India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ నెల 15వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ సృజన, అధికారులు వర్చువల్ గా హాజరయ్యారు. రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమానికి కూడా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. మచిలీపట్నం కలెక్టరేట్లో గురువారం తల్లిపాల వారోత్సవాలకు సంబంధించిన గోడ ప్రతులను, బ్యానర్లను, కరపత్రాలను డీఎంహెచ్ఓ గీతాభాయి కలిసి ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. తల్లి ముర్రుపాలు బిడ్డకు మొదటి టీకా అని అన్నారు.
డిగ్రీ, MLT, DMLT, నర్సింగ్ తదితర కోర్సులు చదివినవారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమానికి ఈ నెల 14న స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఈ ఇంటర్వ్యూలు విజయవాడ డోర్నకల్ రోడ్డులోని అమృత డయాగ్నోస్టిక్స్ సంస్థలో జరగనున్నాయి. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 13లోపు APSSDC అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
బాల్యవివాహాలను ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్లో కాన్ఫరెన్స్ హాల్లో ఐసిడిఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో బాల్య వివాహాలు జరిగితే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, సంబందిత అధికారులను ఆదేశించారు. బాల్య వివాహాలు జరిగితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1098కి ఫోన్ చేసి తెలపాలన్నారు.
ఆచార్య నాగార్జున వర్సిటీ పరిధిలో బీఈడీ చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ థియరీ పరీక్షల రివైజ్డ్ టైంటేబుల్ విడుదలైంది. ఆగస్టు 19, 20, 21, 22, 23, 24 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.
విజయవాడ మీదుగా భువనేశ్వర్, తిరుపతి మధ్య ప్రయాణించే 2 రైళ్లకు అదనంగా 1 జనరల్ కోచ్ జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.22871/22872 సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు 1 అదనపు జనరల్ కోచ్ జత చేస్తున్నామన్నారు. నం.22871 రైలును ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 29 వరకు, నం.22872 రైలును ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 30 వరకు అదనపు జనరల్ కోచ్‌తో నడుపుతామన్నారు.
విజయవాడ సితార జంక్షన్ బైపాస్ రోడ్డు వద్ద గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చిట్టి నగర్‌కి చెందిన బాయని లావణ్య అనే మహిళ దుర్మరణం చెందింది. కుమారుడి బైకుపై వెళుతుండగా ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డు నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద వెనుక నుంచి రైల్వే డిపార్ట్మెంట్ కి చెందిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కుమారుడికి స్వల్ప గాయాలు అవ్వగా ఆసుపత్రికి తరలించారు.
ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా నం.18111 టాటా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ ఆగస్టు 1, 15, 22, 29వ తేదీలలో ఏలూరు మీదుగా కాక నిడదవోలు-భీమవరం-గుడివాడ మార్గం గుండా విజయవాడ చేరుకుంటుందన్నారు. ఆయా తేదీలలో ఈ ట్రైన్‌కు ఏలూరులో స్టాప్ లేదని పేర్కొన్నారు.
ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా నం.18111 టాటా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ ఆగస్టు 1, 15, 22, 29వ తేదీలలో ఏలూరు మీదుగా కాక నిడదవోలు-భీమవరం-గుడివాడ మార్గం గుండా విజయవాడ చేరుకుంటుందన్నారు. ఆయా తేదీలలో ఈ ట్రైన్‌కు ఏలూరులో స్టాప్ లేదని పేర్కొన్నారు.
ఏపీ ఐసెట్-2024 పరీక్ష రాసిన అభ్యర్థులు వెబ్ కౌన్సిలింగ్‌కై రిజిస్ట్రేషన్ చేసుకునే గడువు నేటితో ముగియనుంది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను https://cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌లో చేసుకోవాలని ఏపీ ఉన్నత విద్యామండలి(APSCHE) సూచించింది. ధృువపత్రాల పరిశీలన అనంతరం మొదటి విడత సీట్ల కేటాయింపు ఆగస్టు 10న ఉంటుందని APSCHE స్పష్టం చేసింది.
Sorry, no posts matched your criteria.