Krishna

News December 11, 2024

విజయవాడలో అత్యాచార నిందితుడికి శిక్ష, జరిమానా

image

2015లో మొఘలరాజపురంకు చెందిన ఇంటర్ చదివే బాలిక(17)ను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి రేప్ చేసిన పోతిన నాని(21)కి కోర్టు 10ఏళ్ల కఠిన కారాగార శిక్షవిధించింది. నాని ఆమెను అపహరించడంతో ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 2015లో మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం పోక్సో కోర్ట్ జడ్జి వి.భవాని ఈ కేసులో తుది తీర్పు చెప్పారు. నేరం ఋజువైనందున నానికి కారాగార శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించారు.

News December 11, 2024

17న విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

image

ఈ నెల 17న విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నట్లు సీఎస్ నీరభ్‌కుమార్ తెలిపారు. మంగ‌ళ‌వారం రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతార‌న్నారు. ఈనెల 17న ఉదయం 11.20 గంటలకు విజయవాడకు చేరుకొని అక్క‌డి నుంచి రోడ్డు మార్గంలో మంగ‌ళ‌గిరి వెళ్త‌ర‌ని చెప్పారు. మధ్యాహ్నం 12.05 గంటలకు స్నాతకోత్సవంలో పాల్గొననున్నట్లు తెలిపారు.

News December 10, 2024

13న స్వర్ణాంధ్ర @ 2047కి శ్రీకారం: కలెక్టర్

image

విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియం వేదికగా ఈనెల 13వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడిచే స్వర్ణాంధ్ర @ 2047కి శ్రీకారం చుట్టడం జరుగుతుందని కలెక్టర్‌ డా.జి.లక్ష్మిశా తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభకు సుమారు 25వేల మంది ప్రజలు హాజరు కానున్నారని వెల్లడించారు. ఈ మేరకు సోమవారం అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా అధికారులు సమన్వయంతో కృషి చేసి కార్యక్రమం విజయవంతం చేయాలని ఆదేశించారు.

News December 10, 2024

గుడివాడ: కళాశాలకు వెళ్లి తిరిగిరాని మైనర్ బాలిక

image

గుడివాడ కేటీఆర్ మహిళా కళాశాల వద్ద ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్మెన్‌గా ఉన్న దుర్గారావు కుమార్తె ప్రియాంక అదృశ్యమైనట్లు కుటుంబీకులు తెలిపారు. పాలిటెక్నిక్ ఫస్టియర్ చదువుతున్న యువతి, శనివారం కాలేజీకి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అయితే అదే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న వివాహితుడు రాహుల్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మిస్సింగ్ పై టూ టౌన్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలిపారు.

News December 10, 2024

తిరువూరు నుంచి Dy.CM పవన్‌కు బెదిరింపు కాల్స్

image

Dy.CM పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి తిరువూరుకు చెందిన మల్లికార్జున రావుగా పోలీసులు గుర్తించారు. ఇతను పవన్ ఓఎస్డీకి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడినట్లు ఫిర్యాదులు అందగా..పోలీసులు రంగంలోకి దిగారు. ఎంజీ రోడ్డు నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు గుర్తించారు. అయితే ఆ ఏరియాలో ఆరా తీయగా అతని జాడలేదు.అతనే ఫోన్ చేశాడా.. ఎవరైనా అతని పేరుపై సిమ్ తీసుకున్నారా అని తెలియాల్సి ఉంది.

News December 10, 2024

జగన్‌ వెంటే ఉంటా: MLC

image

తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని విజయవాడకు చెందిన ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ‘నిబంధనలు మేరకు నాకు రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డులో సభ్యునిగా అవకాశం ఇచ్చింది. రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటా. నన్ను రాజకీయాల్లో ప్రోత్సహించిన ఏకైక వ్యక్తి జగన్’ అని ఆయన చెప్పారు.

News December 10, 2024

కృష్ణా: లా కోర్సు పరీక్షా ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో సెప్టెంబర్-2024లో నిర్వహించిన పలు లా కోర్సుల పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ మేరకు LLB, BA.LLB 2వ సెమిస్టర్ పరీక్ష L BA. LLB 6వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు KRU పరీక్షల విభాగం తెలిపింది. విద్యార్థులు ఫలితాలకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.

News December 10, 2024

కృష్ణా: 2 రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు

image

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా సత్రాగచ్చి(SRC)- చెన్నై సెంట్రల్(MAS) మధ్య ప్రయాణించే సూపర్ ఫాస్ట్ AC ఎక్స్‌ప్రెస్‌లను కొద్ది రోజులపాటు రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు నం.22807 SRC- MAS మధ్య ప్రయాణించే రైలును ఈ నెల 10, 13, 17న, నం.22808 MAS- SRC రైలును ఈ నెల 12, 15, 19న రద్దు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News December 9, 2024

ఇబ్రహీంపట్నంలో మృతదేహం కలకలం

image

ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ కూలింగ్ కెనాల్ స్టేజ్ 1 గేట్ వద్ద సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపారు. మృతుడు 5’5”అడుగుల ఎత్తు ఉండి సుమారు 50 ఏళ్ల వయస్సు ఉంటుందన్నారు. మృతుడు బిస్కెట్ కలర్ చొక్కా ధరించి ఉన్నట్లు చెప్పారు. వివరాలు తెలిస్తే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

News December 9, 2024

మచిలీపట్నం: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ 

image

కృష్ణాజిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి ప్రజలు కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్‌కు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పరిష్కార చర్యల నిమిత్తం సంబంధిత శాఖాధికారులకు కలెక్టర్ బదిలీ చేశారు. 

error: Content is protected !!