Kurnool

News May 30, 2024

కర్నూలు: పెళ్లి కావడం లేదని సూసైడ్

image

కర్నూలు బి.క్యాంప్ లో నివాసముంటున్న రఘు నాయక్ (27) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై గదిలో ఉరి వేసుకున్నాడు. తల్లి లక్ష్మీబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మూడో పట్టణ సీఐ మురళీధర్ రెడ్డి తెలిపారు.

News May 30, 2024

గాజులపల్లె : రైల్వే ప్లాట్ ఫాం వద్ద మహిళ మృతి

image

మహానంది మండలం గాజులపల్లె రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం వద్ద గుర్తు తెలియని మహిళ మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మహిళ వయసు సుమారు 40 ఏళ్లకు పైగా ఉంటుంది అని, ఆకుపచ్చ చీర ధరించి ఉందన్నారు. గత రాత్రి మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. మృతి చెందిన మహిళ ఎవరు..? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

News May 30, 2024

కర్నూలు : డిగ్రీ పరీక్షలకు 350 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లాలోని రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ పరీక్షలకు బుధవారం 350 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వీసీ సుధీర్ ప్రేమ్ కుమార్ వెల్లడించారు. మరోవైపు ఇద్దరు విద్యార్థులు పరీక్షలు రాస్తూ డిబార్ అయినట్లు వీసీ ప్రకటించారు. నాలుగో సెమిస్టర్‌లో మొత్తం 3,709 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, 3,359 మంది హాజరయ్యారని వీసీ సుధీర్ ప్రేమ్ కుమార్ వెల్లడించారు.

News May 30, 2024

కర్నూలు: వేరు వేరు ఘటనల్లో ఐదుగురి ఆత్మహత్య

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఒకేరోజు ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐదుగురూ కూడా యువకులే కావడం గమనార్హం. శ్రీశైలంలో పూజారి మహేశ్(26), పాణ్యంలో చాకలి మోహన్ వంశీ(23), దేవనకొండ మండలం జిల్లెబుడకల గ్రామంలో కొండమీద హరిచంద్ర(39), కర్నూల్ బి.క్యాంపులో రఘునాయక్(27), పగిడ్యాల మండలకేంద్రంలో రమేశ్(20) ఒకే రోజు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. కారణాలు ఏవైనా వీరి ఆత్మహత్య విషాదాన్ని నింపుతోంది.

News May 30, 2024

దేవనకొండ: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం దేనవకొండ మండలంలో జరిగింది. జిల్లేడుబుడకలలో కొండమీద లక్ష్మన్న కుమారుడు బోయ హరిచంద్రుడు(42) అప్పుల బాధ తట్టుకోలేక విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి 5 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం కోసం చేసిన అప్పుల తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు.

News May 30, 2024

నంద్యాల: ఓట్ల లెక్కింపు .. పకడ్బందీ ఏర్పాట్లు

image

జూన్ 4వ తేదీన నిర్వహించే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు నంద్యాల కలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కౌంటింగ్ ఏజెంట్ల నియామకానికి సంబంధించి 75% పూర్తయిందన్నారు. ఎన్నికల కౌంటింగ్ సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

News May 29, 2024

కర్నూలు: ఎఫ్.పి.షాప్ డీలర్ మహమ్మద్ బాషా మృతి

image

తుగ్గలికి చెందిన ఎఫ్.పి. షాప్ డీలర్ మహమ్మద్ బాషా (70) అనారోగ్యానికి గురయ్యారు. ఆయనను వైద్య చికిత్సల కోసం కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్సలు పొందుతూ బాషా బుధవారం సాయంత్రం మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎఫ్.పి. సంఘానికి, పత్తికొండ నియోజకవర్గానికి బాషా ఎనలేని సేవలందించాడు. బాషా మృతితో గ్రామంలో విషాదఛాయలు ఆలుముకున్నాయి.

News May 29, 2024

నంద్యాల: ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు

image

ప్రతి హాల్ కు 14 టేబుళ్లు చొప్పున రౌండ్ల వారిగా అభ్యర్థులకు పోలైన ఓట్ల వివరాలను వెల్లడిస్తామని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం అసెంబ్లీకి 74, పార్లమెంటుకు 75 టేబుళ్లు, పోస్టల్ ఓట్ల లెక్కింపు కోసం అసెంబ్లీకి 21, పార్లమెంటుకు 17 టేబుళ్లు చొప్పున ఏర్పాటు చేశామన్నారు. 12 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. అసెంబ్లీ, పార్లమెంట్ వారీగా ఉంటాయన్నారు.

News May 29, 2024

అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష

image

దీల్లీ కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి ఎన్నికల కౌంటింగ్, భద్రతా ఏర్పాట్లపై సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డా.జి.సృజన, ఎస్పీ జి.కృష్ణకాంత్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, తదితరులు పాల్గొన్నారు.

News May 29, 2024

కర్నూలు: 27,998 ఆరోగ్య శ్రీ కేసులతో ప్రథమ స్థానం

image

కర్నూలు సర్వజన వైద్యశాలలో గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది మే వరకు 27,998 ఆరోగ్యశ్రీ కింద కేసులు చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ వెంకటరంగారెడ్డి తెలిపారు. ఆస్పత్రిలోని ధన్వంతరీ హాలులో అన్ని విభాగాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సుమారు రూ.2 కోట్ల విలువైన ఆధునిక పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.