Krishna

News November 27, 2024

ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన చాంబర్ నుంచి సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం క్రింద ఇంకా చేపట్టవలసిన పెండింగ్ పనులను త్వరితగతిన ప్రారంభించాలన్నారు.

News November 26, 2024

కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో ఇటీవల నిర్వహించిన బీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సు 1వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఆయా పరీక్షలు రాసిన విద్యార్థులు రిజల్ట్స్ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సీటీ అధ్యాపక వర్గాలు సూచించాయి. ఈ పరీక్షల ఫలితాలకై యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చూడాలని విద్యార్థులకు ఈ మేరకు ఒక ప్రకటనలో సూచించాయి.

News November 26, 2024

మత్స్యకారులు వేటకు వెళ్లవద్దు: APSDMA ఎండీ 

image

కృష్ణా: నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో ఉమ్మడి కృష్ణాతో పాటుగా కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో రేపు భారీవర్షాలు పడతాయని ఆయన హెచ్చరించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూర్మనాథ్ సూచించారు.

News November 26, 2024

30కి కృష్ణా జడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా 

image

కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేపథ్యంలో ఈనెల 27వ తేదీన జరగాల్సిన సమావేశాన్ని 30వ తేదీకి మార్చారు. ఈ మేరకు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక ఓ ప్రకటన విడుదల చేశారు. 30న జరిగే సమావేశానికి సభ్యులంతా విధిగా హాజరు కావాలని కోరారు.

News November 26, 2024

కృష్ణా: కాదంబరి కేసు వాయిదా

image

ముంబై నటి కాదంబరి కేసులో దాఖలైన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. పలువురు IPS ఆఫీసర్లు, పోలీసులు, లాయర్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరగ్గా.. కేసు విచారణను డిసెంబర్ 2కి వాయిదా వేసింది. కౌంటర్ వేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరడంతో కేసు విచారణ వాయిదా పడింది.

News November 26, 2024

మచిలీపట్నంలో అసలేం జరిగిందంటే?

image

మచిలీపట్నంలో దంపతులు ఆత్మహత్యకు ప్రయత్నించగా భార్య <<14701508>>చనిపోయిన <<>>విషయం తెలిసిందే. నిజాంపేటకు చెందిన గోపీకృష్ణ, కావ్య(32)కు ఇద్దరు పిల్లలు. ఆదివారం అర్ధరాత్రి దంపతుల మధ్య గొడవ జరగ్గా.. ఆత్మహత్య చేసుకుంటానని భర్త చెప్పారు. ‘నేనూ సూసైడ్ చేసుకుంటా’ అని భార్య చెప్పడంతో ఇద్దరూ బైకుపై బుద్దాలపాలేనికి వచ్చారు. ఇద్దరూ రైలుకు ఎదురెళ్లగా కావ్య చనిపోయింది. చివరి నిమిషంలో గోపీకృష్ణ తప్పుకోవడంతో ఆయనకు గాయాలయ్యాయి.

News November 26, 2024

సోషల్ మీడియాలో మంచిని మాత్రమే అనుసరించాలి: కొలుసు

image

యువతీ, యువకులు సోషల్ మీడియాలో మంచిని మాత్రమే అనుసరించాలని మంత్రి కొలుసు పార్ధసారధి విద్యార్థులకు సూచించారు. తాను వ్యక్తిగతంగా సోషల్ మీడియా ఫాలోకానని చాలా మంది ప్రముఖులు కూడా సోషల్ మీడియాను ఫాలో అవ్వరని చెప్పారు. సోమవారం ఎస్ఆర్ఆర్ కళాశాలలో సామాజిక మాధ్యమాల దుష్ప్రచారం అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులు సామాజిక మాధ్యమాలను ఉపయోగించి వివిధ అంశాలపై అవగాహన పెంపొందించుకోవచ్చని అన్నారు.

News November 26, 2024

కృష్ణా: MSC రెండో సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో సెప్టెంబర్- 2024లో నిర్వహించిన ఎంఎస్సీ- ఫారెస్ట్రీ, న్యూట్రిషన్ & డైటిక్స్, ఇన్‌స్ట్రమెంటేషన్ టెక్నాలజీ కోర్సుల 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలంది.

News November 26, 2024

కృష్ణా: నేడు అన్ని విద్యా సంస్థల్లో రాజ్యాంగ దినోత్సవం

image

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో భారత రాజ్యాంగ పీఠికను ఉదయం 11:30ని.లకు సామూహికంగా చదవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కృష్ణా కలెక్టర్ బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలను గౌరవించడం, గుర్తించడం, రాజ్యాంగాన్ని ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు.

News November 25, 2024

ఫీజులపై కృష్ణా యూనివర్సిటీ నుంచి కీలక ప్రకటన

image

ఫీజు బకాయిలపై విద్యార్థులను వేధిస్తే చర్యలు తప్పవని కృష్ణా జిల్లా కలెక్టర్ DK బాలాజీ హెచ్చరించిన నేపథ్యంలో.. కృష్ణా యూనివర్సిటీ(KRU) రిజిస్ట్రార్ సోమవారం కీలక ప్రకటన విడుదల చేశారు. KRU పరిధిలోని కళాశాలల ప్రిన్సిపాళ్లు ఈ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆదేశించారు. విద్యార్థులను ప్రాక్టికల్స్, క్లాసులకు అనుమతించకుండా వేధిస్తే చర్యలు తీసుకోబడతాయన్నారు.

error: Content is protected !!