Krishna

News November 20, 2024

కృష్ణా: బీ- ఫార్మసీ పరీక్షల ఫలితాల విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో ఇటీవల నిర్వహించిన బీ-ఫార్మసీ కోర్సు 4, 6వ సెమిస్టర్ల పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఆయా పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని కృష్ణా వర్సిటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చూడాలని KRU పరీక్షల విభాగం తెలిపింది. 

News November 20, 2024

కిశోరి వికాసం.. బాలిక బంగారు భ‌విష్య‌త్‌కు పునాది: కలెక్టర్

image

కిశోరి వికాసం-2 కార్య‌క్ర‌మం బాలిక‌ల బంగారు భ‌విష్య‌త్‌కు పునాది వేస్తుంద‌ని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ నిధి మీనా అన్నారు. ఉజ్వ‌ల‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన‌, సాధికార‌త దిశ‌గా వేసే అడుగుకు స‌మ‌ష్టి కృషితో చేయూతనిద్దామని పిలుపునిచ్చారు. బుధ‌వారం విజయవాడ కలెక్టరేట్‌లో కిశోరి వికాసం-2 కార్య‌క్రమాన్ని ప్రారంభించారు. కిశోరి వికాసం పునఃప్రారంభం ప్ర‌తి బాలిక భ‌విష్య‌త్తును మెరుగుప‌ర‌చడానికి ఓ మంచి కార్యక్రమన్నారు. 

News November 20, 2024

గుడివాడ: సజ్జల భార్గవరెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

image

సోషల్ మీడియా పోస్టుల నేపథ్యంలో వైసీపీ నేత సజ్జల భార్గవరెడ్డిపై గుడివాడ పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ.. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను కోర్టు బుధవారం విచారించింది. అనంతరం ఈ పిటిషన్‌ను ఎల్లుండి నవంబర్ 22వ తేదికి హైకోర్టు వాయిదా వేసింది. 

News November 20, 2024

గన్నవరం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

image

గన్నవరం మండలంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిన్నమనేని సిద్ధార్థ హాస్పిటల్ వద్ద రోడ్డు ప్రమాదం జరగడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఆగి ఉన్న లారీని ఓ బైక్ ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం తెలుసుకున్న గన్నవరం సీఐ శివప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

News November 20, 2024

విజయవాడ: టీడీపీ నేత సూసైడ్.. వెలుగులోకి కీలక విషయాలు

image

గొల్లపూడికి చెందిన టీడీపీ నేత కారంపూడి రవీంద్ర ఈ నెల 17న కంచికచర్లలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వైసీపీ నేతల వేధింపులతోనే ఆయన మరణించినట్లు తాజాగా బయటికొచ్చిన సెల్ఫీ వీడియో ద్వారా తెలుస్తోంది. రవీంద్రకు చెందిన 15 ఆస్తులను వైసీపీ నాయకులు బలవంతంగా రాయించుకున్నారని ఆయన వీడియోలో వెల్లడించినట్లు సమాచారం వెలువడింది.

News November 20, 2024

కృష్ణా: MA పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో సెప్టెంబర్- 2024లో నిర్వహించిన MA(చరిత్ర & సంస్కృతం) రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం తెలిపింది.

News November 19, 2024

పోరంకిలో దొంగకు దేహశుద్ధి

image

పోరంకిలో మంగళవారం ఉదయం దొంగకు స్థానికులు దేహశుద్ధి చేశారు. స్థానికుల వివరాల మేరకు.. పెనమలూరుకు చెందిన వృద్ధురాలిని పీక నొక్కి ఆమె మెడలో ఉన్న బంగారం చోరీ చేసి పారిపోతుండగా స్థానికులు స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News November 19, 2024

కృష్ణా: ఆ రైళ్లకు కొత్త నంబర్లు

image

ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే 4 రైళ్లకు 2025 మార్చి 1 నుంచి కొత్త నంబర్లను రైల్వే శాఖ కేటాయించింది. నం.17487 & 17488 విశాఖపట్నం- కడప మధ్య ప్రయాణించే తిరుమల ఎక్స్‌ప్రెస్‌లకు నూతనంగా 18521 & 18522 నంబర్లను కేటాయించింది. అదేవిధంగా 22701 & 22702 విశాఖపట్నం- గుంటూరు ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌లకు 22875 & 22876 నంబర్లను కేటాయించామని రైల్వే శాఖ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.

News November 19, 2024

గుడివాడలో లంచం తీసుకున్న కేసులో సీఐ సస్పెండ్

image

రాజమండ్రి టూ టౌన్ సీఐ దుర్గారావుని ఉన్నతాధికారులు సోమవారం సస్పెండ్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. 2022లో గుడివాడ టూ టౌన్‌లో దుర్గారావు సీఐగా పనిచేస్తున్న సమయంలో భూ వివాదం కేసులో రెండు వర్గాల మధ్య సమస్యను పరిష్కరించారు. ఈ వివాదంలో ఓ వర్గంవారిని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారనే ఆరోపణలపై బాధితుడు ఏసీబీ వారిని ఆశ్రయించాడు. దర్యాప్తులో నేరం రుజువు కావడంతో సీఐ సస్పెండ్‌కు గురయ్యారు.

News November 19, 2024

విశాఖలో కొడాలి నానిపై ఫిర్యాదు

image

మాజీ మంత్రి కొడాలి నానిపై విశాఖ టూ టౌన్ స్టేషన్‌లో TDP నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్‌పై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ TDP జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షుడు విల్లూరి చక్రవర్తి, విల్లూరి తిరుమలదేవి ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. వైసీపీలోని మరో కీలక నేతలు అంబటి రాంబాబు, రోజాపై కూడా ఫిర్యాదు చేశారు.