India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కుటుంబ సభ్యుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సత్యనారాయణపురం పోలీసుల వివరాల మేరకు.. ఓ బాలిక ఇంటి వద్ద ఆడుకుంటుంది. వరుసకు బాబాయ్ కొడుకు అయినా కార్తీక్ అనే యువకుడు తన ఇంట్లోకి తీసుకెళ్లి బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడని ఆ బాలిక తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గన్నవరం విమానాశ్రయంలో సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల 10లోపు https://aaiclas.aero/career వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత వర్గాలు తెలిపాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తామని, ఎంపికైన వారికి తొలి ఏడాది ప్రతి నెలా రూ.30వేల వేతనం ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
‘యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా స్టూడెంట్ గవర్నమెంట్’ ప్రెసిడెంట్‌గా విజయవాడకు చెందిన గొట్టిపాటి సూర్యకాంత్ ప్రసాద్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం అమెరికాలో సీఎస్‌సీ అండర్ గ్రాడ్యుయేషన్ అభ్యసిస్తున్న గొట్టిపాటి ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాకు చెందిన 3 క్యాంపస్‌లకు సంబంధించి 60 వేల విద్యార్థులకు మన విజయవాడ వాసి ప్రతినిధిగా ఎన్నికవ్వడం విశేషం.
కోతకి సిద్ధంగా ఉన్న వరి పంటను వర్షాలకు ముందు కోయరాదని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తడిసిన వరి పనలు కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్పవేయడం వల్ల నష్ట శాతాన్ని నివారించవచ్చని ఆయన సూచించారు. కోత కోసి పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిచినట్లైతే గింజ మొలకెత్తకుండా ఉండడానికి 5% ఉప్పు ద్రావణాన్ని పనలపై పడేలా పిచికారీ చేయాలన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 10,11,12 తేదీల్లో వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు కోత కోసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. కోతలకు సిద్ధంగా ఉన్న వరి పంటను కోయకుండా వాయిదా వేసుకోవాలని సూచించారు. ఈ విషయంలో అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10:30 గంటలకు మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకే. బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆర్డీఓ కార్యాలయాలతో పాటు మండల పరిషత్, తహశీల్దార్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యలను అర్జీల రూపంలో తెలియజేయాలని సూచించారు.
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో MCA కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 3వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 28 నుంచి 2025 జనవరి 3 వరకు మధ్యాహ్నం 2- సాయంత్రం 5 వరకు, 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 28 నుంచి 2025 జనవరి 3 వరకు ఉదయం 10-మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్ణీత తేదీలలో జరుగుతాయని KRU తెలిపింది. పూర్తి వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చంది.
అయ్యప్ప భక్తులకై విజయవాడ మీదుగా మౌలాలి(MLY)-కొల్లామ్(QLN) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు 2025 జనవరి 4 నుంచి 25 వరకు ప్రతి శనివారం MLY-QLN(నం.07171), 2025 జనవరి 6 నుంచి 27వరకు ప్రతి సోమవారం QLN-MLY(నం.07172) రైళ్లు నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు బాపట్ల, ఒంగోలు, నెల్లూరు తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.
కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మిశ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నటల్లు కలెక్టర్ చెప్పారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలు, మునిసిపల్ కార్యాలయాలు, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు. చల్లపల్లి మండలం మాజేరు, ఘంటసాల మండలం లంకపల్లి, పూషడం, దేవరకోట గ్రామాల్లో పర్యటించి రోడ్డు వెంబడి ఆరబోసుకున్న ధాన్యం పరిశీలించారు. అక్కడే ఉన్న రైతులతో మాట్లాడి పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.