Kurnool

News May 17, 2024

కర్నూలు: కరెంటు షాక్‌తో 11 ఏళ్ల బాలుడి మృతి

image

పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం గ్రామానికి చెందిన చాకలి శివ(11) శుక్రవారం కరెంటు షాక్‌తో మృతిచెందాడు. చాకలి లక్ష్మి, రామాంజి కొడుకు శివ ఉదయం మిద్దెపైన వేలాడుతున్న కరెంటు వైర్ తాకడంతో షాక్ తగిలింది. కుటుంబ సభ్యులు వెళ్లి చూసేలోగా అప్పటికే శివ మృతిచెందాడు. కొడుకు మృతితో తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు.

News May 17, 2024

వైసీపీ నాయకుల తీరు వల్లే హింసాత్మక ఘటనలు: ఎంఏ గఫూర్

image

వైసీపీ నాయకుల తీరు కారణంగానే రాష్ట్రంలో ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ ఆరోపించారు. ఎన్నికల అనంతరం హింస చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. మాచర్ల, తాడిపత్రి, తిరుపతిలో దాడులకు వైసీపీనే కారణమని విమర్శించారు. రాజంపేటలో ఉన్న అధికారి తాడిపత్రికి వచ్చి ఎలా దాడులు చేస్తారని ప్రశ్నించారు. వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

News May 17, 2024

తల్లి మందలించిందని కుమారుడి ఆత్మహత్య

image

బేతంచెర్ల మండలం గోరుమానుకొండకు చెందిన సండ్రబోయిన వెంకటేశ్వర్లు, రాములమ్మ దంపతుల కుమారుడు వంశీ(22) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. వంశీ చెడు వ్యసనాలకు బానిసై బాధ్యత లేకుండా తిరుగుతుండటంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన వంశీ గ్రామ చివర్లో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర గాయాల పాలైన వంశీని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.

News May 17, 2024

కూటమిదే అధికారం: కేఈ కృష్ణమూర్తి

image

సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం సాధిస్తుందని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టనున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ధీమా వ్యక్తం చేశారు. కర్నూలులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తదితరులతో పోలింగ్ సరళిపై విశ్లేషించారు. 2019లో జగన్ మోసపూరిత వాగ్దానాలతో గెలిచారన్నారు.

News May 17, 2024

ఓట్ల లెక్కింపునకు సిద్ధం కండి: నంద్యాల కలెక్టర్

image

నంద్యాల జిల్లాలోని ఆరు అసెంబ్లీ, ఓ పార్లమెంట్ సెగ్మెంట్‌కు సంబంధించి జూన్ 4న ఓట్ల లెక్కింపునకు ఆర్ఓలు, నోడల్ అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ కే.శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఈ మేరకు JC రాహుల్ కుమార్ రెడ్డి, ఎస్పీ రఘువీర్ రెడ్డితో కలిసి సమీక్షించారు. RGM, SREC కళాశాలలో ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల అనంతరం EVM ఓట్లు లెక్కించాలన్నారు.

News May 16, 2024

బాలనాగిరెడ్డికి 30వేల మెజారిటీ తథ్యం: వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్మి

image

పెద్దకడబూరు మండలంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి 6 వేల మెజారిటీ వస్తుందని వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తంరెడ్డి స్పష్టం చేశారు. గురువారం పెద్దకడబూరులో ఆయన మాట్లాడుతూ.. మండలంలోని బీసీ కార్డు టీడీపీకి పనిచేసి ఉంటే వైసీపీకి 6 వేలు మెజారిటీ వస్తుందని, పని చేయకపోతే 10వేలు తప్పనిసరిగా వస్తుందని, జూన్ 4న జరిగే కౌంటింగ్లో బాలనాగిరెడ్డికి 30వేల మెజారిటీ తథ్యమని అన్నారు.

News May 16, 2024

నల్లమల అడవిలో బర్రెలతో సహా యువకుడు మిస్సింగ్

image

ఆత్మకూరు మండలం ఇందిశ్వరం గ్రామానికి చెందిన యువకుడు తరుణ్ అదృశ్యమయ్యాడు. బర్రెలు కాచేందుకు బుధవారం నల్లమల అడవిలోకి వెళ్లిన తరుణ్ బర్రెలతో పాటు తప్పిపోయాడు. వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అతడి కుటుంబీకులు ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అడవిలో గాలిస్తున్నారు. డ్రోన్ సహాయంతో తరుణ్ జాడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఐ లక్ష్మీనారయణ తెలిపారు.

News May 16, 2024

ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

కర్నూలు నగరంలోని రాయలసీమ యూనివర్సిటీలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవిఎమ్ యంత్రాలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్‌లను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి డా జి.సృజన గురువారం పరిశీలించారు. అనంతరం ఈవీఎంలను సిసి ఫుటేజ్ ద్వారా ఎప్పటికప్పుడు పరివేక్షించాలన్నారు. జేసీ మౌర్య, డిఆర్వో పాల్గొన్నారు.

News May 16, 2024

శ్రీశైలం: పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య!

image

కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీశైలంలో జరిగింది. శ్రీశైలం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌‌కు చెందిన శంకర్ రెడ్డి అనే కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసు స్టేషన్‌లో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న సీఐ ప్రసాద్ రావు అక్కడికి చేరుకొని విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 16, 2024

బండి ఆత్మకూరు : 20మందికి వాంతులు విరోచనాలు

image

బండి ఆత్మకూరు మండలంలోని ఎర్రగుంట్ల గ్రామంలో వాంతులు విరోచనాలతో బుధవారం నుంచి సుమారు 20 మంది ఇబ్బందులకు గురయ్యారు. పలువురు నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారు. వాంతులు, విరోచనాలకు కారణం కలుషిత తాగునీరు అనే గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.