India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తోట్లవల్లూరులో ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులకు వివరాల మేరకు.. మండలంలోని చాగంటిపాడు శివారు కళ్లెంవారిపాలెం వద్ద కృష్ణానది ఒడ్డున ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. మృతుడి ఎడమ చేతి మీద డిజైన్, బ్రూస్లీ అని, కుడి చేతి మీద నాయక్, ప్రేమ కావాలి, కాజల్, అమ్మానాన్న, గంగా అని చాతిపైన పోలమ్మ, కాజల్, బసవమ్మ అని పచ్చబొట్టులు ఉన్నాయి.VRO ఫిర్యాదతో SI కేసు నమోదు చేశారు.

★ గన్నవరంలో వాయిదా పడిన పవన్ పర్యటన ★ కృష్ణా జిల్లాలో 40 డిగ్రీలు ఎండ★ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా P4 సర్వే : కలెక్టర్ ★ మొవ్వ: రాజీకి పిలిచి.. హత్య ★ VJA: `సాఫ్వేర్ ఉద్యోగి కాదు అమ్మాయిల బ్రోకర్’★ గన్నవరం: తీవ్రమవుతున్న వెటర్నరీ విద్యార్థులు నిరసనలు★ గూడూరు వద్ద ప్రమాదం.. డ్రైవర్ మృతి★ ఉయ్యూరు: ప్రభుత్వ ఉద్యోగి సూసైడ్ నోట్

కృష్ణా యూనివర్శిటీ అనుబంధ కళాశాలలకు సంబంధించి UG మొదటి సెమిస్టర్ ఫలితాలను, UG వన్ టైమ్ పరీక్షా ఫలితాలను గురువారం విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. రాంజీ విడుదల చేశారు. 7,212 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగా 4,302 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఉత్తీర్ణతా శాతం 59.65%గా నమోదైందన్నారు. ఫస్ట్ సెమిస్టర్ పునఃమూల్యాంకనం కొరకు ఈ నెల 19వ తేదీ లోపు నిర్ణీత రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై చిట్టి గూడూరు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి టాటా మ్యాజిక్ వాహనం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్ డ్రైవర్ బొల్లా మోహన్ రావు దుర్మరణం చెందారు. వాహనంలో ఉన్న ప్యాసింజర్లకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్షిప్ (P4) సర్వేకు రూపకల్పన చేసిందని, ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించే ఈ సర్వేను విజయవంతం చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో MPDOలు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులతో సమీక్షించారు.

వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై గురువారం విచారణ జరగనుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా వంశీ ఉన్నారు. వంశీని మరో 10 రోజుల పాటు కస్టడీకి కోరుతూ పోలీసులు విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో వంశీ సరిగ్గా సహకరించలేదని పిటీషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న వ్యక్తులు పరారీలోనే ఉన్నారు.

కృష్ణా జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఎండ మండిపోయింది. ముఖ్యంగా కంకిపాడులో 39.9 నమోదు కాగా.. బాపులపాడు, గన్నవరం, పెనమలూరులలో 39 డిగ్రీలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో ఉన్నదాని కంటే నాలుగు శాతం ఉష్ణోగ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకులపై కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్లో పలు శాఖాధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. మార్చి 8వ తేదీన ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆయనతో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, యంత్రాంగం మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహణపై చర్చించారు.

ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించిన విషయంలో తెలిసిందే. ఈ ఎన్నికల్లో పట్టభద్రులు వేసిన ఓట్లు కొన్ని చెల్లలేదు. మొత్తం 26, 679 ఓట్లు చెల్లనివిగా అధికారులు గుర్తించారు. ప్రతి రౌండ్లోనూ 2 వేలకు పైగా చెల్లని ఓట్లు పడినట్లు తెలిసింది. ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లో కూడా 55 ఓట్లు చెల్లలేదు.

ఈనెల 7వ తేదీన గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్లో స్వర్ణ పంచాయితీ వెబ్ సైట్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ, కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించారు.
Sorry, no posts matched your criteria.