Krishna

News November 13, 2024

60 ఏళ్ల వయస్సులో బంగారు పతకాల పంట

image

కృష్ణా జిల్లా పెడనకు చెందిన భీమేశ్వరరావు(60) జగ్గయ్యపేటలో 10వ తారీఖున జరిగిన రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో 3 బంగారు పథకాలు సాధించారు. దీంతో ఈ వయసులో కూడా అతని ఫిట్నెస్ చూసి జనం ఆశ్చర్యపోయారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే భీమేశ్వరరావు పాల్గొన్న ప్రతి పోటీల్లో పతకం సాధించడం విశేషం. ఇప్పటి వరకు జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల్లో 14 పతకాలను గెలిచాడు. ఈ ఘనతకు కారణం కోచ్ సుబ్రహ్మణ్యం అని చెప్పారు.

News November 13, 2024

కృష్ణా: నేటితో ముగియనున్న ఉద్యోగాల దరఖాస్తు గడువు

image

కృష్ణా: APCRDAలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 19 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా GIS & రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్(6), హెల్త్ & సేఫ్టీ స్పెషలిస్ట్(4) తదితర ఉద్యోగాలను APCRDA భర్తీ చేయనుంది. అభ్యర్థులు నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు, అప్లై చేసేందుకు https://crda.ap.gov.in/Careers/General అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.

News November 12, 2024

అసెంబ్లీ విప్‌లుగా బోండా ఉమ, యార్లగడ్డ, తంగిరాల సౌమ్య

image

శాసన సభ, శాసనమండలి చీఫ్ విప్, విప్‌లను కాసేపటి క్రితం ప్రభుత్వం ఖరారు చేసింది. ఇద్దరు చీఫ్ విప్‌లతో పాటు 15 మందిని విప్‌లుగా నియమించింది. శాసన సభ చీఫ్ విప్‌గా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, శాసన మండలి చీఫ్ విప్‌గా పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి బోండా ఉమ(విజయవాడ సెంట్రల్), తంగిరాల సౌమ్య(నందిగామ), యార్లగడ్డ వెంకట్రావు(గన్నవరం) అసెంబ్లీ విప్‌లుగా అవకాశం లభించింది.

News November 12, 2024

కృష్ణా: రేపటితో ముగియనున్న ఉద్యోగాల దరఖాస్తు గడువు

image

కృష్ణా: APCRDAలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 19 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా GIS & రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్(6), హెల్త్ & సేఫ్టీ స్పెషలిస్ట్(4) తదితర ఉద్యోగాలను APCRDA భర్తీ చేయనుంది. అభ్యర్థులు నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు, అప్లై చేసేందుకు https://crda.ap.gov.in/Careers/General అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.

News November 12, 2024

ఈ నెల 13న కృష్ణలంకలో జిల్లా ఫెన్సింగ్ జట్ల ఎంపిక

image

విజయవాడ: కృష్ణలంకలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నవంబర్ 13న ఎస్జీఎఫ్ అండర్19 ఉమ్మడి కృష్ణా జిల్లా ఫెన్సింగ్ జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా అండర్ 19 ఎస్జీఎఫ్ కార్యదర్శి రవికాంత్ తెలిపారు. ఈ పోటీలకు 01జనవరి2006 తరువాత పుట్టినవారు అర్హులన్నారు. జిల్లాలో ఆసక్తి గలవారు జనన ధ్రువీకరణ, స్టడీ, ఆధార్ పత్రాలతో హాజరుకావాలన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఓపెన్‌గా చదివేవారు అనర్హులని చెప్పారు.

News November 12, 2024

కృష్ణా: ప్రయాణికుల రద్దీ మేరకు అన్‌రిజర్వ్‌డ్ స్పెషల్ రైలు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా ఈ నెల 14న SMVT బెంగుళూరు(SMVB)- మాల్డా(MLDT) మధ్య అన్‌రిజర్వ్‌డ్ స్పెషల్ రైలు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు 14న ఉదయం 7 గంటలకు SMVBలో బయలుదేరి రాత్రి 8.05 గంటలకు విజయవాడ చేరుకుంటుందని, 16న ఉదయం 8 గంటలకు మాల్డా చేరుకుంటుందన్నారు. ఈ రైలులో 16 అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు ఉంటాయన్నారు.

News November 12, 2024

కృష్ణా: బీటెక్ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఆగస్టు 2024లో నిర్వహించిన బీటెక్ 1, 2, 3, 4వ ఏడాదికి సంబంధించిన రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ ను చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం తెలిపింది.

News November 12, 2024

కృష్ణా: LLM కోర్సుల అకడమిక్ క్యాలెండర్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో LLM కోర్సులకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన టెంటేటివ్ అకడమిక్ క్యాలెండర్ సోమవారం విడుదలైంది. ప్రతి సెమిస్టర్‌లో 90 పనిదినాలుండేలా అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించామని విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. LLM కోర్సుల ఇంటర్నల్, థియరీ, ప్రాక్టికల్ పరీక్షల తేదీల వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్‌లో అకడమిక్ క్యాలెండర్‌ను చూడవచ్చు.

News November 12, 2024

జనవరి నాటికి జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు: కొలుసు

image

రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ జనవరి 2025 నాటికి అక్రెడిటేషన్లు ఇవ్వనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పేర్కొన్నారు. నివేశన స్థలాలు, గృహ నిర్మాణాలను కూడా ప్రభుత్వమే చేపట్టే విధంగా ఆలోచిస్తున్నామన్నారు. అక్రెడిటేషన్ కమిటీలు యూనియన్ నేతలకు చాన్సు ఉంటుందన్నారు.

News November 12, 2024

తిరువూరులో అర్ధరాత్రి విషాదం

image

తిరువూరులో సోమవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. తిరువూరు లక్ష్మీపురానికి చెందిన ఇస్మాయిల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తన ఇంటి ఆవరణంలో ఉన్న పాకలో మంచం మీద పడుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి సుమారు 12 గంటల సమయంలో విద్యుత్ షాక్ తో ఇంటి పూరీపాక కాలిపోవడంతో పడుకున్న ఇస్మాయిల్ కూడా కాలిపోయాడు. స్థానికులు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయగా వచ్చి మంటలను అర్పివేశారు.