Kurnool

News May 29, 2024

కర్నూలు: 19 లక్షల పత్తి విత్తన ప్యాకెట్ల సరఫరాకు చర్యలు

image

కర్నూలు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 2.50 లక్షల హెక్టార్లకుపైగా పత్తి సాగయ్యే అవకాశాలున్నాయి. 450 గ్రాముల విత్తన ప్యాకెట్లు హెక్టార్ కు 8 అవసరం కాగా, జిల్లాలో సాగుకు సంబంధించి 20 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరం ఉంది. జిల్లాకు 16 పత్తి విత్తన కంపెనీలు 19 లక్షల విత్తన ప్యాకెట్లను సరఫరా చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్‌కు నివేదించాయి.

News May 29, 2024

కర్నూలు: తుంగభద్రలో మొసలి కలకలం

image

నందవరం మండలం నాగలదిన్నె సమీపంలో తుంగభద్ర నదిలో మంగళవారం ఓ మొసలి కనిపించింది. నాలుగు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర నదిలో నీరు ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వరద నీటిలో మొసలి కొట్టుకొచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన నాగలదిన్నె వంతెనపై వెళ్తున్న ప్రజలు నది మధ్యలో తిరుగుతున్న మొసలిని చూశారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

News May 29, 2024

ఎన్నికల్లో నాదే విజయం: బుడ్డా రాజశేఖర్ రెడ్డి

image

జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్‌లో విజయం తనదేనని శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఆత్మకూరు టీడీపీ కార్యాలయంలో శ్రీశైలం నియోజకవర్గ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తాను ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. తనకోసం పనిచేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

News May 29, 2024

కొలిమిగుండ్ల : పెట్నికోట కేసులో మొత్తం 54మంది నిందితుల అరెస్ట్

image

కొలిమిగుండ్ల మండలంలోని పెట్నికోట గ్రామంలో మే-13న పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న గొడవకు సంబంధించి మొత్తం 54మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు కొలిమిగుండ్ల సీఐ గోపీనాథ్ రెడ్డి వెల్లడించారు. ఇందులో టీడీపీ, వైసీపీ వర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారని పేర్కొన్నారు. మంగళవారం అరెస్టు చేసిన నిందితులతో కలిపి ఇప్పటివరకు మొత్తం 54మంది నిందితులను రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.

News May 28, 2024

నంద్యాల: హత్య కేసులో నిందితుడు అరెస్ట్

image

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని కనకాద్రిపల్లె గ్రామంలో ఈనెల 26న భార్య వడ్డే సుగుణమ్మను దారుణంగా హత్య చేసిన భర్త వడ్డే రమణయ్యను మంగళవారం అరెస్టు చేసినట్లు కొలిమిగుండ్ల సీఐ గోపీనాథరెడ్డి వెల్లడించారు. తనను ఒంటరి వాడిని చేసి తరచూ గొడవ పడుతుందన్న కారణంతోనే నిద్రిస్తున్న భార్య సుగుణమ్మపై పదునైన కర్రతో కొట్టి చంపాడని వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామన్నారు

News May 28, 2024

కర్నూలు: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

విద్యుత్ షాక్‌తో యువకుడు మృతిచెందిన ఘటన మంగళవారం జరిగింది. మంత్రాలయం మండలం సుగూరు గ్రామానికి చెందిన రాజశేఖర్ (18) రేకుల షెడ్డులోని పశువులకు మేపు వేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. రేకుల షెడ్డుకు విద్యుత్ ఎర్త్ అవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు కుటుంబీకులు తెలిపారు.

News May 28, 2024

జూన్ 1 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

image

ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జూన్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయని డీఈఓ శామ్యూల్ తెలిపారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. పదో తరగతి పరీక్షలకు 930 మంది, ఇంటర్ పరీక్షలకు 1,265 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. ఆదోని, కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండలో మొత్తం 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

News May 28, 2024

కర్నూలు: గుండెపోటుతో హోంగార్డు మృతి

image

దేవనకొండ మండల పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు మంగళవారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది ప్రగాఢ సానుభూతి తెలిపారు. మండలంలో అందరికీ సుపరిచితుడైన శ్రీనివాసులు మృతి బాధాకరమని స్థానిక టీడీపీ నాయకుడు బడిగింజల రంగన్న ఆన్నారు.

News May 28, 2024

కర్నూలు: ప్రజల్లో ఉత్కంఠ.. 7 రోజుల్లో భవితవ్యం

image

‘ఈసారి కూడా కచ్చితంగా ఆయనే గెలుస్తాడు. లేదు లేదు ఈసారి తప్పక గెలుపు ఇతనిదే.’ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పల్లెలను మొదలుకొని పట్టణ ప్రాంతాల వరకు ఎక్కడ చూసినా ప్రజల నోట వినిపిస్తున్న మాటలివి. సరిగ్గా ఇవాల్టి రోజే (JUN-4)న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు/DEOలు కౌంటింగ్‌ నిర్వహణ కోసం చర్యలు చేపడుతున్నారు. మరి మీ నియోజకవర్గంలో ఈసారి గెలుపు ఎవరిని వరించేనో కామెంట్ చేయండి.

News May 28, 2024

నంద్యాల: ప్రమాదకరంగా వక్కిలేరు వంతెన

image

నంద్యాల జిల్లా చాగలమర్రి సమీపంలోని వక్కిలేరు వాగుపై బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన వంతెన శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారింది. వంతెనకు ఇరువైపులా ఏర్పాటుచేసిన రక్షణ గోడలు పూర్తిగా దెబ్బతిని కూలిపోవడంతో రాకపోకల సమయంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా రైతులు ఈ రహదారిలో ఎక్కువగా తిరిగే అవకాశం ఉన్నందున అధికారులు చర్యలు చేపట్టి రక్షణ గోడలు నిర్మించాలని కోరుతున్నారు.