Krishna

News January 31, 2025

గుడివాడ: ఫైనాన్స్ వేధింపులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య

image

ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తట్టుకోలేక గుడివాడ రూరల్ మండలం మోటూరు గ్రామానికి చెందిన రావి సత్తిబాబు (35) అనే ఆటో డ్రైవర్ ఉరి వేసుకొని చనిపోయాడు. గుడివాడలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ వద్ద రూ.7.80 లక్షల రుణం తీసుకున్నాడు. ప్రతినెల 5వ తేదీ వాయిదా చెల్లించవలసి ఉండగా ఈ నెల 25న ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది ఒత్తిడి చేశారని, ఇంటికి వచ్చి అల్లరి చేశారని సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

News January 31, 2025

మచిలీపట్నం: బ్యాంకు ఉద్యోగి భారీ మోసం

image

కస్టమర్స్ బ్యాంకులో పెట్టిన రూ.1.60 కోట్లు విలువ చేసే గోల్డ్‌ను రోల్డ్ గోల్డ్ పెట్టి మోసం చేస్తున్న బ్యాంకు ఉద్యోగిపై కేసు నమోదయింది. మచిలీపట్నం పోలీసులు కథనం.. పట్టణంలో ఓ బ్యాంకు ఉద్యోగి సోమశేఖర్ కస్టమర్స్ బ్యాంకులో పెట్టిన గోల్డ్ ప్లేస్‌లో రోల్డ్ గోల్డ్ పెట్టి ఆ గోల్డ్‌ను తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నాడు. దీంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు చేపట్టారు.

News January 31, 2025

కృష్ణా యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ 

image

కృష్ణా యూనివర్సిటీలో బీ-ఫార్మసీ కోర్సులో స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ ఈఏపీసెట్-2025 రాయని విద్యార్థులకు సైతం ఫిబ్రవరి 3న నిర్వహించే స్పాట్ అడ్మిషన్‌లో ప్రవేశాలు కల్పిస్తామని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. స్పాట్ అడ్మిషన్ ఫీజు తదితర వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించాయి. 

News January 31, 2025

కృష్ణా జిల్లా పరిషత్‌కు అరుదైన గౌరవం

image

కృష్ణా జిల్లా పరిషత్‌కు అరుదైన గౌరవం లభించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా ప్రతి ఏడాది వివిధ విభాగాల్లో అవార్డ్స్‌ను అందజేస్తుంది. 2023కి పంచాయతీ విభాగంలో సబ్ క్యాటగిరీ కింద కృష్ణా జిల్లా పరిషత్‌ను ఎంపిక చేశారు. ఢిల్లీలో వచ్చే నెల ఒకటో తేదీన ఈ అవార్డ్ అందిస్తారని ZP. CEO కన్నమ నాయుడు చెప్పారు. పరిషత్ సభ్యులు అధికారుల సహకారంతోనే అవార్డు వచ్చిందని జెడ్పీ చైర్‌పర్సన్ హారిక అన్నారు.

News January 31, 2025

ఎన్నికల కోడ్ పాటించాలి: కలెక్టర్ 

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీ.కే బాలాజీ అన్నారు. గురువారం మచిలీపట్నం కలెక్టరేట్‌లో కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై ఆయన రాజకీయ పార్టీ ప్రతినిధులతో  సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి ఎన్నికల నియమ నిబంధనలు వివరించారు. 

News January 30, 2025

మచిలీపట్నం: జాతిపితకు నివాళులర్పించిన కలెక్టర్ 

image

మహాత్మగాంధీ కలలుగన్న ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ డీ.కే  బాలాజీ అన్నారు. గురువారం మచిలీపట్నం కలెక్టరేట్‌లో మహాత్మగాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. 

News January 30, 2025

పీహెచ్సీలలో మెరుగైన వైద్య సేవలు అందించాలి: కృష్ణా కలెక్టర్

image

జిల్లాలోని పీహెచ్సీలలో మెరుగైన వైద్య సేవలు అందించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వైద్య అధికారులను ఆదేశించారు. పీహెచ్సీలలో వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పన, సమస్యలపై బుధవారం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వైద్యాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్యాధికారులు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించాలన్నారు.

News January 30, 2025

పెనమలూరు: ఒడిశా నుంచి గంజాయి సరఫరా

image

గంజాయి అమ్ముతున్న భార్యాభర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పెనమలూరు పోలీసుల కథనం ప్రకారం.. మణికంఠ, పూజిత భార్యాభర్తలు ఒడిశా నుంచి గంజాయిని కానూరులోకి తీసుకొచ్చి ప్యాకెట్లుగా చేసి అమ్ముతున్నారు. మంగళవారం రాత్రి కామయ్యతోపు వద్ద వాహనాలు తనిఖీలో పోలీసులకు దొరికారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు.

News January 30, 2025

ఎమ్మెల్సీ ఎన్నికకు సహకరించాలి: కలెక్టర్

image

కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్‌కు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. కోడ్ అమలుకు సహకరించడంతోపాటు శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కోరారు.

News January 30, 2025

జిల్లాలో ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు తీసుకోవల్సిన చర్యలను వివరించారు. ఇంటర్మీడియట్ థీయరి పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయని తెలిపారు.