India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పెడన మండలం కట్లపల్లిలో కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్లపల్లి గ్రామానికి చెందిన గంగాధరరావు (65)పై పక్కనే నివసిస్తున్న కాశీవిశ్వేశ్వరరావు(37) కత్తితో దాడి చేశాడన్నారు. గంగాధరరావును వైద్యా సేవల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మహిళ వద్దకు నగ్నంగా వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి మచిలీపట్నం కోర్టు మంగళవారం జైలు శిక్ష విధించింది. బందరుకోటకు చెందిన మస్తాన్ 2022లో మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి నిందితుడు పారిపోయాడు. ఈ మేరకు ఆమె మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కోర్టులో విచారణ జరిపి నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.8వేలు జరిమానా విధించింది.

గన్నవరం నియోజకవర్గంలో ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా వారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గన్నవరం మండలం కొండపావులూరు శివారు ముదిరాజు పాలెంలో రూ.15లక్షల నిధులతో నిర్మించనున్న బీసీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే, ఎంపీ శంకుస్థాపన చేశారు.

పెనమలూరులో మృతదేహం కలకలం రేపింది. పెనమలూరు ఎస్సై ఉషారాణి.. తెలిపిన సమాచారం ప్రకారం తాడిగడప కాలువ గట్టు వద్ద సోమవారం సాయంత్రం మృతదేహం ఉందన్న సమాచారం మేరకు వెళ్లి పరిశీలించామన్నారు. ఈ క్రమంలో అక్కడ 35 నుంచి 40 సంవత్సరాల మగ మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉందన్నారు. మృతుడి వంటిపై నలుపు రంగు షర్టు, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడని తెలిపారు.

ప్రజా సమస్యలకు నిర్ణీత సమయంలో పరిష్కారమందించాలని ఎస్పీ ఆర్. గంగాధర్ రావు అన్నారు. సోమవారం మచిలీపట్నంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 31 ఫిర్యాదులు వచ్చాయని జిల్లా ఎస్పీ తెలిపారు. అనంతరం వాటి పరిష్కార మార్గాలు చూపారు.

కృష్ణా జిల్లాలోని ఉన్న అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు వంటి ప్రార్థన మందిరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ గంగాధర్ రావు అధికారులకు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఎస్పీ సోమవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. స్నేహపూర్వక పోలీసింగ్ ప్రజలకు అందిస్తూ, మహిళలు, చిన్నారుల భద్రతపై దృష్టి సారించాలన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్ఓ చంద్రశేఖరరావులు కూడా అర్జీలు స్వీకరించారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువెళ్లి కాపాడిన ఆటో డ్రైవర్ కందుల శ్యామ్‌కు ఏలూరు కలెక్టర్ రూ.5వేలు, ప్రాణ దాత అవార్డు అందజేశారు. లింగాల గ్రామానికి చెందిన కాటి నిరీక్షణ బాబు కానుకొల్లు వద్ద నవంబరు 28న బైకుపై వెళ్తూ అదుపుతప్పి కిందిపడిపోయాడు. అటుగా ఫ్యామిలీతో కొత్త ఆటోలో వస్తున్న కందుల శ్యామ్, నల్లగుడ్ల రాజు గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న బాబును గుడివాడ ఆసుపత్రిలో చేర్చారు.

పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు సర్పంచ్ పందింటి ఇందిర ఆదివారం కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ పురస్కారం అందుకున్నారు. కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ (లల్లన్ సింగ్ ), సహాయ మంత్రి ఎస్. పి సింగ్ భగేల్ చేతులు మీదుగా గణతంత్ర వేడుకలలో భాగంగా ఢిల్లీలో ఇందిరకు ఉత్తమ సర్పంచ్ అవార్డును అందజేశారు.

76 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్ భవన్లో ఎట్ హోం కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గవర్నర్ నజీర్ ఎమ్మెల్యే రాముతో కాసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు .
Sorry, no posts matched your criteria.