటిషన్ దాఖలు చేశారు.

News December 17, 2024

కృష్ణా: M.TECH పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలో ఆగస్టు- 2024లో నిర్వహించిన M.TECH నాలుగో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చని యూనివర్శిటీ యాజమాన్యం తెలిపింది. పరీక్షల ఫలితాలకు అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం తెలిపింది.

News December 17, 2024

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి

image

ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేరుకున్నారు. రాష్ట్రపతికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గౌరవ వందనం స్వీకరించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన మంగళగిరిలోని ఎయిమ్స్‌కు బయలుదేరి వెళ్లారు.

News December 17, 2024

గన్నవరం: కన్నతల్లిని నడిరోడ్డుపై వదిలేసిన కసాయి బిడ్డలు

image

నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి ఆ బిడ్డలకు భారమైంది. వృద్ధాప్యంలో అన్నీ తామై చూసుకోవల్సిన బిడ్డలే ఆ తల్లిని కాదనుకుని నిర్ధాక్షిణ్యంగా అర్ధరాత్రి నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. నడిరోడ్డుపై ఉన్న ఆ వృద్ధురాలిని చూసిన స్థానికులు పోలీసుల సహకారంతో గన్నవరంలోని PKR వృద్ధాశ్రమంలో చేర్పించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వృద్ధురాలి పిల్లలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

News December 17, 2024

కృష్ణా జిల్లా రాజకీయాలను వేడెక్కించిన విగ్రహావిష్కరణ

image

ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నూజివీడులో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో మంత్రి పార్థసారథి, పలాస MLA గౌతు శిరీషతో కలిసి వైసీపీ నేత జోగి రమేశ్ పాల్గొనడం టీడీపీలో తీవ్ర చర్చకు దారి తీసింది. YCP హయాంలో తమను వేధించిన జోగితో కలిసి వేదిక ఎలా పంచుకుంటారని కార్యకర్తలు భగ్గుమన్నారు. దీనిపై ఇప్పటికే పార్థసారధి క్షమాపణలు తెలిపారు. TDP అధిష్ఠానం సైతం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

News December 17, 2024

ఉయ్యూరు: జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు

image

జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు చేస్తున్న యువకుడిని ఉయ్యూరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం.. ఐటీఐ చదివిన మధుబాబు జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈనెల 13న కాటూరు అంబేడ్కర్ నగర్‌లోని ఓ వృద్ధురాలి ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఇంట్లో బీరువా తాళాలు పగలగొట్టి రూ. 6.30 లక్షలు విలువచేసే నగలు దోచేశాడు. దీంతో బాధితురాలు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సొమ్ము రికవరీ చేశారు.

News December 17, 2024

క్షమాపణలు చెప్పిన మంత్రి కొలుసు

image

మంత్రి కొలుసు పార్థసారథి సోమవారం క్షమాపణలు చెప్పారు. ఆదివారం నూజివీడులో జరిగిన కార్యక్రమంలో జోగి రమేశ్ ప్రత్యక్షమవ్వడంపై ఆయన మాట్లాడారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బ తింటే క్షమించాలని కోరారు. ఆ కార్యక్రమం పార్టీ పరంగా కాకుండా సామాజికపరంగా జరిగిందని తెలిపారు. తనను అక్కున చేర్చుకొని గౌరవించిన చంద్రబాబుకి క్షమాపణలు తెలియజేస్తున్నానని అన్నారు.

News December 16, 2024

విజయవాడలో బాలిక కిడ్నాప్ కలకలం

image

గుంటూరులో ఓ బాలికను తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. విజయవాడ మీదుగా కారులో తీసుకు వెళ్లే క్రమంలో విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద కిడ్నాపర్లు భోజనానికి కారు ఆపారు. బాలిక హోటల్లోకి భోజనానికి వెళ్లకుండా తప్పించుకొని ఆర్టీసీ అధికారులకు కిడ్నాప్ విషయం తెలిపింది. ఈ ఘటనపై కృష్ణలంక పోలీసులకు బాలిక ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.