Krishna

News November 20, 2024

గన్నవరం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

image

గన్నవరం మండలంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిన్నమనేని సిద్ధార్థ హాస్పిటల్ వద్ద రోడ్డు ప్రమాదం జరగడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఆగి ఉన్న లారీని ఓ బైక్ ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం తెలుసుకున్న గన్నవరం సీఐ శివప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

News November 20, 2024

విజయవాడ: టీడీపీ నేత సూసైడ్.. వెలుగులోకి కీలక విషయాలు

image

గొల్లపూడికి చెందిన టీడీపీ నేత కారంపూడి రవీంద్ర ఈ నెల 17న కంచికచర్లలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వైసీపీ నేతల వేధింపులతోనే ఆయన మరణించినట్లు తాజాగా బయటికొచ్చిన సెల్ఫీ వీడియో ద్వారా తెలుస్తోంది. రవీంద్రకు చెందిన 15 ఆస్తులను వైసీపీ నాయకులు బలవంతంగా రాయించుకున్నారని ఆయన వీడియోలో వెల్లడించినట్లు సమాచారం వెలువడింది.

News November 20, 2024

కృష్ణా: MA పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో సెప్టెంబర్- 2024లో నిర్వహించిన MA(చరిత్ర & సంస్కృతం) రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం తెలిపింది.

News November 19, 2024

పోరంకిలో దొంగకు దేహశుద్ధి

image

పోరంకిలో మంగళవారం ఉదయం దొంగకు స్థానికులు దేహశుద్ధి చేశారు. స్థానికుల వివరాల మేరకు.. పెనమలూరుకు చెందిన వృద్ధురాలిని పీక నొక్కి ఆమె మెడలో ఉన్న బంగారం చోరీ చేసి పారిపోతుండగా స్థానికులు స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News November 19, 2024

కృష్ణా: ఆ రైళ్లకు కొత్త నంబర్లు

image

ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే 4 రైళ్లకు 2025 మార్చి 1 నుంచి కొత్త నంబర్లను రైల్వే శాఖ కేటాయించింది. నం.17487 & 17488 విశాఖపట్నం- కడప మధ్య ప్రయాణించే తిరుమల ఎక్స్‌ప్రెస్‌లకు నూతనంగా 18521 & 18522 నంబర్లను కేటాయించింది. అదేవిధంగా 22701 & 22702 విశాఖపట్నం- గుంటూరు ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌లకు 22875 & 22876 నంబర్లను కేటాయించామని రైల్వే శాఖ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.

News November 19, 2024

గుడివాడలో లంచం తీసుకున్న కేసులో సీఐ సస్పెండ్

image

రాజమండ్రి టూ టౌన్ సీఐ దుర్గారావుని ఉన్నతాధికారులు సోమవారం సస్పెండ్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. 2022లో గుడివాడ టూ టౌన్‌లో దుర్గారావు సీఐగా పనిచేస్తున్న సమయంలో భూ వివాదం కేసులో రెండు వర్గాల మధ్య సమస్యను పరిష్కరించారు. ఈ వివాదంలో ఓ వర్గంవారిని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారనే ఆరోపణలపై బాధితుడు ఏసీబీ వారిని ఆశ్రయించాడు. దర్యాప్తులో నేరం రుజువు కావడంతో సీఐ సస్పెండ్‌కు గురయ్యారు.

News November 19, 2024

విశాఖలో కొడాలి నానిపై ఫిర్యాదు

image

మాజీ మంత్రి కొడాలి నానిపై విశాఖ టూ టౌన్ స్టేషన్‌లో TDP నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్‌పై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ TDP జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షుడు విల్లూరి చక్రవర్తి, విల్లూరి తిరుమలదేవి ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. వైసీపీలోని మరో కీలక నేతలు అంబటి రాంబాబు, రోజాపై కూడా ఫిర్యాదు చేశారు.

News November 19, 2024

ఆ సమస్యను వారం రోజులలో పరిష్కరిస్తా: విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా

image

వస్త్రలత దుకాణ సముదాయంలోని వ్యాపారులు, అధికారులతో పశ్చిమ ఎమ్మెల్యే సుజనా సోమవారం తన కార్యాలయంలో సమావేశమయ్యారు. సమావేశంలో వస్త్రలతకు సంబందించిన అద్దె బకాయిల సమస్యను వారం రోజులలో పరిష్కరిస్తానని వ్యాపారులకు ఆయన హామీ ఇచ్చారు. కాంప్లెక్స్ పటిష్టతపై వ్యాపారులతో చర్చించిన సుజనా..దుకాణాల పునర్నిర్మాణం అంశంపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.

News November 18, 2024

కంచికచర్ల: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

image

కంచికచర్ల పట్టణ శివారు ప్రాంతంలో సోమవారం ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ రాజు వివరాల మేరకు.. మృతుడు విజయవాడకు చెందిన కారంపూడి రవీంద్ర. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతికి గల వివరాలు తెలియాల్సి ఉంది.

News November 18, 2024

కృష్ణా: బీ- ఫార్మసీ 5వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో బీ- ఫార్మసీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 5వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. డిసెంబర్ 3, 5, 7, 10, 12 తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్ట్ వారీగా టైమ్ టేబుల్, పరీక్ష కేంద్రాల వివరాలకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది. 

error: Content is protected !!