India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూలులో త్వరలోనే హైకోర్టు బెంచ్ ప్రారంభించనున్నట్లు మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. శనివారం ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ దేవాలయ ప్రాంగణంలో టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన కార్యక్రమం నిర్వహించారు. మంత్రులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించి చేయలేదన్నారు. తమ ప్రభుత్వం హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తుందన్నారు.
తెలంగాణ షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు వాసులు ఇద్దరు మృతిచెందారు. రెడ్డిపాలెంలో పత్తి తీసేందుకు కర్నూలు నుంచి వలస కూలీలు శుక్రవారం రాత్రి ట్రైన్‌లో తిమ్మాపూర్‌కు వెళ్లారు. తిరిగి శనివారం రాత్రి ఓ ట్రాక్టర్లో వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో సోమమ్మ(55), మమత(5) అక్కడికక్కడే మృతిచెందారు. గాయాలైన ఇద్దరిని షాద్‌నగర్ ఆస్పత్రికి తరలించారు.
వికారాబాద్ జిల్లా లగచర్లలో ఇటీవల కలెక్టర్, అధికారులపై దాడి నేపథ్యంలో తెలంగాణ CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారుల మీద దాడులు చేయాల్సి వస్తే శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు కట్టేవాళ్లా? అంటూ ‘రైతు పండుగ‘ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘విపక్షాల ఉచ్చులో పడొద్దు.. కుటుంబాలు నాశనం చేసుకోవద్దు.. మహబూబ్‌నగర్ జిల్లాపై పగబట్టి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు’ అని అన్నారు.
క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలోనే గుర్తిస్తే నివారణ సాధ్యమని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. కర్నూలు వైద్య కళాశాలలో నిర్వహించిన స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తొలి సదస్సులో ప్రివెంటివ్ ఆంకాలజీ, ప్యాలియేటివ్ కేర్ అన్న అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కర్నూలు జిల్లాలో ఏర్పాటు కావడం గర్వకారణమన్నారు.
డిసెంబరు 7న మెగా పేరెంట్స్ టీచర్లు మీటింగ్ డేను ఉత్సాహభరితమైన వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా విద్యా శాఖాధికారులను ఆదేశించారు. శనివారం కర్నూలు కలెక్టరేట్ నుంచి మెగా టీచర్స్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ డే అపార్ కార్డుల జనరేషన్ పురోగతిపై సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అపార్ ఐడి జనరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
డిసెంబర్ 2న కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని కలెక్టర్ రంజిత్ బాషా శనివారం తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రాజకీయ పార్టీల నాయకులు అందించిన ఫిర్యాదులను పారదర్శకంగా విచారణ చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. శనివారం నంద్యాల కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం-2025లో భాగంగా జిల్లా కలెక్టర్ జీ. రాజకుమారి, జేసీ విష్ణుచరణ్‌తో కలిసి ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ కె.కన్నబాబు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో సమీక్ష నిర్వహించారు.
వక్ఫ్, దేవాదాయ భూములు ఆక్రమణలకు గురి కాకుండా రక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా వక్ఫ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వక్ఫ్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసి తొలి సమావేశాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు.
డిసెంబర్ 2న కర్నూలు కలెక్టరేట్ వద్ద వాలంటీర్లు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు షేక్ నూర్ అహ్మద్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాజ్ విహార్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు అధిక సంఖ్యలో పాల్గొని మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
NTR భరోసా పింఛను పథకం ద్వారా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నూతన మార్గదర్శకాలు జారీ చేసిందని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ మార్గదర్శకాల ప్రకారం పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యాజమాని మరణిస్తే వెంటనే అతని భార్యకు వితంతు పింఛన్ మంజూరు చేస్తామన్నారు. ఈ ఉత్తర్వులు 01.11.2024 తేదీ తర్వాత మరణించిన వారికి మాత్రమే వర్తిస్తాయని, అర్హులైన వారు వినియోగించుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.