India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశంలో నూతనంగా ఏర్పాటు కానున్న 85 కేంద్రీయ విద్యాలయాల్లో 8 సంస్థలను ఏపీకి కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో నందిగామ, నూజివీడులో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేస్తామని క్యాబినెట్ తెలిపింది. గతంలో ఈ 2 ప్రాంతాలకు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు కాగా శాశ్వత భవన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు.
నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా హౌరా(HWH)- తిరుచిరాపల్లి(TPJ) మధ్య ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లను కొద్ది రోజుల పాటు రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు నం.12663 HWH-TPJ మధ్య ప్రయాణించే రైలును ఈనెల 12,15,19న, నం.12664 TPJ-HWH రైలును ఈనెల 10,13,17న రద్దు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ శుక్రవారం కేంద్ర మంత్రి అమిత్‌షాను న్యూఢిల్లీలో కలిశారు. ఈ భేటీలో ఎంపీ కృష్ణప్రసాద్ రాష్ట్రంలో అమలవుతున్న విపత్తు నిర్వహణ విధానాన్ని, ఇటీవల వచ్చిన వరదల గురించి ఆయనకు తెలియజేశారు. రాష్ట్రంలో విజయవాడతో సహా వరదలకు ప్రభావితమయ్యే ప్రాంతాల వివరాలను ఎంపీ తెన్నేటి, అమిత్‌షాకు వివరించారు.
ధాన్యం సేకరణ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను శుక్రవారం రాత్రి కలెక్టర్ బాలాజీ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ధాన్యం సేకరణలో తలెత్తే సమస్యల పరిష్కారానికి, రైతులకు ఉపయోగపడే విధంగా కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ పక్క గదిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో నాలుగేళ్ల BSC బయోమెడికల్ కోర్సు విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్ పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ విడుదలైంది. డిసెంబర్ 10,11,12,13,16,17 తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ANU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టులవారీగా టైం టేబుల్ వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్సైట్ చూడాలని సూచించింది.
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో MBA కోర్సు చదువుతున్న విద్యార్థులు రాయాల్సిన 1,3వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 28 నుంచి 2025 జనవరి 7 వరకు మధ్యాహ్నం 2- సాయంత్రం 5 గంటల వరకు, 3వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 28 నుంచి 2025 జనవరి 9 వరకు ఉదయం 10- మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్ణీత తేదీలలో జరుగుతాయని KRU తెలిపింది. పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్సైట్ చూడవచ్చు.
అంబేడ్కర్ అడుగుజాడల్లో పయనిస్తూ దేశాభివృద్ధికి కృషిచేద్దామని శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. బి.ఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంరతం కలెక్టర్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు.
విజయవాడ శివారు పోరంకిలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ గంగాధర్ రావు, కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం సీఎం పర్యటన ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. పోరంకిలోని ‘మురళీ రిసార్ట్స్’లో జరిగే ఊర్జావీర్’కు హాజరుకానున్నారు. సీఎం రాక సందర్భంగా ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని వారు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఫంక్షన్ హాల్లోని తనిఖీలు చేసినట్లు వెల్లడించారు.
ఓ మహిళ ఫేక్ పాస్పోర్టుతో విదేశాల నుంచి వచ్చిన ఘటన ఇది. కృష్ణా జిల్లా ఘంటసాలకు చెందిన కనకదుర్గ(36) సింగపూర్ వెళ్లారు. బుధవారం సాయంత్రం తిరిగి చెన్నైకి వచ్చారు. అక్కడి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు చెకింగ్ చేయగా.. కనకదుర్గది ఫేక్ పాస్‌పోర్ట్ అని తేలింది. వేరే వ్యక్తి పాస్‌పోర్ట్‌లో ఈమె ఫొటో పెట్టి సింగపూర్ వెళ్లినట్లు గుర్తించారు. నాగేశ్వరరావు అనే వ్యక్తి ఈ ఫేక్ పాస్‌పోర్ట్ చేసినట్లు సమాచారం.
ధనుర్మాసం సందర్భంగా ప్రముఖ వైష్ణవ ఆలయాలైన ద్వారకా తిరుమల, వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామి ఆలయాలను దర్శించేందుకు ‘శ్రీ వైష్ణవ దర్శిని’ పేరుతో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ప్రతి శని, ఆదివారాల్లో నడపనున్నట్టు కృష్ణాజిల్లా ప్రజా రవాణాధికారిణి వాణిశ్రీ గురువారం తెలిపారు. జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు నడపడం జరుగుతుందన్నారు.
Sorry, no posts matched your criteria.