Kurnool

News May 19, 2024

డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో 11 మంది డిబార్

image

డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా శనివారం 11 మంది డిబార్ అయినట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. కాగా నంద్యాల పీఎస్సీ అండ్ కేవీఎస్సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నలుగురు, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఇద్దరు, నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇద్దరు, సెయింట్ జోసప్, ఆళ్లగడ్డ ప్రజ్ఞ డిగ్రీ కళాశాల, అనంత డిగ్రీ కళాశాలల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 11 మంది విద్యార్థులను డిబార్ చేసినట్లు తెలిపారు.

News May 19, 2024

నంద్యాల: ఆ కళాశాలల వద్ద 144 సెక్షన్ అమలు

image

ఈవీఎం బాక్సులను భద్రపరిచిన ఆర్జీయం, శాంతిరామ్ ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ కె.శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి తెలిపారు. శనివారం కళాశాలల్లో ఉంచిన ఈవీఎంల భద్రతా ఏర్పాట్లు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. కౌంటింగ్ పూర్తయ్యేవరకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామన్నారు. జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ఉన్నారు.

News May 18, 2024

జూన్ 4న ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది: బాలనాగిరెడ్డి

image

జూన్ 4న ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు పథకాలకు సంబంధించి డబ్బులు చెల్లించకుండా ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేసి చెల్లింపులు నిలిపివేయించారని ఆరోపించారు. చెప్పిన మాట ప్రకారం అదే ఎన్నికల సంఘం అనుమతితో ఇవాళ అన్నదాతలకు పంట నష్టపరిహారం వైసీపీ ప్రభుత్వం అందజేసిందని తెలిపారు.

News May 18, 2024

బనగానపల్లె: దద్దనాల ప్రాజెక్టుకు 4 అడుగుల నీరు

image

బనగానపల్లె మండలం ఎర్రమల కొండల్లో శుక్రవారం రాత్రి అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ కారణంగా దద్దనాల ప్రాజెక్ట్ ఎగువన వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ప్రధానంగా మద్దిలేటిస్వామి క్షేత్రం పరిధిలో కురిసిన వర్షాలకు ఎగువ నుంచి వచ్చిన నీటిప్రవాహంలో అడుగంటిన దద్దనాల ప్రాజెక్టుకు 4 అడుగుల నీరు చేరింది. దీంతో ఈ ప్రాంత ప్రజలు, రైతాంగం ఆనందం వ్యక్తం చేశారు.

News May 18, 2024

బ్యాంకు ఖాతా నుంచి రూ.5 లక్షలు చోరి

image

ఎమ్మిగనూరు మండలం కొటేకల్‌కు చెందిన ఇబ్రహీం అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ.5లక్షలు కాజేశారు. ఇబ్రహీం ఎమ్మిగనూరులోని యూనియన్ బ్యాంక్ బీసీ నిర్వహకుడిగా పనిచేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు తన ఫోన్‌ను హ్యాక్ చేసి అకౌంట్ నుంచి మూడు దఫాలుగా రూ.5 లక్షలు తస్కరించినట్లు పేర్కొన్నారు. రాజస్థాన్‌, హర్యానాకు చెందిన హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీబీఐ బ్యాంక్ ఖాతలకు బదిలీ అయినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.

News May 18, 2024

ఏపీటీఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా మాధవ స్వామి, శ్రీనివాసులు

image

ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నంద్యాల జిల్లా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బి.మాధవ స్వామి, నగిరి శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు హృదయ రాజు తెలిపారు. శనివారం నంద్యాల పట్టణంలోని జిహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏపీటీఎఫ్ నంద్యాల జిల్లా సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నూతన కమిటీ కృషిచేయాలని హృదయ రాజు ఆకాంక్షించారు.

News May 18, 2024

జొన్నగిరిలో గ్రామ పొలాల్లో వజ్రాల వేట ప్రారంభం

image

కర్నూలు జిల్లా తుగ్గలిలో తొలకరి జల్లులు కురవడంతో ఇక్కడి ప్రజలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. జొన్నగిరి గ్రామ పొలాల్లోకి వెళ్లి వజ్రాల అన్వేషణ ను శనివారం ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వజ్రాల వేట సాగుతోంది. ఒక్క వజ్రం దొరికితే తమ తలరాత మారిపోతుందన్న ఆశతో వజ్రాలు వెదుకుతున్నారు. గతేడాది కోట్ల విలువ చేసే వజ్రాలు దొరకడంతో ఆశలు చిగురించి ఈఏడాది జనం భారీగా పొలాల్లోకి తరలి వస్తున్నారు.

News May 18, 2024

ఆలూరు ఏడీఈపై సస్పెన్షన్ వేటు

image

ఆలూరు విద్యుత్ శాఖ ఏడీఈ నాగేంద్ర ప్రసాద్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల ముందు రోజు హాలహర్వి మండలంలో పలుచోట్ల విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడింది. హొలగుంద మండలంలో ట్రాన్స్‌ఫార్మర్, స్తంభాల అనధికారిక ఏర్పాట్లు, మే 13న పలు పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం వరకు విద్యుత్ అసౌకర్యం నెలకొనడంతో పాటు విధి నిర్వహణలో అలసత్వం వహించడం, అవినీతికి పాల్పడడంతో ఉన్నతాధికారులు ఆయనపై వేటు వేశారు.

News May 18, 2024

శ్రీశైలం ప్రాజెక్టులో కుక్కను చంపిన చిరుత

image

శ్రీశైలం వెస్టర్న్ కాలనీలోని నల్లబోతుల మల్లికార్జున ఇంటి ఆవరణలో కట్టేసిన కుక్కను చిరుత పులి చంపిన ఘటన అర్ధరాత్రి చోటు చేసుకుంది. మల్లికార్జున తెలిపిన వివరాల మేరకు.. రాత్రి రెండు గంటల సమయంలో పెద్ద శబ్దం వచ్చిందని ఆ సమయంలో బయటకు రాకుండా ఉదయం చూస్తే కుక్క చనిపోయి ఉందన్నారు. అటవీశాఖ సిబ్బంది వచ్చి పరిశీలించి చిరుతపులి దాడి చేసినట్లు పేర్కొన్నట్లు తెలిపారు.

News May 18, 2024

తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాల్లో కర్నూలు విద్యార్థుల ప్రభంజనం

image

తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాల్లో కర్నూలు విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. కాసేపటి క్రితం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. టాప్-5లో కర్నూలు జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు నిలిచారు. ఇంజినీరింగ్ విభాగంలో హర్ష స్టేట్ సెకెండ్ ర్యాంకు సాధించగా.. సాయియశ్వంత్ రెడ్డి ఐదో ర్యాంకు సాధించారు.