Kurnool

News May 15, 2024

కర్నూలు: 4 దశాబ్దాలుగా ఆ 5 గ్రామాల్లో ఒకే పార్టీకి ఓట్లు.. కానీ ఇప్పుడు..!

image

ఎమ్మిగనూరు NLA చెన్నకేశవరెడ్డికి పట్టున్న కడిమెట్ల, సిరాళ్లదొడ్డి, గువ్వలదొడ్డి, రాళ్లదొడ్డి, ఎర్రకోటలో ఈ ఎన్నికల్లో తొలిసారిగా TDP ఏజెంట్లు కూర్చున్నారు. ఈ 5 గ్రామాల్లో 4 దశాబ్దాలుగా ఏకపక్షంగా ఎన్నికలు జరిగేవి. MLA ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఓట్లు పడేవి. ఈ గ్రామాల్లో సుమారు 10 వేల ఓట్లు ఉండగా పోటీలోని ఇతర పార్టీకి అరకొరగా ఓట్లు పడేవి. ఇటీవల MLA సోదరుల కుమారులు TDPలో చేరడంతో ఏజెంట్లు కూర్చున్నారు.

News May 15, 2024

కర్నూలు: రెండు బైకులు ఢీ.. వ్యక్తి స్పాట్‌‌ డెడ్‌

image

తుగ్గలి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. మండలంలోని రాంపల్లికి చెందిన బోయ రమేశ్(25) పెండేకల్లు ఆర్ఎస్ నుంచి గ్రామానికి బైక్‌పై వస్తుండగా.. అదే గ్రామానికి చెందిన బోయ నాగరాజు ఎదురుగా రావడంతో అదుపుతప్పి ఢీకొన్నాయి. ప్రమాదంలో రమేశ్ అక్కడికక్కడే మృతి చెందగా.. నాగరాజుకు తీవ్ర గాయలయ్యాయి. చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News May 15, 2024

కర్నూలు: బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన జడ్పీటీసీ

image

తుగ్గలి మండలం జడ్పీటీసీ పులికొండ నాయక్ ఆకస్మికంగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. చికిత్స కోసం ఆయనను కర్నూలులోని ఓ ఆసుపత్రికి తరలించారు. పత్తికొండ వైసీపీ అభ్యర్థి శ్రీదేవి ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు.

News May 15, 2024

కురువళ్లిలో వంద శాతం ఓటింగ్‌

image

కర్నూలు జిల్లాలో 76.80 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా ఆలూరు మండలం కురువళ్లి గ్రామంలోని 109 పోలింగ్‌ కేంద్రంలో 100 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ పోలింగ్‌ కేంద్రంలో మొత్తం 940 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 460, మహిళలు 480 మంది ఉన్నారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులు మంగళవారం తెలిపారు.

News May 15, 2024

భద్రతా సిబ్బందికి సూచనలు చేసిన నంద్యాల ఎస్పీ

image

జిల్లావ్యాప్తంగా నిన్న జరిగిన ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఈవీఎం బాక్స్‌లను RGM, శాంతిరాం ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచినట్లు ఎస్పీ రఘువీర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం స్ట్రాంగ్‌రూమ్ వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల కేంద్ర పోలీస్ బలగాలు జిల్లా ఆర్ముడ్ పోలీసులు, సివిల్ పోలీస్ బందోబస్తును పరిశీలించి వారికి పలు సూచనలు, ఆదేశాలను జారీ చేశారు.

News May 14, 2024

ఆలూరు: ఓటు వేయడానికి వచ్చి వ్యక్తి మతి

image

ఆలూరు మండలం మొలగవల్లి కొట్టాలలో ఓటు వేయడానికి వచ్చిన దుగునూరు చిట్టిబాబు(32) మృతి చెందారు. హైదరాబాద్ నుంచి బస్సులో వస్తుండగా 12వ తేదీ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మృతుడి భార్య పద్మావతి గత ఏడాది మరణించగా ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సిరి మోక్షిత్, సుశాంత్ తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మిగిలారు. స్థానికుడు రాజు సమాచారంతో వైసీపీ MLA అభ్యర్థి కొడుకు చంద్రశేఖర్ మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.

News May 14, 2024

కర్నూలు: పిడుగుపాటుతో గొర్రెల కాపారి మృతి

image

పిడుగుపాటుకు గురై గొర్రెల కాపారి మృతిచెందిన ఘటన మంగళవారం జరిగింది. ఆత్మకూరు మండలం అమలాపురం గ్రామానికి చెందిన తెలుగు పెద్ద ఆంజనేయులు వెంకటాపురం గ్రామ శివారులో గొర్రెలు మేపుతున్నాడు. అదే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుడంగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.

News May 14, 2024

నంద్యాల: పోలింగ్ కేంద్రం వద్దే భూమా ముఖ్య అనుచరుడి మృతి

image

మండల కేంద్రం శిరివెళ్లకు చెందిన భూమా కుటుంబ ముఖ్య అనుచరుడు నాలి వలి గుండెపోటుతో సోమవారం సాయంత్రం మృతిచెందారు. ఓటు వేసేందుకు వెళ్లిన ఆయన.. పోలింగ్ కేంద్రం వద్దే కుప్పకూలి మరణించారు. మృతి పట్ల టీడీపీ అభ్యర్థి భూమా అఖిల ప్రియ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం శిరివెళ్లకు చేరుకుని వలి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు.

News May 14, 2024

కర్నూలు: పోలింగ్ కేంద్రంలో వ్యక్తి మృతి

image

మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన ఈరన్న సోమవారం ఓటేసేందుకు వెళ్లి పోలింగ్ బూత్‌లోనే మృతిచెందారు. మాధవరంలో ప్రాథమిక పాఠశాలలో ఓటేసేందుకు గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. అప్పటికే కళ్లు తిరుగుతున్నాయని తోటి ఓటర్లతో చెప్పారు. చివరికి ఓటు వేసి బయటకు వస్తుండగా స్పృహ తప్పి పడిపోయారు. అక్కడే ఉన్న ఎన్నికల సిబ్బంది, తోటి ఓటర్లు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందారు.

News May 14, 2024

నంద్యాల: ‘ఓటు వేశాడు.. మృతి చెందాడు’

image

నంద్యాల జిల్లా పగిడ్యాల మండల కేంద్రంలోని మజారా
గ్రామమైన బీరవోలులో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయ నరసింహుడు(58) పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. అనంతరం ఇంటికి వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు.