India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నంద్యాల జిల్లా కొలిమిగుండ్లకు చెందిన బీటెక్ విద్యార్థి శ్రీ హర్ష (20) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ రమేశ్ బాబు వివరాల మేరకు.. శ్రీ హర్ష గుజరాత్‌లోని వొడదొరలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. తన కొడుకు బలవన్మరణానికి ప్రేమవ్యవహారమే కారణమని తండ్రి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని వివరించారు.
కర్నూలు జిల్లాలో నేడు సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. కేసీ కెనాల్, SRBC, తెలుగు గంగ, మైనర్ ఇరిగేషన్, మైలవరం పరిధిలోని ఆయకట్టు రైతులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సుమారు 3లక్షల మంది రైతులు నేడు ఓటేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాటు పూర్తి చేశారు. పలు చోట్ల 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
తన మిత్రుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఇంకా స్పందించలేదు. నిన్న మధ్యాహ్నం బన్నీ అరెస్ట్ కాగా శిల్పా రవి ఇంకా స్పందించకపోవడంతో ఫ్యాన్స్ విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే శిల్ప రవి నిన్న నంద్యాలలో జరిగిన రైతు ధర్నాలో పాల్గొన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో అల్లు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తనపై నంద్యాలలో నమోదైన కేసులో ఉపశమనం పొందిన హీరో అల్లు అర్జున్ మరో కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఎన్నికల వేళ బన్నీపై నంద్యాలలో కేసు నమోదు కాగా ఇటీవలే ఏపీ HC కొట్టేసిన విషయం తెలిసిందే. అయితే పుష్ప-2 ప్రీమియర్ షో వీక్షించేందుకు HYDలోని సంధ్య థియేటర్‌కు బన్నీ రాగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. మహిళ మృతి చెందడంతో నమోదైన కేసులో ఆయన ఒకరోజు జైలులో గడపాల్సి వచ్చింది.
పత్తికొండ టమోటా మార్కెట్‌లో రైతుల నుంచి టమోటా కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డుకు 42 ఉత్పత్తులు వచ్చాయని, ఇందులో 13 టన్నులు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేసి రాష్ట్రంలోని వివిధ రైతు బజార్లకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. టమోటా కిలో కనిష్ఠ ధర రూ.4 లకు కొనుగోలు చేయాలని ఆదేశించారు.
బనగానపల్లె నెహ్రూ పాఠశాలలో గురువారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. మంత్రి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మేళాను ప్రారంభించారు. 30కి పైగా కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొనగా.. 1000 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించాయి. ఎంపికైన అభ్యర్థులకు ఇందిరా రెడ్డి ఆఫర్ లెటర్లను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
పత్తికొండ నుంచి టమాటా ఎగుమతులకు డిమాండ్ తగ్గడంతో ధరలు భారీగా పడిపయాయి. ఇతర ప్రాంతాల్లో నాణ్యతను బట్టి కిలో రూ.20కిపైగా అమ్ముడుపోతుండగా ఇక్కడ మాత్రం కిలో ₹1 నుంచి ₹8 వరకు పలకడం విశేషం. పత్తికొండ మార్కెట్‌కు వచ్చే టమాటాను తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలకు తరలిస్తారు. ఆయా చోట్ల స్థానిక దిగుబడి పెరగడంతో పత్తికొండ మార్కెట్‌పై ఎఫెక్ట్ పడింది. దిగుబడులను రైతులు రోడ్ల పక్కన పారబోస్తున్నారు.
దక్షిణ మధ్య రైల్వే నంద్యాల మీదుగా శబరిమలకు పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. 07177-విజయవాడ నుంచి కొల్లాం, 07183-నరసాపురం నుంచి కొల్లాం, 07181-గుంటూరు నుంచి కొల్లాం రైల్లు. తిరుగు ప్రయాణంలో 07178-కొల్లాం నుంచి కాకినాడ, 07184-కొల్లాం నుంచి నర్సాపూర్, 07182-కొల్లాం నుంచి కాకినాడ, 07185-కొల్లాం నుంచి గుంటూరు రైళ్లు నంద్యాల మీదుగా ప్రయాణిస్తాయి. మరిన్ని వివరాలకు రైల్వే స్టేషన్‌లో సంప్రదించగలరు.
నగరపాలక సంస్థకు సంబంధించి ఆస్తి, నీటి పన్నులను సకాలంలో వసూలు చేయాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు, అడ్మిన్లతో సమావేశం నిర్వహించారు. అందరూ సమన్వయం చేసుకొని, పన్ను బకాయిలను త్వరగా త్వరితగతిన వసూలు చేయాలని ఆదేశించారు. రోజువారీ ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.
కుల, మత బేధాలు లేకుండా ప్రజలందరూ సోదర భావంతో జీవించాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ అన్నారు. కర్నూలులోని మౌర్య ఇన్‌లో మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో పాస్టర్‌లకు ఏర్పాటు చేసిన క్రిస్మస్ క్యాండిల్ లైట్ సర్వీస్ కార్యక్రమంలో వెంకటేశ్ పాల్గొన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా కర్నూలు నగరం నిలుస్తోందని ఆయన అన్నారు.
Sorry, no posts matched your criteria.