India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బనగానపల్లె నియోజకవర్గ విద్యార్థులకు మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నంద్యాల జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థికి రూ.లక్ష నగదు బహుమతి అందిస్తామని చెప్పారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ప్రథమ ర్యాంక్ సాధించిన వారికి రూ.50 వేలు అందజేస్తామని ప్రకటించారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు.
హీరో మంచు మనోజ్, భూమా మౌనిక నేడు ఆళ్లగడ్డకు రానున్నారు. ఇవాళ శోభానాగిరెడ్డి జయంతి కావడంతో ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారు వస్తున్నట్లు సమాచారం. భూమా ఘాట్‌లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ‘మంచు’ ఫ్యామిలీలో వివాదం నేపథ్యంలో వారి రాకపై ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యే అఖిలప్రియతో కలిసి వారు నివాళులు అర్పించనున్నట్లు సమాచారం.
చాగలమర్రిలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సూపర్-7 సబ్‌జూనియర్ నంద్యాల జిల్లా క్రికెట్ జట్టును ఆదివారం ఎంపిక చేశారు. నంద్యాల జిల్లా కార్యదర్శి కడ్డీ మహబూబ్ బాషా మాట్లాడుతూ.. స్థానిక క్రీడా మైదానంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సబ్ జూనియర్ క్రికెట్ క్రీడాకరులకు ఒక రోజు పాటు శిక్షణ ఇచ్చామన్నారు. అందులో 15 మందిని జిల్లా జట్టుకు ఎంపిక చేశామన్నారు.
ఢిల్లీలో ఆదివారం జరిగిన భారత సెపక్ తక్రా సంఘం ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ సెపక్ తక్రా సంఘం కర్నూలు జిల్లా కార్యదర్శిగా ఉన్న జీ.శ్రీనివాసులు ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీనివాసులు ఎన్నికపట్ల కర్నూలు జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షుడు కేఈ జగదీశ్ కుమార్, ఒలంపిక్ సంఘం సీఈఓ విజయకుమార్, క్రీడా సంఘాల ప్రతినిధులు సునీల్, పీఈటీ, పీడీలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ నెల 16న నంద్యాల కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9:30 గంటలకు జిల్లా అధికారులందరూ హాజరు కావాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలోనూ ఈ కార్యక్రమం సంబంధింత అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారని పేర్కొన్నారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర నేటి యువతరానికి ఆదర్శప్రాయుడని కలెక్టర్ పీ.రంజిత్ బాషా అన్నారు. పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల లేసి కలెక్టర్ నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భాషా ప్రయోక్త రాష్ట్రాల కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి అన్నారు.
గుంటూరు-గుంతకల్లు రైల్వే లైన్ డబ్లింగ్ పనుల్లో భాగంగా నంద్యాల మీదుగా వెళ్లే గుంటూరు-డోన్ రైలు (17228)ను 10 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈనెల 16 నుంచి 26 వరకు రద్దు చేశారు. డోన్-గుంటూరు రైలును 17- 27 వరకు రద్దు చేశారు. పూరి – గిద్దలూరు- యశ్వంత్ పూర్ (22883) రైలును డోన్ మీదుగా కాకుండా నంద్యాల నుంచి యర్రగుంట్ల వైపు ఈనెల 20వ తేదీ వరకు మళ్లించారు.
రాజంపేటలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. కోవెలకుంట్లకు చెందిన కిరణ్ రాజంపేట ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. శనివారం కిరణ్ పుట్టినరోజు కావడంతో పులివెందులకు చెందిన ఫ్రెండ్ బన్నీ చెన్నైలో చదువుతూ రాజంపేటకు వచ్చారు. కాగా వీరి ఇరువురినీ ఆర్టీసీ బస్సు ఢీకొని పుట్టినరోజు నాడే మృతి చెందగా.. అదే చివరి రోజైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
నంద్యాల కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కోర్టు ఆవరణలో నిర్వహించామని మూడవ అదనపు జిల్లా జడ్జి వాసు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లో సీసీ కేసులు 92, సివిల్ కేసులు 41, క్రిమినల్ కేసులు 118, ఎక్సైజ్ 16 కేసులు చొప్పున మొత్తం 362 కేసులు పరిష్కారం అయ్యాయని న్యాయమూర్తి వాసు తెలిపారు. పలు కేసుల్లో రాజీ అయిన కక్షిదారులకు 8.56 కోట్ల రూపాయలను పరిహారంగా అందించామన్నారు.
ఏపీలో ఐదు ప్రధాన నగరాలను ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో రాయలసీమలోని కర్నూలుకు సీఎం చంద్రబాబు చోటు కల్పించారు. కర్నూలు జిల్లాలో విత్తన కేంద్రం, రక్షణ-పౌర విమానయానం, సౌర, పవన విద్యుత్ సంబంధించిన కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.