India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ నగర పరిధిలో గడిచిన ఐదేళ్లలో 719 గంజాయి కేసులు నమోదైనట్లు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు 100 రోజుల యాక్షన్ ప్లానింగ్ రూపొందించినట్లు తెలిపారు. గంజాయి, మాదకద్రవ్యాల సమాచారం ఉంటే తక్షణమే తమకు తెలియజేయాలని సూచించారు. మత్తు పదార్థాల ఉచ్చులోకి విద్యార్థులు వెళ్లొద్దని సూచించారు.
100 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ఏర్పాటైన ‘యాంటి నార్కోటిక్ సెల్’ బృందాలు మంగళవారం 46 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నాయని విజయవాడ సీపీ రాజశేఖరబాబు తెలిపారు. ఈ సెల్ ద్వారా ఇప్పటివరకు 77 మందిని అదుపులోకి తీసుకుని 28 కేసులు నమోదు చేసి 185 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా గంజాయి కట్టడికై విజయవాడ పోలీసుల చొరవను డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రశంసించారు.
చక్రధరపూర్ రైలు ప్రమాద ఘటన కారణంగా ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే 3 రైళ్లను రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు జూలై 31 & ఆగస్టు 2న నం.18189 టాటా- ఎర్నాకులం, ఆగస్టు 1న నం.02863 హౌరా- యశ్వంత్పూర్, ఆగస్టు 3న నం.02864 యశ్వంత్పూర్- హౌరా రైళ్లను రద్దు చేశామని రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
తల్లి మందలించిందనే కారణంతో నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ పోలీస్ ఉన్నత అధికారులకు సమాచారం అందించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమై బాలికను రెండు గంటల్లోపే కనిపెట్టి డీసీపీ హరికృష్ణ తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు.
సైబర్ భద్రత, రహదారి భద్రత, మహిళలు & బాలల భద్రతపై అవగాహన కల్పించేలా 1- 3 నిముషాల నిడివితో కూడిన వీడియో కాంటెస్ట్ను విజయవాడ పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు 3 కేటగిరీలలో ఎంపికైన బెస్ట్ వీడియోలకు రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు నగదు బహుమతి ఇస్తామన్నారు. ఆసక్తి కలిగిన ఇన్ఫ్లూయెన్సర్లు ఆగస్టు 5లోపు రిజిస్టర్ చేసుకుని, 15లోపు తమ వీడియోలను vzapolicevideocontest@gmail.comకు పంపాలని కోరారు.
ఎన్టీఆర్: తన ప్రచారపిచ్చితో రాష్ట్ర ఖజానాను జగన్ గుల్ల చేశాడని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్ చేశారు. తన ముచ్చట తీర్చుకునేందుకు మాజీ సీఎం జగన్ రూ.700 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. రీ సర్వేలో అవకతవకలు చేయడమే కాక, ప్రజల ఆస్తులపై జగన్ తన పేరు బొమ్మలు వేసుకుని అహంకారపూరితంగా వ్యవహరించాడని ఉమ ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.
అత్యాచారం కేసులో ముగ్గురు నిందితులకు న్యాయమూర్తి వెంకటేశ్వర్లు సోమవారం సంచలన తీర్పునిచ్చారు. విజయవాడ భవానిపురానికి చెందిన ఓ బాలికను గురుసాయిచంద్ర పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. 2019 సెప్టెంబర్ 29న చంద్ర సాయి, గొల్లసాయి, తరుణ్ బాలికను రూంకు తీసుకెళ్లి మత్తుమందు కలిపి ఒకరి తరువాత ఒకరు అత్యాచారం చేశారు. ఈ కేసులో ముగ్గురికి 20 ఏళ్ల జైలు శిక్ష ఒక్కొక్కరికి రూ.25 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
కృష్ణా వర్శిటీ పరిధిలోని కళాశాలలలో MBA/ MCA విద్యార్థులకు నిర్వహించే సప్లిమెంటరీ (One time Opportunity) పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదలైంది. Y13, Y14, Y15, Y16, Y17, Y18తో ప్రారంభమయ్యే రిజిస్టర్డ్ నెంబర్ కలిగిన విద్యార్థులు ఈ పరీక్షలు రాసేందుకు ఆగస్టు 5లోపు అపరాధ రుసుము లేకుండా ఒక్కో సబ్జెక్టుకు రూ.2,000 ఫీజు చెల్లించాలని వర్శిటీ సూచించింది. వివరాలకు https://kru.ac.in/ వెబ్సైట్ చూడాలంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి కొమ్మా శివచంద్రారెడ్డికి తొలగించిన సెక్యూరిటీని తక్షణం పునరుద్ధరించాలని హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. శివచంద్రారెడ్డి గన్మెన్లను ఇటీవల ఉపసంహరించడంపై హైకోర్టులో న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
విజయవాడ శివారు గొల్లపూడి వద్ద సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతుడు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో హోంగార్డుగా పనిచేస్తున్న కృష్ణ అని స్థానికులు గుర్తించారు. ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో అక్కడికక్కడే మృతి చెందాడు .ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.