India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టమాటాల ధరలు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం నియంత్రణా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వం సరఫరా చేస్తున్న టమాటాలకు కిలో రూ.56గా నిర్ణయించారు. అయితే నగరంలోని రైతు బజార్లకు 3 టన్నుల పైచిలుకు (119 ట్రేలు) ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. రైతుబజార్లలోని దుకాణదారులు సొంతంగా తెచ్చుకున్న వారి టమాటాల ధర రూ.80లుగా ఉంది. కొరత క్రమంలో ప్రభుత్వం మదనపల్లె ప్రాంతాల్లో నేరుగా కొనుగోలు చేసి మన మార్కెట్లకు తెస్తుంది.
రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA)లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి కోరుతూ.. సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఈనెల 10న పురపాలక శాఖకు లేఖ రాశారు. దీనికి ఆమోదం తెలుపుతూ.. మూడేళ్ల కాలపరిమితితో 75 ఒప్పంద పోస్టులను, పొరుగుసేవల పద్ధతిలో 68 పోస్టులను నింపేందుకు పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి GO జారీ చేశారు.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా 1.75 లక్షల ఎకరాల భూ ఆక్రమణకు పాల్పడ్డారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఆక్రమించిన భూముల విలువ రూ.35,576 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో పదివేల ఎకరాలు, ఉచిత ఇసుక పేరుతో రూ.9,750 కోట్ల దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు.
US ప్రెసిడెంట్ ఎన్నికలలో వైస్ ప్రెసిడెంట్‌గా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న JD వాన్స్ భార్య ఉష చిలుకూరి తల్లిదండ్రులు పామర్రుకు చెందినవారు. ఉష తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మీ అమెరికా వలస వెళ్లగా 3వ సంతానంగా ఉష జన్మించారు. కాలేజీ చదువు అనంతరం వాన్స్‌ను ప్రేమించిన ఉష హిందూ పద్ధతిలో వివాహం చేసుకుంది. ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే మన జిల్లా అమ్మాయి ఉష USకి మిసెస్ వైస్ ప్రెసిడెంట్ అవుతారు.
పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం తాడంకి గ్రామంలో గండికోట రాంబాబు(34) మంగళవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కర్రలతో తలపై కొట్టిన ఆనవాళ్లు కనిపించాయి. సంఘటనా ప్రదేశంలో మద్యం సీసా ఉండగా.. రాంబాబు తాపీ మేస్త్రిగా పని చేస్తారని తెలిపారు. ఈ విషయంపై పమిడిముక్కల పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
గంజాయి మత్తులో భార్య, కూతురిని చంపాలనుకున్న వ్యక్తిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడ పరిధిలోని కొత్తపేటలో ఉండే రాంపిళ్ల బాబీ(26) గంజాయికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో తాగడానికి డబ్బు ఇవ్వాలంటూ భార్యను చున్నీతో మెడకు బిగించి చంపేస్తానని బెదిరించేవాడు. ఒకరోజు డబ్బు ఇవ్వలేదని చిన్నారిని భవనంపైకి తీసుకెళ్లి 2 కాళ్లు తిరగేసి వేలాడదీశాడు. ఈ ఘటనలపై నిందితుణ్ని అరెస్ట్ చేశారు.
అమరావతి ప్రాంతాన్ని చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారితో అనుసంధానం చేసేలా ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) ప్రణాళికలు రూపొందించింది. రాజధానిలోని సీడ్ యాక్సిస్ రోడ్ E-11,13లను జాతీయ రహదారి (NH-16)తో కలిపేలా CRDA అధికారులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తాజాగా సమాచారం వెలువడింది. కొండ అంచు నుంచి ఈ రోడ్లు నిర్మించేలా CRDA కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అమరావతి ప్రాంతాన్ని చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారితో అనుసంధానం చేసేలా ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(APCRDA) ప్రణాళికలు రూపొందించింది. రాజధానిలోని సీడ్ యాక్సిస్ రోడ్ E-11,13లను జాతీయ రహదారి(NH-16)తో కలిపేలా CRDA అధికారులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తాజాగా సమాచారం వెలువడింది. కొండ అంచు నుంచి ఈ రోడ్లు నిర్మించేలా CRDA కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
విజయవాడ డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్న కారణంగా విజయవాడ నుంచి హుబ్లీ వెళ్లే రైళ్లను రద్దు చేశామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆగస్టు 1 నుంచి 10 వరకు నం.17329 హుబ్లీ- విజయవాడ, నం.17330 విజయవాడ-హుబ్లీ డైలీ ఎక్స్‌ప్రెస్‌లను ఆగస్టు 2 నుంచి 11 వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు రైళ్ల రద్దు అంశాన్ని గమనించాలని సూచించారు.
విజయవాడ మీదుగా KSR బెంగుళూరు, భువనేశ్వర్ మధ్య ప్రయాణించే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లకు అదనంగా 2 జనరల్ కోచ్‌లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.18463/18464 ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లు ప్రస్తుతం 2 జనరల్ కోచ్‌లతో నడుస్తుండగా 2 బోగీలు జతచేసి మొత్తంగా 4 జనరల్ కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 18463 ట్రైన్‌కు నవంబర్ 14, 18464 ట్రైన్‌కు నవంబర్ 15 నుంచి 2 అదనపు జనరల్ కోచ్‌లు ఉంటాయన్నారు.
Sorry, no posts matched your criteria.