Kurnool

News May 16, 2024

పత్తికొండలో అత్యధికం.. కర్నూలు రూరల్‌లో అత్యల్పం

image

కర్నూలు జిల్లాలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పత్తికొండలో మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు అత్యధికంగా 42.4 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. అలూరు 5.2, కౌతాళం 4.6, అస్సరి3.8, కర్నూలు అర్బన్ 3.6, కల్లూరు 3.2 ఆధోని, కర్నూలు రూరల్‌లో 1.2, మొత్తం 8 మండలాల్లో 65.2 మి.మీ వర్షపాతం నమోదైంది.

News May 16, 2024

చిప్పగిరి మండలంలో వర్షం

image

చిప్పగిరి మండలంలో భారీ వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉక్కపొతతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు.

News May 16, 2024

కర్నూలు: స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించిన ఎన్నికల అధికారి భార్గవ తేజ్

image

కర్నూలు శివారులోని రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ స్ట్రాంగ్ రూమ్‌ను ఎన్నికల అధికారి భార్గవ తేజ్ బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ సీల్‌లను ఆయన పరిశీలించారు. ఎన్నికల కౌంటింగ్ వరకు పకడ్బందీగా పహారా కాయాలని ఆయన ప్రత్యేక పోలీస్ సిబ్బందికి ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను చేపట్టారు.

News May 15, 2024

చింత చిగురు కోసం వెళ్లి.. మహానంది దేవస్థానం ఏజెన్సీ ఉద్యోగి మృతి

image

మహానంది దేవస్థానంలోని ఏజెన్సీ విభాగంలో పనిచేస్తున్న ఎలగాని గోవింద్ చింతచిగురు కోసం బుధవారం చింతచెట్టు ఎక్కి కోస్తుండగా కొమ్మ విరిగిపడింది. దీంతో తీవ్ర గాయాలపాలైన గోవింద్‌ను ఆలయ ఏఈఓ వెంకటేశ్వర్లు, అర్చకులు శరభయ్య చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

News May 15, 2024

కర్నూలు జిల్లాలో ఎంతమంది ఓటేయలేదంటే..?

image

కర్నూలు జిల్లాలో 20.54 లక్షల మంది ఓటర్లు ఉండగా.. 4.84 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. పురుషులు 10,13,794 మంది ఉండగా 7.88 లక్షల మంది ఓటేశారు. మహిళలు 10,40,451 మంది ఉండగా 7.81 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గల వారీగా కర్నూలు 99,492మంది, ఆదోని 87,994, పాణ్యం 84,771, కోడుమూరు 50,814, ఆలూరు 49,905, ఎమ్మిగనూరు 44,666, పత్తికొండ 33,594, మంత్రాలయం 32,683మంది ఓటువేయలేదు.

News May 15, 2024

స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించిన నంద్యాల కలెక్టర్

image

నంద్యాల పట్టణ శివారు ప్రాంతంలోని ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లు, కమాండ్ కంట్రోల్ రూంను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.కె.శ్రీనివాసులు పరిశీలించారు. సాంకేతిక నిపుణులకు పలు ఆదేశాలు జారీ చేశారు. కమాండ్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాల ఫుటేజ్‌ను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News May 15, 2024

కర్నూలు: స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 144 సెక్షన్ అమలు

image

కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో 3 బ్లాకులలో, 16 స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రతను కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ బుధవారం పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సిసి కెమెరాల కమాండ్ కంట్రోల్‌ను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని… ప్రతి స్ట్రాంగ్ రూమ్ , పరిసరాలలో సిసిటీవి కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.

News May 15, 2024

స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద స్ట్రాంగ్ సెక్యూరిటీ ఏర్పాటు చేశాం: ఎస్పీ

image

కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలోని 3 బ్లాకులలో, 16 స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రతను కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ బుధవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి స్ట్రాంగ్ రూమ్ పరిసరాలలో సిసి టివి కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ ఇంజన్లను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

News May 15, 2024

నంద్యాల: ఎంసెట్ అభ్యర్థులకు ముఖ్య గమనిక

image

ఈనెల 17 నుంచి ఏపీ ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇటీవలే హాల్ టికెట్లు కూడా విడుదల చేశారు. పలువురు అభ్యర్థులకు నంద్యాల జిల్లాలోని ఆర్జీఎం, శాంతిరాం కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించారు. అయితే ఈ కళాశాలల్లో ఈవీఎంలను భద్రపర్చడంతో ఆ 2 కళాశాలలను పరీక్షా కేంద్రాల జాబితా నుంచి తొలగించారు. డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్లలో ఈ కేంద్రాలు ఉంటే మళ్లీ కొత్తగా డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.

News May 15, 2024

కర్నూలు: వామ్మో.. ఒక్కరోజే రూ.5 కోట్ల మద్యం అమ్మకాలు

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో మంగళవారం ఒక్కరోజే రూ.5 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మద్యం దుకాణాలు మూసివేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు తెరుచుకోవడంతో మందుబాబులతో కిటకిటలాడాయి. భారీగా అమ్మకాలు జరగడంతో ఒక్కరోజే రూ.5 కోట్ల అమ్మకాలు జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.