India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కంకిపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు(17) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చదువు మానేశాడని ఇంట్లో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

చీర బైక్ చక్రంలో చిక్కుకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన గుడివాడ రూరల్ ప్రాంతంలో జరిగింది. సెరికలవపూడి గ్రామానికి చెందిన కోన నాగేశ్వరరావు భార్య కోన నాగమల్లేశ్వరి బంధువుల దిన కార్యక్రమానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో నూజెండ్ల గ్రామం వద్ద వారు వెళుతున్న బైక్ చక్రంలో చీర చిక్కుకొని ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో ఆమె మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై చంటిబాబు తెలిపారు.

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో కృష్ణా జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర 12వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సూచించారు.

ఎలుకల మందు తాగి వ్యక్తి చనిపోయిన ఘటన ఉంగుటూరు మండలంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మానికొండకు చెందిన షేక్ మునీర్ మద్యానికి బానిసై ఎలుకల మందు వాటర్‌లో మిక్స్ చేసి తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు బెజవాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

500 ఏళ్ల చరిత్ర గల వీరమ్మ తల్లి, పశ్చిమ గోదావరి జిల్లా పెదకడియం గ్రామంలో జన్మించి భర్త చింతయ్య హత్యకు గురికావడంతో సతీసహగమనం చేసింది. భర్త హత్యకు కారణమైన కరణం సుబ్బయ్య వంశం నిర్విర్యమైంది. ఉయ్యూరులో ఆమెకు ఆలయం నిర్మించి, ఏటా మాఘ శుద్ధ ఏకాదశి నుంచి 15 రోజుల పాటు తిరునాళ్లు నిర్వహిస్తున్నారు. ఉయ్యాల ఊయింపు ప్రత్యేక సంప్రదాయం. లక్షలాది మంది భక్తులు ఈ తిరునాళ్లలో పాల్గొంటారు.

కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన క్రీడాకారిణి గాయత్రీని CM చంద్రబాబు ప్రశంసించారు. బుధవారం రాత్రి ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన 38వ నేషనల్ గేమ్స్ కాన్ స్లాలోమ్ మహిళా విభాగంలో గాయత్రి గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా CM చంద్రబాబు గోల్డ్ మెడల్ సాధించడం ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణం, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు.

ఉయ్యూరు సుందరయ్య నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాలువలో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. సుందరయ్య నగర్‌కు చెందిన ఎడ్ల రాంబాబు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మంగళవారం కాలువ అరుగు పై కూర్చుని ఉండగా ప్రమాదవశాత్తు కాలంలో పడి మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు.

ప్రజల సంక్షేమాభివృద్ధికి ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకాల సద్వినియోగంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాల ప్రగతితో పాటు ప్రజలకు అవగాహన లేకుండా మరుగున పడిపోయిన కేంద్ర ప్రభుత్వ పథకాలపై అధికారులతో చర్చించారు.

గుడివాడ మార్కెట్ సెంటర్లో మంగళవారం సాయంత్రం టిప్పర్ ఢీకొని సైక్లిస్ట్ మృతి చెందాడు. ఏలూరు రోడ్లో నుంచి పామర్రు రోడ్డు వైపు వెళ్తున్న టిప్పర్ మార్కెట్ సెంటర్లోని కటారి సత్యనారాయణ చౌకు వద్ద మలుపులో సైకిల్ మీద వస్తున్న వృద్ధుడిని ఢీకొట్టింది. ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు అక్కడకు చేరుకుని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో BA.LLB కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ మంగళవారం విడుదలైంది. ఫిబ్రవరి 10, 12, 14, 17, 19 తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకు https://kru.ac.in/ వెబ్సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
Sorry, no posts matched your criteria.