India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
NTR భరోసా పింఛను పథకం ద్వారా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నూతన మార్గదర్శకాలు జారీ చేసిందని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ మార్గదర్శకాల ప్రకారం పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యాజమాని మరణిస్తే వెంటనే అతని భార్యకు వితంతు పింఛన్ మంజూరు చేస్తామన్నారు. ఈ ఉత్తర్వులు 01.11.2024 తేదీ తర్వాత మరణించిన వారికి మాత్రమే వర్తిస్తాయని, అర్హులైన వారు వినియోగించుకోవాలని కోరారు.
నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో శనివారం విషాదం ఘటన జరిగింది. ఆర్టీసీ అద్దె బస్సులో ప్రైవేట్ మెకానిక్ చిన్న వెంకట రమణారావు (గణపతి) రిపేరు పని చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రైవర్ చూసుకోకుండా బస్సును ముందుకు కదిలించడంతో బస్సు చక్రాలు మెకానిక్ తలపై నుంచి వెళ్లాయి. రమణారావు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో శుక్రవారం ఆమె కీలక బిల్లును ప్రవేశపెట్టారు. తన పార్లమెంట్ స్థానమైన నంద్యాల కేంద్రంలో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్(CICDP) ఏర్పాటు చేయాలని కోరుతూ ఎంపీ శబరి లోక్‌సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు.
ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. కర్నూలు మార్కెట్‌లో నిన్న గరిష్ఠంగా క్వింటా రూ.5,259 పలికింది. మధ్యస్థ ధర రూ.3,519గా ఉంది. ఉల్లి ధర అమాంతం పెరిగినా ఎండుమిర్చి ధరలు పతనమయ్యాయి. క్వింటా రూ.14,859 మాత్రమే పలికింది. గతేడాది ఇదే సమయానికి సుమారు రూ.25వేలు పలకడం విశేషం. ఇక వేరుశనగ కాయలు గరిష్ఠంగా రూ.6,850తో విక్రయాలు సాగుతున్నాయి.
హౌసింగ్‌కు సంబంధించి పురోగతి చూపని 153 మంది ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నోటీసులు పొందిన వారి వివరణల్లో సరైన కారణం లేకపోతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. కాంట్రాక్టర్లతో పీడీ హౌసింగ్, సబ్ కలెక్టర్, ఆర్డీవోలు సమావేశం ఏర్పాటు చేసుకొని ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా చేయాలన్నారు.
ఇస్తేమాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ఆత్మకూరులో జనవరిలో జరగనున్న ఉమామి తబ్లిగే ఇస్తేమా ఏర్పాట్లను ఆమె పరిశీలించి మాట్లాడారు. మత పెద్దలు కమిటీలను ఏర్పాటు చేసుకుని, అందరి సహకారంతో పనులు చేసుకోవాలన్నారు. ఏమైనా సౌకర్యాలు కావాలంటే తమకు తెలపాలని, అవాంఛనీయ ఘటనలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని మత పెద్దలను కోరారు.
ఎంఎస్ఎంఈ సర్వేను వేగవంతం చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి 1తేదీ నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా ఎంపీడీవోలను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఎంఎస్ఎంఈ సర్వే, హౌసింగ్, ఉపాధి హామీ, పీజీఆర్ఎస్, రీసర్వే, తదితర అంశాలపై స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. శుక్రవారం నుంచి సర్వే ప్రారంభం అయ్యిందని, వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
కర్నూలు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పించాలని కలెక్టర్ రంజిత్ బాషా ఎంపీడీవోలను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎమ్ఎస్ఎమ్ఈ సర్వే శుక్రవారం నుంచి ప్రారంభం అయిందన్నారు. ప్రభుత్వం ఈ అంశానికి ప్రాధాన్యత ఇస్తోందని, సర్వేను వేగవంతం చేయాలని ఆదేశించారు. సాగు నీటి సంఘాల ఎన్నికలను ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలన్నారు.
ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఆత్మకూరులో జరగబోయే ఉమామి తబ్లిగే ఇస్తేమా ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పార్కింగ్‌కు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. హెల్ప్ డిస్క్ కూడా ఏర్పాటు చేస్తామని, ఏదైనా సహాయం కావాలంటే అక్కడ అడిగి తెలుసుకోవచ్చని తెలిపారు.
పరీక్షలను సరిగ్గా నిర్వహించాలని ఇన్‌ఛార్జి వైస్ ఛాన్స్‌లర్ ఎన్టీకే నాయక్ అన్నారు. శుక్రవారం రాయలసీమ వర్సిటీ పరిధిలో డిగ్రీ 3వ, 5వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో 61 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. కర్నూలులో పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. 6,531 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 5,848 మంది హాజరయ్యారు. 683 గైర్హాజరయ్యారు.
Sorry, no posts matched your criteria.