Krishna

News December 3, 2024

విజయవాడ: చెత్తబుట్టలో పసికందు

image

విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పాపను గుర్తుతెలియని వ్యక్తులు చెత్త బుట్టలో పడేశారు. న్యూ రాజరాజేశ్వరి పేటలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. చెత్త కుప్పలో అప్పుడే పుట్టిన పాపను ఈరోజు తెల్లవారుజామున పడేసి వెళ్లిపోయారన్నారు. ఏడుపులు విడిపించడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు రంగ ప్రవేశం చేసి పాపను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 3, 2024

వైసీపీ నేత గౌతమ్ రెడ్డి కేసులో ఏజీ వాదనలో ముఖ్యంశాలివే

image

VJA: గౌతమ్ రెడ్డి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ కేసు విచారణకు రాగా అడ్వకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ తన వాదనలు వినిపించారు. భూవివాదం పరిష్కారం కోసం గౌతమ్ రెడ్డి, ఉమామహేశ్వరశాస్త్రిని హత్య చేసేందుకు మనుషుల్ని పురమాయించినట్లు ఆధారాలున్నాయని ఏజీ చెప్పారు. గతంలో ఆయనపై రౌడీషీట్ ఉండగా 2023లో ఎత్తివేసారని, మొత్తంగా ఆయనపై 32 కేసులున్నాయని, బెయిల్ ఇవ్వొద్దన్నారు.

News December 3, 2024

ఇబ్రహీంపట్నం: బాలిక హత్య.. నిందితుడు అరెస్టు

image

ఇబ్రహీంపట్నం(M) కొండపల్లికి చెందిన నాగరాజు కొద్ది రోజుల క్రితం చేబ్రోలు (M) కొత్తరెడ్డిపాలెంలో అద్దెకు ఉంటూ ఓ గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోగా, ఆమె మరొకరితో సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయంపై ఆమె కూతురిని అడిగాడు. బాలిక చెప్పకపోవడంతో తండ్రిలాగా చూసుకుంటున్న తనకు నిజం చెప్పలేదని నాగరాజు జులై 15న హత్య చేసి, పరారయ్యాడు. నిన్న లొంగిపోయాడు.

News December 3, 2024

విజయవాడలో రెండు దశలుగా మెట్రో రైలు ప్రాజెక్టు 

image

విజయవాడలో 2 దశలుగా మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సూత్రప్రాయంగా నిర్ణయించింది. మొదటి దశలో 2 కారిడార్‌లు, రెండో దశలో మరో కారిడార్ నిర్మాణం చేపట్టేలా రూపొందించిన DPRను కేంద్రానికి పంపనుంది. మొదటి దశలోని కారిడార్ 1Aలో గన్నవరం-పండిట్ నెహ్రూ బస్టాండ్(PNBS), కారిడార్ 1Bలో PNBS- పెనమలూరు, 2వ దశలోని కారిడార్ 3లో PNBS-అమరావతి మధ్య మెట్రో నిర్మించేలా DPR తయారైందని తెలుస్తోంది.

News December 3, 2024

మచిలీపట్నం: ‘ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి’

image

‘ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతులను కోరారు. ఈ పథకం అమలుపై జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ పథకం కింద రైతులకు పంట నష్టం జరిగినప్పుడు భీమా మొత్తం అందుతుందని, పథకం ప్రయోజనాలు రైతులకు వివరించి ఆసక్తి గల రైతులందరిని నమోదు చేస్తారన్నారు. 

News December 3, 2024

విజయవాడ మెట్రో ప్రాజెక్టు వ్యయమెంతంటే.!

image

విజయవాడ మెట్రో మొదటి దశలోని కారిడార్ 1Aలో గన్నవరం-పండిట్ నెహ్రూ బస్టాండ్(PNBS), కారిడార్ 1Bలో PNBS- పెనమలూరు మధ్య 38.4 కి.మీ. మేర నిర్మించేలా DPR తయారైంది. దీనికి రూ.11,009కోట్ల వ్యయం అవ్వొచ్చని ప్రభుత్వ అంచనా.1A, 1B కారిడార్‌ల భూసేకరణకు రూ.1,152 కోట్ల వ్యయం రాష్ట్రమే భరిస్తుందని DPRలో పేర్కొంది. కాగా 2వ దశలోని కారిడార్ 3లో PNBS-అమరావతి మధ్య 27.5 కి.మీ. మేర మెట్రో నిర్మించేలా DPR సిద్ధమైంది. 

News December 3, 2024

సమస్య చిన్నదైనా.. పెద్దదైన పరిష్కారం చూపాలి: కలెక్టర్

image

ప్ర‌జా స‌మ‌స్య చిన్న‌దైనా.. పెద్ద‌దైనా స‌మాన ప్రాధాన్య‌మిచ్చి గ‌డువులోగా ప‌రిష్క‌రించాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌కు సూచించారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లోని శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో నిర్వ‌హించిన పీజీఆర్ఎస్‌ కార్య‌క్ర‌మంలో ఆయన ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్ర‌భుత్వం సుప‌రిపాల‌న‌ను ప్ర‌జ‌ల చెంత‌కు చేర్చుతుందన్నారు.

News December 2, 2024

మచిలీపట్నం: కలెక్టర్‌ని కలిసిన డీసీహెచ్ఎస్ 

image

కృష్ణా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల కో-ఆర్డినేటర్ (DCHS)గా బాధ్యతలు స్వీకరించిన డా. జయకుమార్ సోమవారం కలెక్టర్ డీకే బాలాజీని మర్యాదపూర్వకంగా కలిశారు. అవనిగడ్డ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న జయకుమార్ ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా కృష్ణాజిల్లా డీసీహెచ్ఎస్‌గా బదిలీపై వచ్చారు. ఈయన గతంలో మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా కూడా విధులు నిర్వర్తించారు. 

News December 2, 2024

మైలవరంలో 47 మంది అరెస్ట్ 

image

మైలవరం ఏసీపీ వై.ప్రసాదరావు ఆదేశాల మేరకు సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎస్ఐ సుధాకర్ తన సిబ్బందితో సోమవారం మెరుపు దాడులు చేశారు. ఈ సందర్భంగా మండలంలోని పుల్లూరు, పోరాట నగర్ గ్రామాల్లో కోడి పందేలు వేస్తున్న 47 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎస్సై సుధాకర్ మాట్లాడుతూ.. వారి వద్ద నుంచి రూ.29,100నగదు, 10 కోడి పుంజులు, 10 కోడి కత్తులను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశామన్నారు.  

News December 2, 2024

రాష్ట్రంలోనే టాప్.. ఎన్టీఆర్ జిల్లాలో 19,865 మంది HIV రోగులు

image

అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో అత్యధికంగా HIV రోగులు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నారు. జిల్లాలో 19,865 మంది HIV రోగులుండగా, ఈ జాబితాలో 13,166 మంది రోగులతో కృష్ణా జిల్లా 12వ స్థానంలో ఉంది. కాగా HIV రోగులకు ప్రతి నెలా రూ.4,000 పింఛన్ ఇస్తున్నట్లు ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(ఏపీ శాక్స్) అధికారులు తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో 42,924 మందికి ఈ పింఛన్ అందిస్తున్నామన్నారు.

error: Content is protected !!