India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తూర్పు నియోజకవర్గంలోని సమస్యలపై కార్పొరేషన్ అధికారులతో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ గురువారం సమావేశం నిర్వహించారు. విజయవాడ అశోక్‌నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలన్నింటిని పరిష్కరించడానికి కార్పొరేషన్ పరంగా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. కృష్ణా రిటైనింగ్ వాల్ సమీపంలో 80 అడుగుల రోడ్డు నిర్మాణం చేయాలని సూచించారు.
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌పై బుద్ధా వెంకన్న Xలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వైసీపీ పాలనలో నువ్వు, జగన్ సర్వం నాకేశారని, నీకు రాజకీయ జన్మ ఇచ్చిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకే ద్రోహం చేశావు. గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి నిన్ను తీసుకువెళ్లిన చంద్రబాబును అవమానించిన నీ సానుభూతి కూటమి పాలనకు అవసరం లేదు’ అని పోస్ట్ చేశారు. అనంతరం అవంతి శ్రీనివాస్, ఊసరవెల్లి ఉన్న ఫొటోను Xలో పోస్ట్ చేశారు.
వైసీపీ నేత గౌతమ్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు సర్వం సిద్ధం చేస్తున్నారు. కోర్టు బెయిల్ కొట్టి వేయడంతో అరెస్ట్‌కు మార్గం సుగమైంది. విజయవాడకి చెందిన ఉమామహేశ్వర శాస్త్రి స్థలం కబ్జా, హత్యాయత్నం కేసుకు సంబంధించి గౌతమ్‌ని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా ఆయన కోసం పోలీసుల పత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఏ క్షణమైనా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోనున్నట్లు చెప్పారు.
విజయవాడలోని యార్లగడ్డ శివ, తన బావ పోసిన సాంబశివరావుల మధ్య కుటుంబ కలహాల నేపథ్యంలో వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఈనెల 10న శివ అతని బావమరిది రాజేశ్‌లు బైక్‌పై వెళుతుండగా శివ బావ సాంబశివరావు ట్రాక్టర్‌తో వెంబడించి ఢీకొట్టాడు. ఈ ఘటనలో శివ వంద అడుగులకుపైగా ఈడ్చుకు వెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా శివ ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.
రాష్ట్ర మైన్స్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం నెలకొంది. మంత్రి రవీంద్ర సోదరుడు కొల్లు వెంకట రమణ (64) బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. గుండెపోటుకు గురైన వెంకట రమణను హుటాహుటిన ఆంధ్ర ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సోదరుడి మరణ వార్త తెలుసుకున్న మంత్రి రవీంద్ర విజయవాడ నుండి మచిలీపట్నం బయలుదేరారు. మరికాసేపట్లో మంత్రి మచిలీపట్నం రానున్నారు.
మాజీ మంత్రి, వైసీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు పేర్ని వెంకట్రామయ్య (నాని) సతీమణి జయసుధ, ఆయన వ్యక్తిగత కార్యదర్శి మానస తేజపై బందరు తాలుకా PSలో కేసు నమోదైంది. జయసుధ పేరిట ఉన్న గోడౌన్లో 185 టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్టు సివిల్ సప్లయిస్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలుకా పోలీసులు వీరి ఇరువురిపై 316 (3), 316 (5), 61 (2) రెడ్ విత్ 3 (5) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రయాణికులను ఏమార్చి దొంగతనాలు చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు విజయవాడ పోలీసులు వెల్లడించారు. ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ సురేష్, తారకేశ్వరరావు, కంబల శ్రీను, రాజు అనే వ్యక్తులు బస్టాండ్‌ల వద్ద ప్రయాణికులను మోసం చేస్తూ ఉంటారన్నారు. ఫిర్యాదులు రావడంతో నిఘా పెట్టి వీరిని పట్టుకున్నామని చెప్పారు. వారి నుంచి రూ.1,50,000 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు.
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా SMVT బెంగుళూరు(SMVB) – హౌరా(HWH)(నం.06585) మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 14న ఉదయం 10.15 గంటలకు SMVBలో బయలుదేరే ఈ ట్రైన్ అదే రోజు రాత్రి 10.10 గంటలకు విజయవాడ చేరుకుంటుందని, 15వ తేదీన రాత్రి 9.45 గంటలకు HWH చేరుకుంటుందన్నారు. ఏపీలో ఈ ట్రైన్ పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతుందన్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలోని కళాశాలల్లో సెప్టెంబర్- 2024లో నిర్వహించిన మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ పీజీ కోర్సు 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది.
తనపై నమోదైన హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వైసీపీ నేత పూనురు గౌతమ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను బుధవారం విచారించిన హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా బాధితుడు ఉమామహేశ్వరశాస్త్రి హత్యకు గౌతమ్ రెడ్డి కుట్ర పన్నారని, ఘటనకు సంబంధించిన CC ఫుటేజ్, ఫోటోలు ఉన్నాయని ప్రభుత్వ తరఫు న్యాయవాది ఈ కేసు వాదనలో భాగంగా గతంలోనే న్యాయస్థానానికి విన్నవించారు.
Sorry, no posts matched your criteria.